Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • Muppidi Avinash Reddy: ఏపీ మద్యం స్కాంలో కీలక పరిణామం.. సిట్ ముందు లొంగిపోయిన ముప్పిడి అవినాశ్ రెడ్డి.
    ఏపీ మద్యం కుంభకోణం కేసులో నిందితుడు అవినాశ్ రెడ్డి సిట్ ముందు లొంగుబాటు సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇవాళ‌ లొంగిపోయిన అవినాశ్ రెడ్డి వైసీపీ హయాంలో జరిగిన రూ.3,500 కోట్ల స్కాంలో ఈయన ఏ7 నిందితుడు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ నేతృత్వంలో కొనసాగుతున్న సిట్ దర్యాప్తు   ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏడో నిందితుడిగా ఉన్న ముప్పిడి అవినాశ్ రెడ్డి ఇవాళ‌...
    304 Views
  • Sunil Nayak: ఐపీఎస్ సునీల్ నాయక్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్.
    రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు బీహార్ కేడర్ ఐపీఎస్ సునీల్ నాయక్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన గుంటూరు కోర్టు సునీల్ నాయక్ కోసం పాట్నాలోనే మకాం వేసిన ఏపీ పోలీసులు   ఆంధ్రప్రదేశ్ రాజకీయ, పోలీస్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించిన రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసు సరికొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్‌కు సంబంధించి గుంటూరు...
    269 Views
  • Nara Lokesh: తమ్ముడూ.. నువ్వు లేవని, ఇక రావని అంటే నమ్మడం కష్టంగా ఉంది: నారా లోకేశ్.
    గుండెపోటుతో తెలుగు యువత ప్రధాన కార్యదర్శి నూతలపాటి నాగభూషణం మృతి మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి విజయవాడలో పార్టీ కార్యక్రమాలకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్న వైనం   తెలుగుదేశం పార్టీలో విషాదం చోటుచేసుకుంది. ఆ పార్టీ యువజన విభాగమైన తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూతలపాటి నాగభూషణం గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. యువ నాయకుడి అకాల మరణం పట్ల రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా...
    329 Views
  • హనుమకొండ జిల్లాలో దారుణం..
    భరత్ ఆవాజ్ (ప్రతి నిధి):  హనుమకొండ జిల్లా వేలేరు మండలం ఎర్రబెల్లి గ్రామంలో ధారావత్ రాజకుమార్ యువకుడు తన పిన్ని అయిన మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు తన కోరిక తీర్చాలని ఒత్తిడి తెచ్చిన రాజకుమార్ బాధితురాలు అభ్యంతరం చెప్పడంతో ఆగ్రహించి హత్యయత్నం  చేశాడు. ఈ ఘటన పై si  సురేష్ కుమార్ వివరాలు తెలిపారు. ##గోయిండ్ల ప్రశాంత్ 
    759 Views
  • Huge fire accident happenend at jubilee hills checkpost in a cloth showroom. It is due to short circuit.
    1.4K Views
  • అక్రమ సంపాదన కోసం భూదాన్ భూములపై కన్ను: కేటీఆర్
    ఖమ్మం: దేశంలో అప్పుడు ఒరిజినల్ గాంధీ ఉండేవారని, ఇప్పుడు డూప్లికేట్ గాంధీలు ఉన్నారని మాజీ మంత్రి KTR విమర్శించారు. 'ఖమ్మం జిల్లాలో ఇళ్ల కూల్చివేత పాపం ముగ్గురు మంత్రులదే. అక్రమ సంపాదన కోసం భూదాన్ భూములపై కన్నేశారు. జిల్లా మంత్రులు మాయగాళ్లు.. చిచ్చుపెడుతున్నారు. పేదలకు ఇళ్లు కట్టించకపోగా ఇళ్లను కూల్చివేయడమేనా ఇందిరమ్మ రాజ్యం? మా ప్రభుత్వం వచ్చాక ఇదే స్థలంలో పేదలకు ఇళ్లు కట్టిస్తాం' అని...
    700 Views
  • వెలుగుమట్ల భూదాన్ భూములపై ఖమ్మం జిల్లా కలెక్టర్ వివరణ
    ఖమ్మం నగరంలోని వెలుగుమట్ల భూదాన్ భూముల అంశంపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గురువారం వివరణ ఇచ్చారు. హైకోర్టు ఆదేశాల మేరకే ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. లంచ్ మోషన్ పిటిషన్ను కూడా కోర్టు తిరస్కరించిందన్నారు. సుమారు రూ.250 కోట్ల విలువైన భూమిని రక్షించామని, అర్హులైన పేదలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
    723 Views
  • ఎల్లుండి సీఎస్ విజయానంద్ పదవీ విరమణ
    అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి కె.ఎస్. విజయానంద్ ఎల్లుండి పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో నూతన సీఎస్‌గా సాయి ప్రసాద్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
    అయితే విజయానంద్ సేవలను మరికొంత కాలం వినియోగించుకోవాలనే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. సీఎం ఎక్స్‌ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆయనను నియమించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.
    పరిపాలనా అనుభవం దృష్ట్యా విజయానంద్‌కు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశముందని తెలుస్తోంది.
    352 Views
  • పుంగనూరు నియోజకవర్గం : మంత్రులను కలిసిన ఏఎంసీ చైర్మన్
    బుధవారం అమరావతిలో రాష్ట్ర రేవున్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన 22ఏ మరియు ఫ్రీహోల్డ్ భూముల సమస్యలను మంత్రికి వివరించారు. భూ సమస్యలను సవివరంగా అడిగి తెలుసుకున్న మంత్రి సత్యప్రసాద్, త్వరితగతిన పరిష్కార మార్గాలు చూపుతామని హామీ ఇచ్చారు. అనంతరం శ్రీనివాస నాయుడు హోం...
    374 Views