సీఎం చంద్రబాబు నాయుడు మనవడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కుమారుడైన దేవాన్ష్ జన్మదిన వేడుకలు శనివారం తిరుమలలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం సీఎం చంద్రబాబు తిరుమల వీధుల్లో నడుస్తూ సామాన్య భక్తులతో ముచ్చటించారు. శ్రీవారి దర్శనం త్వరితగతిన పూర్తయ్యేలా చూసేందుకు త్వరలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)...