Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • చింతూరులో ' డ్రోన్ ' నెక్స్ట్ లెవల్ నిఘా 8 మంది అరెస్ట్
    ఆదివారం సరదాగా బయట కూర్చుని మందు కొడదామనుకున్న వారికి డ్రోన్ కెమెరా షాక్ ఇచ్చింది. చింతూరులోని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న 8 మందిని పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.గ్రామ శివార్లలో ఎవరూ చూడటం లేదనుకుని సిట్టింగ్ వేసిన వారిపై డ్రోన్ సహాయంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ ఆపరేషన్ లో ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్లు ఎస్‌ఐ సంతోష్ కుమార్ గారు వెల్లడించారు.కేవలం ఈ ఒక్క రోజే...
    373 Views
  • అన్నమయ్య జిల్లా జూనియర్ బాలికల హాకీ జట్టు ఎంపిక.
    మదనపల్లె బీటీ కాలేజ్ హాకీ గ్రౌండ్‌లో ఆదివారం అన్నమయ్య జిల్లా జూనియర్ బాలికల హాకీ జట్టు ఎంపిక ట్రయల్స్ జరిగాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 32 మంది క్రీడాకారిణులు పాల్గొన్న ఈ ట్రయల్స్‌లో ప్రతిభ కనబరిచిన 18 మందిని ఎంపిక చేశారు. వీరు ఏప్రిల్ 16 నుంచి 18 వరకు చిత్తూరులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారు. హాకీ అసోసియేషన్ కార్యదర్శి శివప్రసాద్ ఈ వివరాలు తెలిపారు. ఈ...
    265 Views
  • అన్నమయ్య: బెట్టింగ్ మాయలో యువత జాగ్రత్త: ఎస్పీ హెచ్చరిక.
    అన్నమయ్య జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, ఎస్పీ ధీరజ్ యువతకు ఆదివారం హెచ్చరిక జారీ చేశారు. సెల్‌ఫోన్‌లో వచ్చే యాప్‌లు, లింకుల ద్వారా బెట్టింగ్‌లో పడి ఆర్థికంగా నష్టపోతున్నారని, ఇది అప్పులు, కుటుంబ సమస్యలు, నేరాలకు దారితీస్తుందని తెలిపారు. బెట్టింగ్‌లో పాల్గొంటే క్రిమినల్ కేసులు నమోదు అవుతాయని హెచ్చరించారు.
    266 Views
  • మదనపల్లె రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు.
    మదనపల్లె మండలంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. వినుకొండకు చెందిన తిరుమల దావీదురాజు (26) పుంగనూరు రోడ్డులో బైకుపై వెళ్తుండగా, తట్టివారిపల్లె బైపాస్ వద్ద ఎదురుగా వచ్చిన వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో యువకుడు తీవ్రంగా గాయపడగా, స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
    221 Views
  • గుడిసెవారిపల్లెలో బైక్ దగ్ధం : ఉద్రిక్తత.
    మదనపల్లె మండలం గుడిసివారి పల్లెలో ఆదివారం రెండు వర్గాల మధ్య వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పరస్పర దాడుల నేపథ్యంలో ప్రత్యర్థి వర్గానికి చెందిన ద్విచక్ర వాహనాలకు నిప్పు పెట్టడంతో బైక్‌లు దగ్ధమయ్యాయి. ఈ ఘటనతో గ్రామంలో భయాందోళన నెలకొంది. సమాచారం అందుకున్న తాలూకా పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
    290 Views
  • మదనపల్లి లో కారు ఢీకొని ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలు.
    ఆదివారం మదనపల్లెలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మాలెపాడు గ్రామం, ఆవులపల్లికి చెందిన వెంకటేశ్, గంగరాజు, శివ అనే ముగ్గురు యువకులు బైకుపై మదనపల్లె టమాటా మార్కెట్ వైపు వెళ్తుండగా ఎన్టీఆర్ సర్కిల్ వద్ద కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి వారిని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేపట్టారు.
    280 Views
  • మదనపల్లె : ఆర్ఓ పల్లవికి వరస్ట్ వారెంట్.
    మదనపల్లె మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్ జీవి పల్లవికి హైకోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ప్లాన్ అనుమతి లేకుండా జరుగుతున్న నిర్మాణాన్ని అడ్డుకోలేదని ఆరోపిస్తూ దాఖలైన కేసులో విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించినప్పటికీ ఆమె హాజరుకాలేదు. దీనిని కోర్టు ధిక్కారంగా భావించి, బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ, ఈనెల 30న న్యాయస్థానం ముందు హాజరు పరచాలని జిల్లా ఎస్పీకి ఆదేశాలు ఇచ్చింది. అరెస్ట్ చేసిన పక్షంలో...
    279 Views
  • నూతన కురుబ సంఘం నాయకులకు ఘన సన్మానం.
    మదనపల్లె డివిజన్ పరిధిలో నూతనంగా ఎన్నికైన రాష్ట్ర కురుబ సంఘం నాయకులకు ఏప్రిల్ 14, మంగళవారం ఉదయం 10 గంటలకు మర్పూరి వీధిలోని ప్రెస్ క్లబ్‌లో ఘన సన్మానం జరగనుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కురుబ కురుమ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప, రాష్ట్ర కురుబ కురుమ సంఘం అధ్యక్షుడు ఎస్‌కే మల్లికార్జున ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. మదనపల్లెకు చెందిన బెల్లె రెడ్డి ప్రసాద్ రాష్ట్ర వర్కింగ్...
    283 Views
  • ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ శ్రీ దుదిల్ల శ్రీపాదరావు వర్ధంతి.
     శాసనసభ మాజీ స్పీకర్ దివంగత నేత  శ్రీపాద రావు వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి నా ఘన నివాళులు, ప్రజల హృదయాలలో స్థిర స్థాయిగా ఈ నిలిచిన నేత కడవరకు స్నేహ మార్గాన ప్రయాణించిన చరిత, బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి. నిజాయితీకి ప్రతిబింబం, నిస్వార్ధ సేవకు చిహ్నం.  జాతీయ మానవ హక్కుల కమిటీ కరీంనగర్ చైర్మన్ సదానందం తలకొక్కుల.
    896 Views
  • సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. ఏపీ మంత్రులకు సింగపూర్‌లో ప్రత్యేక శిక్షణ.
    ఏపీలో ప్రజలకు మరింత వేగంగా, పారదర్శకంగా సేవలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్ర మంత్రివర్గంలోని తొమ్మిది మంది మంత్రులకు సింగపూర్‌లో ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ నెల 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు వారం రోజుల పాటు ఈ శిక్షణ జరగనుంది. సుపరిపాలన, ఆధునిక పరిపాలన పద్ధతులు, ఆర్థికాభివృద్ధికి అవసరమైన నైపుణ్యాలపై మంత్రులకు అవగాహన...
    341 Views