Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • పుంగనూరు: అంగన్వాడీ కార్యకర్తలను అరెస్టు చేయడం దారుణం
    విజయవాడ ధర్నా చౌక్ లో అనుమతితో నిరసన తెలుపుతున్న అంగన్వాడీ కార్యకర్తలను అరెస్టు చేయడం దారుణమని పుంగనూరు అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ నాయకులు మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా, పుంగనూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని పలువురు అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. అరెస్టు చేసిన కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి, సిపిఐ నాయకులు...
    308 Views
  • పాలెంపల్లి గ్రామ సమీపంలో మృతదేహం కలకలం
    మంగళవారం పుంగనూరు మండలం, పాలెంపల్లి గ్రామ సమీపంలోని ఓ బావిలో వెంకటరమణ (46) అనే యువకుడి మృతదేహం కలకలం సృష్టించింది. చౌడేపల్లి మండలం కాగితి పంచాయతీ, పలగార్ల పల్లి గ్రామానికి చెందిన వెంకటరమణ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతుడిని గుర్తించి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. పుంగనూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి...
    300 Views
  • పుంగనూరు నియోజకవర్గం: అడవికి నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు
    సోమల మండలం, అడుసుపల్లి గ్రామ సమీపంలోని అడవికి మంగళవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. పంట పొలాల సమీపంలో అటవీ ప్రాంతం ఉండడంతో మంటలు తమ పొలాల వైపు వస్తాయేమోనని గ్రామస్తులు, రైతులు ఆందోళన చెందుతున్నారు. అడవి జంతువులు గ్రామాల వైపు రాకుండా ఉండాలంటే అడవులకు నిప్పు పెట్టేవారు ఆలోచించాలని కోరుతున్నారు# కొత్తూరు మురళి.
    325 Views
  • పుంగనూరు: 450 సంవత్సరాల చరిత్ర గల గంగమ్మ జాతర మార్చి 10.11.
    పుంగనూరులో ఈనెల 10, 11వ తేదీల్లో సుగుటూరు గంగమ్మ జాతరను నిర్వహిస్తున్నట్లు జమీందారులు మంగళవారం రాత్రి ప్రకటించారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఈ జాతరకు వస్తారు. 450 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ జాతర కోసం మొదటి చాటింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు# కొత్తూరు మురళి.
    268 Views
  • 8న క్రికెట్ జట్ల ఎంపిక
    కడప వైఎస్ఆర్ సర్కిల్: ఈ నెల 8న 2026-27
    సంవత్సరంఅండర్ -19, సీనియర్స్ పురుషుల క్రికెట్ జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రికెట్ అసోసియేన్ కార్యదర్శి అవ్వారు రెడ్డి ప్రసాద్ తెలిపారు. క్రీడాకారులు ఆధార్ కార్డు, టెన్త్ మార్క్ లిస్ట్, బర్త్ సర్టిఫికెట్(ఫారం 5), పాస్ పోర్ట్ సైజ్ ఫొటో, ఒరిజినల్ తో పాటు ఒక సెట్ జిరాక్స్లను తీసుకురావాలన్నారు. క్రీడాకా రులు తమ కిట్ బ్యాగులు కూడా తీసుకురాలని కోరారు. ఎంపికలు ఉదయం 8 గంటలకు వైఎ స్ఆర్ఆర్ ఏసీఏ స్టేడియంలో జరుగుతాయని తెలిపారు. 2007 సెప్టెంబరు 1 తర్వాత జన్మిం చిన వారు ఎంపికలకు అర్హులని చెప్పారు.#Naveen kumar
    934 Views
  • 6 నుంచి అమ్మవారిశాలలో ఆధ్యాత్మిక ప్రవచనాలు
    ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక శ్రీవాసవి కన్యకాపరమేశ్వరిదేవి (అమ్మవారిశాల) ఆలయంలో శుక్ర వారం నుంచి ఆదివారం వరకు ఆధ్యాత్మిక ప్రవచనా లను నిర్వహిస్తున్నట్లు ఆర్యవైశ్యసభ అధ్యక్షుడు బుశెట్టి రాంమోహన్రావు ఒక ప్రకటనలో తెలిపారు. రోజూ సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు డాక్టర్ బాచంపల్లి సంతోష్కుమార్ శాస్త్రి మహాభారతంలోని శ్రీకృష్ణ రాయబారం, శ్రీల క్ష్మీనరసింహ ఆవమి ఆవిర్భావం అనే అంశాలపై ప్రవచిస్తారని ఆయన పేర్కొన్నారు.
    451 Views
  • ఏప్రిల్ 25న పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 4 వరకు దరఖాస్తుకు అవకాశం
    పాలిటెక్నిక్ కళాశాలల్లో ఇంజినీరింగ్, నాన్- ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు పాలిసెట్-2026ను వచ్చేనెల 25న నిర్వహించనున్నారు. ప్రవేశ పరీక్షకు ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో జరిగే పదో తరగతి పరీ క్షలకు హాజరయ్యే విద్యార్థులు దరఖాస్తు చేసు కోవచ్చు. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.400, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.100 చెల్లించి ఏప్రిల్ 4 వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు సమర్పించవచ్చు. https://polycetap.ap.gov. inలో సమర్పించవచ్చు. #Naveen kumar
    891 Views
  • మార్కాపురం జిల్లా. ఎర్రగొండపాలెం నియోజకవర్గ పెద్ద దోర్నాల మండలం పెద్ద దోర్నాల మండలంలో రోడ్డు ప్రమాదం
    మార్కాపురం జిల్లా. ఎర్రగొండపాలెం నియోజకవర్గ పెద్ద దోర్నాల మండలం పెద్ద దోర్నాల మండలంలో రోడ్డు ప్రమాదం బొమ్మలాపురంతుమ్మలపల్లి మూల మలుపు వద్ద చిన్న దోర్నాల నుండి మిర్చి కూలీలతో వెళ్తున్న ఒక ఆటోను ఎదురుగా వస్తున్న మరో ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాద సమయంలో రెండు ఆటోలలో మొత్తం సుమారు 35 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ఘటనలో 8 మంది తీవ్రంగా గాయపడగా, మిగతా ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. గాయపడిన...
    735 Views
  • బాల్య వివాహం ఆపండి
    గ్రామం మండలం: జర సంఘం విలేజ్ లో scop ngo. ఆధ్వర్యంలో జరిగిన ప్రోగ్రాంలో బాల్య వివాహం నిషేధం అని తెలియజేశారు ఒకవేళ బాల్య వివాహం జరిగితే బాల్య వివాహం నిర్వహించిన వారందరికీ కూడా చట్ట ప్రకారం 2 సంవత్సరం జైలు శిక్ష నిర్వహించబడుతుంది మరియు 100000 లక్ష రూపాయలు జరిమానా వేయడం జరుగుతుంది కావున బాల్య వివాహం ఆపడానికి ప్రయత్నించండి 
    1.2K Views