Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • లారీ ఢీకొని ఇద్దరు బాలురు మృతి.
    అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం చీకుల బైలు వద్ద లారీ ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు బాలురు (భువనేష్ రెడ్డి–6, కుశిల్ రెడ్డి–10) అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో బాలుర తండ్రి శివారెడ్డి, మరో బాలుడు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబాలను శ్రీరామ్ చినబాబు, చీకలబైలు సర్పంచ్ ప్రభాకర్ పరామర్శించి...
    338 Views
  • కేంద్రీయ విద్యాలయం, మదనపల్లిలో అడ్మిషన్లు ప్రారంభం.
    మదనపల్లెలోని కేంద్రీయ విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు శుక్రవారం ఈ విషయాన్ని తెలిపారు. ఆయన ఇటీవల జిల్లా కలెక్టర్ సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు తరగతులు తాత్కాలికంగా ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల (బాలురు) ఆవరణలో నిర్వహించబడతాయి. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని...
    347 Views
  • మదనపల్లె: పన్నుల వసూళ్లు పక్కాగా జరగాలి – కలెక్టర్.
    మదనపల్లెలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పన్నుల వసూళ్లపై కీలక సూచనలు చేశారు. వాణిజ్య కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో జీఎస్టీ వసూళ్లు సమర్థవంతంగా జరగాలని, పెండింగ్ బకాయిలను వెంటనే వసూలు చేయాలని శుక్రవారం ఆదేశించారు. ఎక్సైజ్, కమర్షియల్ టాక్స్, రవాణా, మైనింగ్, రిజిస్ట్రేషన్ తదితర శాఖలు సమన్వయంతో పనిచేసి రెవెన్యూ లక్ష్యాలను అధిగమించాలని సూచించారు. వాణిజ్య...
    310 Views
  • మనూర్ :- రంజాన్ వేడుకలు
    మనూర్ మండలంలోని గ్రామాలలో రంజాన్ వేడుకలు ఘనంగా అత్యంత భక్తి శ్రద్దలతో చేశారు. ఒక నెల రోజుల పాటు ఉపవాసం వుండి. ముస్లిం సోదరులు నూతన వస్త్రాలు ధరించి ఈద్గా వద్దకు వెళ్లి ప్రతేక ప్రార్ధనలు చేశారు. అందరు సుఖసంతోషాలతో శాంతి సౌబగ్యాలతో ఉండాలని అల్లని వేడుకున్నారు.ప్రార్థన అనంతరం ఒకరిని ఒకరు అలింగనము చేసుకొని పండగ శుభాకాంక్షలు తెలియచేసుకున్నారు
    919 Views
  • మదనపల్లె: ఇంట్లో పాతిపెట్టిన బాలుడి మృతదేహానికి పోస్టుమార్టం.
    మదనపల్లె మండలం అంకిశెట్టిపల్లిలో శుక్రవారం ఒక అనుమానాస్పద ఘటన వెలుగుచూసింది. ఇంట్లో పాతిపెట్టిన బాలుడి మృతదేహాన్ని పోలీసులు వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. ఉద్యోగరీత్యా కదిరిలో నివసిస్తున్న విజయబాబు–నందిని దంపతుల కుమారుడు వర్షిత్, గత నెల 12న మెట్లపై నుంచి పడి మృతి చెందాడని తల్లి చెప్పడంతో, మృతదేహాన్ని గ్రామంలోని ఇంట్లో పాతిపెట్టారు. అయితే, భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో అనుమానం...
    321 Views
  • గోదావరిలో గల్లంతైన మదనపల్లె విద్యార్థి మృతదేహం లభ్యం
    మదనపల్లెకు చెందిన బీటెక్ విద్యార్థి సతీష్ మృతదేహం గోదావరి నదిలో లభ్యమైంది. భద్రాచలం పరిధిలోని కొల్లిగూడెం వద్ద స్నానానికి దిగిన ఏడుగురు విద్యార్థుల్లో ఐదుగురు కొట్టుకుపోగా, ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. సతీష్ మృతదేహాన్ని గజ ఈతగాళ్ల సాయంతో పోలీసులు వెలికితీశారు. మిగిలిన విద్యార్థుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
    292 Views
  • Nara Lokesh: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి లోకేశ్‌.. పేద ముస్లిం కుటుంబానికి కొత్త ఇల్లు.
    మంగళగిరిలో ఓ పేద ముస్లిం కుటుంబానికి ఇచ్చిన మాటను రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నిలబెట్టుకున్నారు. గతేడాది పవిత్ర రంజాన్ మాసంలో చేసిన వాగ్దానాన్ని ఏడాది తిరగకముందే నెరవేర్చి, వారికి కొత్త ఇంటిని నిర్మించి ఇచ్చారు.   వివరాల్లోకి వెళితే... గతేడాది రంజాన్ మాసం సందర్భంగా మంత్రి లోకేశ్‌ మంగళగిరి బస్టాండ్ సమీపంలో నివసించే షేక్ షహెన్షా నివాసానికి ఆకస్మికంగా వెళ్లారు. అక్కడ...
    347 Views
  • Chandrababu: తిరుమలలో మనవడితో సీఎం చంద్రబాబు.. భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డన.
    సీఎం చంద్రబాబు నాయుడు తన మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం వారు భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించి ప్రత్యేక సేవలో పాల్గొన్నారు.   శ్రీవారి దర్శనం పూర్తయ్యాక, ఆలయం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన అర్ధాంగి భువనేశ్వరి, మంత్రి నారా లోకేశ్‌, దేవాన్ష్‌తో కలిసి కాలినడకన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రానికి...
    301 Views
  • నూరు నియోజకవర్గ :సదుంలో పర్యటించిన తంబళ్లపల్లె ఎమ్మెల్యే
    పుంగనూరు నియోజకవర్గం, సదుం లో తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు మైనార్టీ నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి వారికి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసి, వారి యోగక్షేమాలను ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సభ్యుడు సోమశేఖర్ రెడ్డి, ఖాజాపీర్, కాలేశా తదితరులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
    310 Views
  • Chandrababu: తిరుమల వీధుల్లో నడుస్తూ.. భక్తుల సమస్యలు అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు.
    సీఎం చంద్రబాబు నాయుడు మనవడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ కుమారుడైన దేవాన్ష్ జన్మదిన వేడుకలు శనివారం తిరుమలలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం సీఎం చంద్రబాబు తిరుమల వీధుల్లో నడుస్తూ సామాన్య భక్తులతో ముచ్చటించారు. శ్రీవారి దర్శనం త్వరితగతిన పూర్తయ్యేలా చూసేందుకు త్వరలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)...
    316 Views