ఒకప్పుడు నెలకు వెయ్యికి పైగా డెలవరీలతో రికార్డు సృష్టించిన ఖమ్మం MCH ప్రస్తుతం వెలవెలబోతోంది. వైద్యుల సమయపాలన లోపం, పర్యవేక్షణ కరువవ్వడంతో ప్రసవాల సంఖ్య గణనీయంగా పడిపోతోంది. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే గర్భిణులు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల కలెక్టర్ సమీక్ష నిర్వహించి.. గైనకాలజీ విభాగం వైద్యులు సమయపాలన పాటిస్తూ, పర్యవేక్షణ పెంచాలని గట్టిగా ఆదేశించారు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : బోయిన్ పల్లి లోని మల్లారెడ్డి గార్డెన్స్ లో మహావీర్ ఇంటర్నేషనల్ ఉడాన్ సంస్థ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన హోలీ సంబురాలలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
సంబురాలలో పాల్గొన్న అందరికీ ఎమ్మెల్యే శ్రీగణేష్ శుభాకాంక్షలు తెలిపారు.
చెడు పై మంచి గెలుపునకు సూచికగా ‘కామ దహనం’తో ప్రారంభమయ్యే హోలీ పండుగ మనందరి...
బొబ్బిలి పట్టణంలో ప్రజలు తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. వేగావతి నదిలో నీటి మట్టం తగ్గడంతో ప్రస్తుతం రోజు విడిచి రోజు నీటి సరఫరా జరుగుతోంది. వేసవిలో పరిస్థితి మరింత కష్టమవుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు చర్యలు తీసుకుని ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను కోరుతున్నారు.
#Boiena Rajesh
అన్నమయ్య జిల్లా మదనపల్లె మున్సిపాలిటీ సమీపంలో మంగళవారం రాత్రి పాత కక్షలతో ప్రసాద్ (41) అనే వ్యక్తిపై దుండగులు దాడి చేశారు. ఈ గొడవను ఆపడానికి ప్రయత్నించిన వైసీపీ మాజీ మేదరసం కార్పొరేషన్ డైరెక్టర్ తాలే సుబ్బుపై కూడా కత్తితో దాడి జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో గిరీష్, షఫీ, ముని, మస్తాన్, ఫరీద్ డాడీ పాల్గొన్నారని స్థానికులు తెలిపారు. గాయపడిన వారిని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు...
కురబలకోట రైల్వే ఫ్లైఓవర్‌పై బుధవారం ఒక విద్యార్థి అతివేగంగా కారు నడపడంతో అది అదుపుతప్పి రోడ్డు పక్కన పిట్టగోడను ఢీకొట్టింది. కారు ఫ్లైఓవర్ కిందకు పడి ఉంటే ప్రాణనష్టం జరిగేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. అదృష్టవశాత్తూ, ఆ సమయంలో వాహనాల రాకపోకలు లేకపోవడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
అన్నమయ్య జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) వెంకటాద్రి, మదనపల్లె సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న కేసులను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు బుధవారం డిఎస్పీ కార్యాలయంలో జరిగిన నెలవారీ నేర సమీక్షలో, శాంతిభద్రతల పరిరక్షణలో నిర్లక్ష్యం వహించరాదని, బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలని ఆయన సూచించారు. ఈ సమీక్షలో మదనపల్లె, పుంగనూరు, బి....
లక్షల్లో అద్దె బకాయిలు చెల్లించకుండా వేధిస్తున్నారని జనసేన పార్టీకి చెందిన ఓ రాష్ట్ర నేతపై బాధితులు సుధాకర్ రెడ్డి, మునిరత్నం బుధవారం అడిషనల్ ఎస్పీ వెంకటాద్రికి ఫిర్యాదు చేశారు. సీటీఎం రోడ్డులోని హోటల్, నీరుగట్టుపల్లిలోని ఇంటికి సంబంధించి అద్దె అడిగితే సదరు నేత మరియు అతని తమ్ముడు గొడవకు దిగుతున్నారని బాధితులు మీడియాకు తెలిపారు. తమకు రావాల్సిన బకాయిలు ఇప్పించి, న్యాయం చేయాలని వారు కోరారు.
కర్ణాటక సరిహద్దులోని చీకిలబైలు చెక్‌పోస్ట్ వద్ద బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గుర్రంకొండ మండలం మర్రిపాడుకు చెందిన బషీర్ బాషా మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కారు డ్రైవర్ కోమాలోకి వెళ్లినట్లు రాయల్పాడు ఎస్ఐ రామా తెలిపారు. క్షతగాత్రులను శ్రీనివాసపురం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాకినాడ జిల్లాలో జరిగిన ప్రమాదం నేపథ్యంలో, జిల్లాలోని టపాసుల తయారీ మరియు విక్రయ కేంద్రాలపై ఎస్పీ ధీరజ్ కఠిన ఆంక్షలు విధించారు. బుధవారం ఆయన ఆదేశాల మేరకు, తనిఖీలు పూర్తయ్యే వరకు ఈ కేంద్రాలను మూసివేయాలని సూచించారు. లైసెన్సులు, సీసీ కెమెరాలు, అగ్నిమాపక పరికరాలు లేని కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల ప్రాణరక్షణ తమ ప్రథమ కర్తవ్యమని ఎస్పీ స్పష్టం చేశారు. అక్రమ నిల్వలు ఉంటే వెంటనే...