Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • మదనపల్లెలో అనుమానాస్పద మృతి.. దర్యాప్తు ప్రారంభం.
    మదనపల్లె పట్టణంలో సోమవారం అన్సర్ (65) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బొంబూవీధికి చెందిన అన్సర్, స్థానిక ఖాజా కూరగాయల మార్కెట్‌లో రైటర్‌గా పనిచేస్తున్నాడు. ఇంట్లో తలకు గాయాలతో కనిపించిన అతడిని కుటుంబ సభ్యులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
    337 Views
  • టీబీ ముక్త్ భారత్ అభియాన్ ప్రారంభం.. పోస్టర్ల విడుదల.
    ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా అన్నమయ్య జిల్లాలో టీబీ నిర్మూలనకు చర్యలు వేగవంతం చేయాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో టీబీ ముక్త్ భారత్ అభియాన్–100 రోజుల కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. మార్చి 24 నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో హై రిస్క్ గ్రామాలు, వల్నరబుల్ వర్గాలపై ప్రత్యేక స్క్రీనింగ్ నిర్వహిస్తారు. ప్రతిరోజు ప్రత్యేక...
    280 Views
  • వెబ్‌ల్యాండ్ సమస్యలకు పరిష్కారం.. రైతులకు 1-B పత్రాలు.
    మదనపల్లె జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న వెబ్‌ల్యాండ్ సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో 10 మంది రైతులకు 1-B పత్రాలు అందజేశారు. మదనపల్లె, రాయచోటి సబ్ డివిజన్లలో సర్వే నంబర్ సవరణలు, అడంగల్ లోపాలను సరిచేసి సమస్యలు పరిష్కరించారు. ఈ నెలలోనే 22ఏ భూమి సమస్యలలో 70కు పైగా కేసులు పరిష్కరించినట్లు కలెక్టర్ వెల్లడించారు. రైతులకు భూమి...
    326 Views
  • దొమ్మేటి వెంకటరెడ్డి ఆదర్శప్రాయులు: అదనపు ఎస్పీ.
    సమాజ సంస్కర్త, విద్యాదాత దొమ్మేటి వెంకటరెడ్డి సేవలు నేటి తరానికి ఆదర్శప్రాయమని జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) వెంకటాద్రి పేర్కొన్నారు. సోమవారం మదనపల్లెలోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆయన జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అదనపు ఎస్పీ మాట్లాడుతూ, సామాజిక సమానత్వం, వెనుకబడిన వర్గాల విద్యాభివృద్ధి కోసం వెంకటరెడ్డి చేసిన సేవలు...
    263 Views
  • పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్.
    జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కింద వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఆయన, ప్రభుత్వం పీజీఆర్ఎస్ అర్జీలపై ప్రత్యేకంగా సమీక్షిస్తున్నందున అధికారులు బాధ్యతాయుతంగా స్పందించాలని సూచించారు. పెండింగ్ కేసులను తగ్గించి, గ్రీవెన్స్ ఆడిట్ నిర్వహించాలని, అలాగే గ్రామాల స్థాయికి...
    287 Views
  • Megha Engineering: అమరావతిలో మళ్ళీ భారీ అగ్నిప్రమాదం.. ఈసారి మేఘా కంపెనీ పైపులు దగ్ధం.
          Megha Engineering: అమరావతిలో మళ్ళీ భారీ అగ్నిప్రమాదం.. ఈసారి మేఘా కంపెనీ పైపులు దగ్ధం 24-03-2026 Tue 06:33 | Andhra Megha Engineering Pipes Burned in Amaravati Fire Accident   ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరో భారీ అగ్నిప్రమాదం కలకలం రేపింది. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో తుళ్లూరు మండలం రాయపూడి వద్ద భారీగా మంటలు ఎగసిపడ్డాయి. రాజధాని పనుల కోసం మేఘా ఇంజినీరింగ్...
    552 Views
  • ముస్లింలకు కూర్చోపెట్టి దగ్గరుండి వడ్డించడం : హిందువులకు మాత్రం గుడి గోపురం పై నిలబడి విసిరేయడం
    ఇది జరిగింది ఎక్కడో కాదు తెలంగాణలోనే మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ లీడర్ ఐన జగ్గారెడ్డి గారు.ముస్లిం ల పండుగలు దగ్గరుండి వడ్డించి వడ్డించే సేవకుల పై అరుస్తూ వీళ్లకు ఇది రాలేదు వాళ్ళకి అది రాలేదు చూడండి వడ్డించండి అని దగ్గరుండి చూసుకున్నాడు. హిందువుల పండుగకు మాత్రం కనీసం జనాల్లోకి వెళ్లకుండా ప్రసాదం(పేలాల ముద్దలు) గుడి గోపురం పై నుండి తన బిడ్డ మరియు ఇతరులతో కలిసి భక్తులకు విసిరేస్తే భక్తులు కూడా...
    313 Views
  • అనంతపురం: జిల్లా ప్రజలకు గొప్ప శుభవార్త
    *ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలకు తీపికబురు* 💐 *ఆర్డీటీకీ ఎఫ్.సి.ఆర్.ఏ పునరుద్ధరణ* 🙏 *ఆర్డీటీకీ ఎఫ్.సి.ఆర్.ఏ పునరుద్ధరణకు సహకరించిన* *గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి,* *గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి,* *కీలకంగా వ్యవహరించిన రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ గారికి*, *గౌరవ కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా గారికి* *ప్రత్యేక ధన్యవాదాలు...
    748 Views
  • ఐక్యతతో బిజెపిని బలోపేతం చేద్దాం - రాష్ట్ర యువ మోర్చా కార్యదర్శి మణి కుమార్
    నేడు చీరాల రోటరీ క్లబ్ లో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియన్ 2026 కార్యక్రమం నిర్వహించారు.    ఈ సందర్భంగా బిజెపి యువ మోర్చా రాష్ట్ర కార్యదర్శి మణి కుమార్ మాట్లాడుతూ నాయకులు అందరూ ఐక్యతగా ఉంటేనే బీజేపీ పార్టీని బలంగా చేయగలమని,ఏ పదవులు ఆశించకుండా ప్రతి కార్యకర్త తన సొంత కుటుంబాలుగా పనిచేసే ఏకైక పార్టీ బిజెపి మాత్రమేనని అన్నారు.ఓపిక ఉన్నంతవరకు...
    620 Views