Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • తిరుమలలో స్టేట్ ఫుడ్ లాబొరేటరీ, ఎఫ్ఎస్ఎస్ఏఐ (FSSAI) సంయుక్తంగా ఏర్పాటు చేసిన వాటర్ & ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు.

    ప్రసాదాల తయారీ కోసం వినియోగించే వివిధ పదార్థాలను పరీక్షించేలా ఈ ల్యాబ్ నిర్మాణం చేపట్టారు. రూ.25 కోట్ల వ్యయంతో ల్యాబ్ నిర్మాణాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తి చేసింది.
    #Tirumala
    #ChandrababuNaidu
    #AndhraPradesh
    2.4K Views
  • చీరాలలో ఉచిత క్యాన్సర్ శిబిరం
    రోటరీ క్లబ్ ఆఫ్ చీరాల - రోటరీ క్లబ్ ఆఫ్ ఖమ్మం సంయుక్త ఆధ్వర్యంలో "ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరం" పేరాల గోలి సదాశివరావు కళ్యాణ మండపము నందు 24-3-26 వ తేదిన ఉదయం గం.9-00 ల నుండి సాయంకాలం గం.4-00 వరకు జరుగునని, హైదరాబాద్ నందమూరి బసవ తారకం ఇండో - అమెరికన్ క్యాన్సర్ హాస్పటల్ - రీసెర్చ్ ఇన్స్టిట్యూ నుండి 6 గురు డాక్టర్లు,12మంది స్టాఫ్ విచ్చేసి, 200 మందికి ఉచితముగా అవసరమయిన వైద్య పరీక్షలు...
    684 Views
  • దైవ ప్రార్థనలు, ఉపవాస దీక్షలతో పవిత్ర రంజాన్ మాసం చివరి రోజు ఈద్ ఉల్ ఫితర్ పండుగ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ పవిత్ర దినం అందరి జీవితాల్లో సుఖశాంతులు, ఆరోగ్యం, శాంతి, ఆనందం నింపాలని ఆకాంక్షించారు.
    217 Views
  • డ్రగ్స్కు దూరంగా ఉండాలి
    డ్రగ్స్ కు దూరంగా ఉండాలని బొబ్బిలి పట్టణ సీఐ కె.నారాయణరావు కోరారు. బొబ్బిలి షాదీఖానాలో శనివారం జరుగుతున్న రంజాన్ నమాజ్లో ముస్లింలతో మాట్లాడారు. డ్రగ్స్ యువత జీవితాలు నాశనం అవుతున్నాయని, దూరంగా ఉండేలా పిల్లలపై పర్యవేక్షణ చేయాలని కోరారు. సైబర్ నేరాలు పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. మహిళలను గౌరవించాలని కోరారు. #BOIENA RAJESH
    324 Views
  • బొబ్బిలి మున్సిపాలిటీ అభివృద్ధికి సంపూర్ణ సహాయ సహకారాలు
    మున్సిపాలిటీ అభివృద్ధికి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే బేబినాయన చెప్పారు. మున్సిపల్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన ఆర్డీవో రామ్మోహనరావు శనివారం బొబ్బిలి కోటలో ఎమ్మెల్యే బేబినాయనను మర్యాదపూర్వకంగా కలిశారు. మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరిస్తామని, ఆదిశగా పని చేయాలని సూచించారు. అందరి సహకారంతో అభివృద్ధికి, ప్రజా సమస్యలు పరిష్కారానికి పని చేస్తానని ఆర్డీవో చెప్పారు. #BOIENA...
    464 Views
  • రోడ్డు పనులను పరిశీలించిన బేబినాయన
    బొబ్బిలి - తెర్లాం రోడ్డు పనులను ఎమ్మెల్యే బేబినాయన శనివారం పరిశీలించారు. రోడ్డు నిర్మాణ పనులు జరగడంతో పనులను పరిశీలించి ఆర్అండ్ బీ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.పనుల్లో నాణ్యత పాటించాలని, పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. రోడ్లు నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నామని బేబినాయన చెప్పారు. ఆయనతో టీడీపీ నాయకులు ఉన్నారు. #BOIENA RAJESH
    362 Views
  • మదనపల్లెలో రంజాన్ శుభాకాంక్షలు: మత సామరస్యానికి ప్రతీకగా నాయకులు.
    మదనపల్లెలో రంజాన్ పండుగ సందర్భంగా శనివారం పలువురు నాయకులు మత సామరస్యానికి ప్రతీకగా శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర హజ్ కమిటీ డైరెక్టర్ పఠాన్ ఖాదర్ ఖాన్ ఆహ్వానం మేరకు ఏఎంసీ చైర్మన్ జంగాల శివరామ్, విజయభారతి విద్యాసంస్థల అధినేత డాక్టర్ ఎన్.సేతు, టిడిపి నాయకులు ఎస్‌.ఎ. మస్తాన్, బీజేపీ నాయకులు అజమతుల్లా ఖాన్, జనసేన నాయకులు మస్తాన్, శేక్షవలి తదితరులు పఠాన్ ఖాదర్ ఖాన్ స్వగృహానికి వెళ్లి...
    313 Views
  • Chandrababu Naidu: తిరుమలలో అత్యాధునిక ఫుడ్ ల్యాబ్ ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.
    తిరుమల శ్రీవారి భక్తులకు అందించే ప్రసాదాలు, అన్నప్రసాదాల నాణ్యతను మరింత పెంచే దిశగా కీలక అడుగు పడింది. తిరుమలలో స్టేట్ ఫుడ్ లాబరేటరీ, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) సహకారంతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్మించిన అత్యాధునిక వాటర్ అండ్ ఫుడ్ అనాలసిస్ ల్యాబ్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ప్రారంభించారు. సుమారు రూ.25 కోట్ల వ్యయంతో ఈ...
    336 Views
  • పన్నులు సకాలంలో చెల్లిస్తే 50% వడ్డీ రాయితీ
    పన్నులు సకాలంలో చెల్లిస్తే వడ్డీపై 50% వడ్డీ రాయితీ వస్తుందని కమిషనర్ ఎల్.రామలక్ష్మి అన్నారు.బొబ్బిలి మున్సిపాలిటీలో శనివారం చేపట్టిన పన్నులు వసూళ్ల కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఆస్తిపన్ను, కుళాయి పన్ను, ఖాళీ స్థలాల పన్నులు నెలాఖరులోగ చెల్లిస్తే 50% వడ్డీ రాయితీ వస్తుందని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను కోరారు. పన్నులు సకాలంలో చెల్లించి మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలన్నారు. #BOIENA RAJESH
    377 Views
  • # కరీంనగర్ లో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ధాత్రి ఆయుర్వేద హాస్పిటల్ ప్రారంభోత్సవం.
    కరీంనగర్ జిల్లా పట్టణం లోనీ చైతన్యపురి కాలనీ , మహాశక్తి ఆలయం దగ్గర  ధాత్రి ఆయుర్వేద హాస్పిటల్ ను బిజెపి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ మానవుని మనుగడకు ఆయుర్వేదం అనేది ఒక భాగం, ఆయుర్వేదం ద్వారా దీర్ఘకాలిక రోగాలకు స్వస్తి పలకవచ్చు అని కొనియాడారు. హాస్పిటల్ మేనేజ్మెంట్ ఆయుర్వేదం ద్వారా సేవలు అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నగర బిజెపి మేయర్ కొలగాని...
    676 Views