Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • పుంగనూరు నియోజకవర్గం : వీబీజీ-రామ్ పథకంపై ఈనెల 9న అవగాహన
    సదుం ఎంపీడీవో రాధారాణి మాట్లాడుతూ, ఈనెల 9న వీబీజీ-రామ్ పథకంపై ప్రత్యేక అవగాహన సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వికసిత్ భారత్ ఫర్ రోజ్ గార్ అజీవికా మిషన్ చట్టంపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. పుంగనూరు నియోజక వర్గం, సదుం ఎంపీడీవో కార్యాలయంలో ఉదయం 10 గంటలకు నిర్వహించే ఈ సమావేశానికి కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది తప్పకుండా హాజరు కావాలని సూచించారు# కొత్తూరు మురళి.
    340 Views
  • పుంగనూరు: పుంగనూరు పట్టణం లో ఈనెల 14న ఎమ్మెల్యే ఎంపీల ఇఫ్తార్ విందు
    మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిలు పట్టణంలోని ముస్లిం సోదరులకు ఈనెల 14న ఇఫ్తార్ విందు ఇవ్వనున్నట్లు మున్సిపల్ చైర్మన్ అలీమ్ బాషా తెలిపారు. ప్రతి ఏటా నిర్వహించే విధంగానే ఈసారి కూడా పట్టణంలోని 28 మసీదులకు చెందిన ముస్లింలకు ఈ విందు ఏర్పాటు చేశారు. అంజుమన్ షాదీ మహల్లో జరిగే ఈ ఇఫ్తార్ విందుకు అందరూ హాజరై...
    296 Views
  • రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేసిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారు
    రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేసిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ. దొనకొండ మండలం, ఆరవల్లిపాడు గ్రామంలో ఆదివారం రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు మండల తహసీల్దార్ రమాదేవి గారితో కలిసి దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దొనకొండ తహసీల్దార్, దొనకొండ మండల పార్టీ అధ్యక్షులు మోడీ ఆంజనేయులు, మండల...
    501 Views
  • పుంగునూరు నియోజకవర్గ:రొంపిచర్ల పోలీస్ స్టేషన్ కు చెందిన 10 ప్రశ్నాపత్రాలు
    పుంగనూరు నియోజకవర్గంలోని రొంపిచర్ల పోలీస్ స్టేషన్ కు శనివారం 10 పబ్లిక్ పరిష ప్రశ్నాపత్రాలు చేరుకున్నాయి. విద్యాశాఖ అధికారులు ఈ ప్రశ్నాపత్రాలను ట్రంకు పెట్టెలలో పోలీస్ స్టేషన్లో భద్రపరిచారు. హెచ్ఎం అమర్ శేఖర్, ధనలక్ష్మి కస్టోడియన్లుగా వ్యవహరిస్తారని ఎంఈఓ శ్రీనివాసులు తెలిపారు. రూట్ ఆఫీసర్లుగా పులిచెర్ల, రొంపిచర్ల ఎంఈఓలు తాతయ్య, సిద్ధరామయ్య, శ్రీనివాసులు ఉంటారని ఆయన చెప్పారు. రొంపిచర్ల బాయ్స్,...
    283 Views
  • పుంగనూరు నియోజకవర్గ : విగ్రహ ప్రతిష్ట లో పాల్గొన్న పెద్దిరెడ్డి
    శనివారం, పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం, ఆవులపల్లి పంచాయతీ, కలమందల వారి పల్లి లో నూతనంగా నిర్మించిన శ్రీ శివ గణేష్ స్వామి వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. నిర్వాహకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం వేద పండితులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు# పుత్తూరు మురళి.
    288 Views
  • పుంగనూరు నియోజకవర్గం : కుల మతాలకతీతంగా నిత్యవసరాలు పంపిణీ
    పుంగనూరు నియోజకవర్గం, నంజoపేటలో కిద్మతే ఈ కల్క్ మైనారిటీ యూత్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నిత్యావసరాలు పంపిణీ చేశారు. గత ఐదు సంవత్సరాలుగా ప్రతి నెల 15 కుటుంబాలకు, ప్రతి సంవత్సరం రంజాన్ నెలలో 45 మంది నిరుపేద కుటుంబాలకు కులమతాలకు అతీతంగా నిత్యావసరాలను పంపిణీ చేస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి .
    295 Views
  • Mandali bhavan
    మండలి భవనం ప్రారంభం    హైదరాబాద్ :చారిత్రక శాసనసభ ప్రాంగణంలో పునరుద్ధరించిన శాసనమండలి భవనాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రారంభించారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్, మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి శాసనమండలి భవనాన్ని ప్రారంభించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు....
    371 Views
  • ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం - ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కొండయ్య
    నేడు చీరాలలో మహిళా సదస్సు యు టి ఎఫ్ బిల్డింగ్ నందు మహిళా దినోత్సవం ప్రభుత్వ ఉపాధ్యాయులు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అక్కగా, చెల్లిగా, తల్లిగా మహిళలు ప్రతి ఒక్కరి జీవితాల్లో చెరగిపోని ముద్ర వేస్తారు.టీచర్ గా సేవలందించిన మహిళలను సత్కరించడం ఆనందంగా ఉందని అలాంటి మహిళలను గౌరవించుకోవడం ప్రతి ఒక్కరి...
    984 Views
  • చిన్నగంజాంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు :పాల్గొన్న ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు
    మహిళల అభివృద్ధి సాధికారతతోనే సమాజం పురోగమిస్తుందని పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చిన్నగంజాంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఏలూరి, మహిళా నాయకులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా మహిళా లోకానికి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.ముఖ్యమంత్రి ప్రసంగ వీక్షణ వేదికపై...
    1.1K Views