Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • మదనపల్లెలో 'ఏక్తాన్' ర్యాలీని ప్రారంభించిన జిల్లా ఎస్పీ.
    అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లెలో ఆదివారం ఉదయం ఏక్తాన్ ర్యాలీ ఘనంగా జరిగింది. జిల్లా ఎస్పీ ధీరజ్ జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించారు. మిషన్ కాంపౌండ్ నుండి మొదలైన ఈ ర్యాలీ పట్టణంలోని ప్రధాన సర్కిళ్ల మీదుగా పోలీస్ పెరేడ్ మైదానానికి చేరుకుంది. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి, పోలీసు అధికారులు, మహిళలు మరియు విద్యార్థినులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
    277 Views
  • మదనపల్లె: దివాకర్ హత్య కేసులో ముగ్గురి అరెస్ట్.
    మదనపల్లెలో సంచలనం సృష్టించిన పూల దివాకర్ హత్య కేసులో ముగ్గురు నిందితులను శనివారం అరెస్ట్ చేశారు. నిందితులు పూల గణేష్, సుబ్రహ్మణ్యం, మునికంఠేశ్వర ప్రసాద్‌లను విచారించగా, నేరం అంగీకరించడంతో వారిని రిమాండ్‌కు తరలించారు. పట్టణంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని తాలూకా సీఐ కళా వెంకటరమణ హెచ్చరించారు.
    286 Views
  • అన్నమయ్య జిల్లా బీసీ సంక్షేమ సంఘం నూతన కమిటీ ఎన్నిక.
    జాతీయ బీసీ సంక్షేమ సంఘం అన్నమయ్య జిల్లా కమిటీని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా సరస్వతి, కార్యదర్శిగా ప్రకాష్ నాయుడు నియమితులయ్యారు. రాష్ట్ర కార్యదర్శి చామంచుల మల్లిక వీరికి నియామక పత్రాలు అందజేశారు. ఆర్. కృష్ణయ్య ఆదేశాల మేరకు బీసీల సమస్యల పరిష్కారానికి, సంఘం బలోపేతానికి అంకితభావంతో పనిచేయాలని మల్లిక సూచించారు. నూతన సభ్యులు తమ బాధ్యతలను సమర్థవంతంగా...
    484 Views
  • ​గ్యాస్ ధరల పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలి: CPM.
    వంట గ్యాస్‌పై ₹60, వాణిజ్య సిలిండర్‌పై ₹115 పెంచడాన్ని సీపీఎం అన్నమయ్య జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు శనివారం మదనపల్లిలో తీవ్రంగా ఖండించారు. అంతర్జాతీయ రాజకీయ కారణాలతో సామాన్యులపై భారం మోపడం అన్యాయమని, ఇది నిత్యావసరాల ధరల పెరుగుదలకు దారితీస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పెంచిన ధరలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని టీడీపీ, జనసేనలను కోరారు. ఈ పెంపునకు వ్యతిరేకంగా...
    262 Views
  • International women's day
    అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు మహిళలందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. కుటుంబానికి ఆధారం, సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్న మహిళల శక్తి, సహనం, ప్రేమ, త్యాగం అపూర్వమైనవని అభినందించారు. సమాజాభివృద్ధికి మహిళా సాధికారత ప్రమాణంగా ఆడబిడ్డల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని గుర్తుచేశారు....
    281 Views
  • తెలంగాణ కంటెంట్ తో వచ్చి సత్తా చాటినా, రాజు వెడ్స్ రాంబాయి,దండోరా చిత్రాలు
    తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ చైర్మన్ పెద్దలు దిల్ రాజు గారి తో పాటు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సబ్యుల అధ్వర్యంలో 2025 గద్దర్ అవార్డ్స్ నిన్న ప్రకటించిన వాటి లో తక్కువ తో బడ్జెట్ తీసిన సినిమా లు ,బెస్ట్ ఫిల్మ్స్ గా అవార్డులు గెల్చుకోవడం నిజంగా గొప్ప విషయం అంధులోను తెలంగాణ కంటెంట్ ఉన్న కథలు తో వచ్చిన రెండు సినిమాలు అవార్డులు గెల్చుకోవడం మరో విశేషం ఈమధ్య సరైన కంటెంట్ లేకుండా...
    451 Views
  • మదనపల్లిలో విషాదం: ఆపరేషన్ వికటించి తల్లి, బిడ్డ మృతి.
    మదనపల్లిలోని సన్ షైన్ ఆసుపత్రిలో ప్రసవం కోసం చేరిన 33 ఏళ్ల గాయత్రి ఆపరేషన్ వికటించి మృతి చెందింది. వాల్మీకిపురానికి చెందిన గాయత్రి రెండో కాన్పు కోసం ఆసుపత్రిలో చేరగా, సర్జరీ సమయంలో ఊపిరాడక మరణించింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆదివారం ఉదయం ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. టూ టౌన్ ఎస్ఐ నాగేశ్వర్ ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
    269 Views
  • International women's day
    ప్రతి ఇంటి వెలుగు, ప్రతి సమాజానికి శక్తి, మన స్త్రీ శక్తి  ప్రతి మహిళకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు సీఎం చంద్రబాబు ముఖ్యఅతిథిగా అమరావతి పెరేడ్ గ్రౌండ్స్ లో "అంతర్జాతీయ మహిళా దినోత్సవం". వివిధ రంగాలలో సక్సెస్ అయిన మహిళలతో సీఎం  ముఖాముఖి.
    255 Views
  • మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పరిశుభ్రత చర్యలు
    పెద్ద దోర్నాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పరిశుభ్రత చర్యలు ఇన్‌చార్జి ఎరిక్షన్ బాబు సూచనలతో   పెద్ద దోర్నాల పాఠశాలలో పరిశుభ్రత చర్యలు వాటర్ ప్లాంట్, వంటగది పరిశీలన - వెంటనే శుభ్రత పనులు చేపట్టిన పాఠశాల సిబ్బందివిద్యార్థుల ఆరోగ్యమే లక్ష్యం - పెద్ద దోర్నాల పాఠశాలలో పరిశుభ్రత  పెద్ద దోర్నాల : శనివారం నాడు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్...
    473 Views