Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • జిల్లా కలెక్టర్ శ్రీమతి ఇలా త్రిపాఠి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంగా వచ్చిన వార్త ప్రముఖ పత్రికల్లో ప్రచురితమవడం నాకు ఆనందంగా ఉంది.

    ధన్యవాదాలతో..
    డా. కవితా రెడ్డి
    349 Views
  • జనగణన 2027 కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న హౌస్ లిస్టింగ్ సెల్ఫ్ ఎన్యుమరేషన్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు
    గురువారం రోజు ఉదయం మండలంలోని పడమటి కోన గ్రామం బోరెడ్డి గారి పల్లిలో మంత్రిగారి స్వగృహం నందు జన గణన 2027 కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ అధికారులు నిర్వహిస్తున్న హౌస్ లిస్టింగ్ సెల్ఫ్ ఏ న్యుమరేషన్ ప్రక్రియను గౌరవ రవాణా మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు స్వయంగా పూర్తి చేయడం నిజంగా ఆదర్శప్రాయమైన ముందడుగు ప్రజలు తో ప్రత్యక్షంగా కలిసిపోయి ప్రభుత్వ కార్యక్రమాలపై నమ్మకం పెంచేలా నాయకులు...
    360 Views
  • రాయచోటి పట్టణంలో నూతన పార్కు పనులను పరిశీలించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు
    రాయచోటి పట్టణం ఎస్ఎన్ కాలనీలో మున్సిపల్ నిధులతో సుమారు 47 లక్షలతో జరుగుతున్న నూతన పార్కు పనులను గురువారం ఏపీ రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు పరిశీలించారు పనులు పూర్తి చేయాలని గుత్తేదారుడికి సూచించారు 
    351 Views
  • టీడీపీ నాయకులు డీఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశారు.
    గురువారం అన్నమయ్య జిల్లా మదనపల్లెలో టీడీపీ రాష్ట్ర సీనియర్ యువ నాయకులు కట్ట దొరస్వామి నాయుడు, డీఎస్పీ పావనిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గానికి సంబంధించిన ప్రజా సమస్యలు, శాంతిభద్రతల పరిరక్షణపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని వారు డీఎస్పీని కోరారు.
    238 Views
  • మదనపల్లె ఆసుపత్రిలో రోగికి నిర్లక్ష్యం.. బంధువుల ఆవేదన.
    అన్నమయ్య జిల్లా మదనపల్లె ప్రభుత్వ సర్వ బోధన ఆసుపత్రిలో రోగిని పట్టించుకోలేదనే ఆరోపణలు గురువారం చర్చనీయాంశంగా మారాయి. అత్యవసర పరిస్థితిలో రోగిని స్ట్రెచర్‌పై తీసుకువచ్చినా, వైద్య సిబ్బంది స్పందన ఆలస్యమైందని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో ఆసుపత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా, ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
    246 Views
  • రేపు ప్రజాదర్బార్
    తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత రెడ్డి గారి నివాసం లో ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు . నియోజకవర్గ ప్రజలు ఏమైన సమస్యలు పిర్యాదులు ఉంటే ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి అని కోరారు 
    601 Views
  • విజయనగరంలో రేపు జాబ్ మేళా..
    విజయనగరం MR కాలేజీలో ఈనెల 17న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వహీదా గురువారం తెలిపారు. ఉ.10.30 గంటలకు ప్రారంభమయ్యే మేళాలో టాటా ఎలక్ట్రానిక్స్, మెడ్స్, క్వెస్ కార్ప్, అపోలో ఫార్మసీ సంస్థలు పాల్గొంటాయని వెల్లడించారు. టెన్త్ టు డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణులై, 18-30 ఏళ్ల మధ్య వయస్సు గల అభ్యర్థులు అర్హులు. #BOIENA RAJESH 
    327 Views
  • అవినీతి..రూ.20 లక్షల గోల్ మాల్
    బాడంగిలోని పలు గ్రామాలలో ఉపాధి హామీ పనులలో అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీలలో గుర్తించారు. సామాజిక తనిఖీ ప్రజా వేదికను ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. మూడు క్లస్టర్లలో మస్టర్లు దిద్దుబాటు చేసి, పనికి రాకుండానే వచ్చినట్లు మస్టర్లు వేసి రూ. 20 లక్షల వరకు స్వాహా చేసినట్లు డీఆర్పీలు వెల్లడించారు. అవినీతి సొమ్ము రికవరీ చేయాలని జిల్లా అధికారులు ఆదేశించారు. #BOIENA RAJESH 
    292 Views