Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • పార్కింగ్ ఫీజు రద్దు ఆ ఒక్క థియేటర్లో మాత్రమే

    దిల్‌సుఖ్‌ నగర్‌లోని కోణార్క్ థియేటర్‌లో మాత్రమే పార్కింగ్ ఫీజు వసూలు చేయకూడదు

    తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలు చేయకూడదంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవరించిన హైకోర్టు

    సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలు చేయకూడదన్న సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ అప్పీల్ చేసిన సుదర్శన్ 35MM, RR సినీ ఎంటర్ప్రైజేస్ తదితరులు

    సింగిల్ జడ్జి ముందున్న పిటిషన్‌లో ప్రతివాదిగా ఒక్క థియేటర్ మాత్రమే ఉందని, కానీ జడ్జి అన్ని థియేటర్లకు వర్తింపజేశారని వాదనలు వినిపించిన పిటిషనర్ తరపు న్యాయవాది

    దీంతో దిల్‌సుఖ్‌ నగర్‌లోని కోణార్క్ థియేటర్‌కు మాత్రమే పార్కింగ్ ఫీజును ఫ్రీ చేస్తూ హైకోర్టు ఆదేశాలు
    467 Views
  • మదనపల్లె ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షుడిగా నాగేష్ బాధ్యతలు స్వీకరణ.
    అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షుడిగా లక్కీ టైల్స్ మాల్ నాగేష్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు, స్థానిక ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. సమాజ అభివృద్ధి, సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తానని నాగేష్ తెలిపారు. కార్యక్రమంలో పలువురు ఆర్యవైశ్య సంఘ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.
    321 Views
  • రంజాన్ పండుగ: కాంగ్రెస్ నాయకుడు ఎస్.రెడ్డీ సాహెబ్ శుభాకాంక్షలు.
    అన్నమయ్య జిల్లా మదనపల్లెలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎస్.రెడ్డీ సాహెబ్, శుక్రవారం, శనివారం జరగనున్న రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు ‘ఈద్ ముబారక్’ తెలిపారు. అల్లాహ్ దీవెనలతో ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలని, రంజాన్ సామరస్యానికి, సుహృద్భావానికి ప్రతీకగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు
    275 Views
  • Chandrababu Naidu: కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల చేరుకున్న సీఎం చంద్రబాబు.
        Chandrababu Naidu: కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల చేరుకున్న సీఎం చంద్రబాబు 20-03-2026 Fri 19:25 | Andhra Chandrababu Naidu Reaches Tirumala with Family   ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం సాయంత్రం కుటుంబసమేతంగా తిరుమల పుణ్యక్షేత్రానికి చేరుకున్నారు. శ్రీవారి దర్శనార్థం విచ్చేసిన ఆయన వెంట అర్ధాంగి భువనేశ్వరి, కోడలు బ్రహ్మణి, మనవడు దేవాన్ష్ ఉన్నారు. ఆయన కుమారుడు,...
    367 Views
  • అల్వాల్ లో వృద్ధుడు అదృశ్యం.. ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసుల విన్నపం .|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మచ్చ బొల్లారం ప్రాంతానికి చెందిన ఒక 70 ఏళ్ల వృద్ధుడు అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు.  దీనికి సంబంధించిన వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి: అదృశ్యమైన వ్యక్తి వివరాలు : పేరు: కె. నారాయణ (తండ్రి పేరు: దివంగత రాజయ్య. వయస్సు: 70 ఏళ్లు. శారీరక ఆకృతి: సుమారు 6 అడుగుల ఎత్తు, సాధారణ శరీరం, నలుపు రంగు చిరునామా: ఇంటి నంబర్ 2-100/648,...
    319 Views
  • ఇంద్రకీలాద్రిపై వైభవంగా వసంత నవరాత్రులు
    ప్రకటన ఇంద్రకీలాద్రిపై వైభవంగా వసంత నవరాత్రులు: కనకాంబరాలు, గులాబీలతో జగన్మాతకు ప్రత్యేక పుష్పార్చన విజయవాడ, మార్చి 20, 2026: ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో శ్రీ పరాభవ నామ సంవత్సర వసంత నవరాత్రు ఉత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజైన శుక్రవారం (20.03.2026) పూజా మండపంలో జగన్మాతకు విశేష పుష్పార్చన నిర్వహించారు....
    337 Views
  • పాత గన్నవరంలో ఘనంగా లక్ష్మీ తిరుపతమ్మ వసంత నవరాత్రులు
    కృష్ణాజిల్లా    పాత గన్నవరంలో కొలువైన శ్రీ లక్ష్మీతిరుపత్మ ఆలయంలో వసంత నవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలుత శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి చామంతి పూలతో విశేష అర్చనలు చేశారు. తిరుపతమ్మ మాతృమండలి సభ్యులు సహస్రనామ పారాయణం , దేవి ఖడ్డమాలా స్తోత్రం హనుమాన్ చాలీసా పారాయణం చేశారుఆలయ కమీటి ఆధ్వర్యంలో ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో...
    321 Views