Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • పుంగనూరు :పుంగనూరు పట్టణం పరిధిలో మూగజీవిని కాపాడిన అగ్నిమాపక సిబ్బంది
    పుంగనూరు పట్టణ పరిధిలోని కోనేటిపాలెం నందు బుధవారం 15 అడుగుల లోతు ఉన్న నీటి సొంపులోకి ఓ ఎద్దు పడిపోయింది. స్థానికులు వెంటనే స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజుకు తెలియజేయడంతో, ఆయన తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిచ్చెన, తాడు, స్థానికుల సహాయంతో నీటి సోంపులో పడిపోయిన మూగజీవిని అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా కాపాడారు. ఈ సంఘటనతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు# కొత్తూరు...
    250 Views
  • బొలెరో ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు: ఆసుపత్రికి తరలింపు
    చిత్తూరు జిల్లా గంగవరం మండలం గుండుగల్లుకు చెందిన ఆనంద్ (40) బుధవారం రాత్రి పుంగనూరు - చౌడేపల్లె రోడ్డులోని పెట్రోల్ బంకు వద్ద తన స్కూటీతో నిలబడి ఉండగా, వేగంగా వచ్చిన బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆనంద్ తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబ సభ్యులు అతన్ని మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రి అవుట్‌పోస్ట్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు# పుత్తూరు మురళి.
    308 Views
  • పుంగనూరు: పుంగునూరు పట్టణంలో ఇంటర్ ఇన్విజిలేటర్ తొలగింపు
    పుంగనూరు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లిష్ పేపర్ పరీక్షలో ఒక విద్యార్థి కాపీయింగ్‌కు పాల్పడినట్లు డీఐఈవో రఘుపతి తెలిపారు. ఒక ప్రైవేట్ విద్యాసంస్థకు చెందిన ఆ విద్యార్థిపై నిబంధనల ప్రకారం మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేసి, ఇన్విజిలేటర్‌ను విధుల నుంచి తొలగించినట్లు ఆయన పేర్కొన్నారు# కొత్తూరు మురళి.
    242 Views
  • పుంగనూరు:సింహ వాహనంపై దర్శనమిచ్చిన గోవిందుడు
    అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలో టీటీడీ ఆధ్వర్యంలో కళ్యాణ వేంకటరమణ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా, గురువారం వేద పండితులు వెంకటేశ్వర స్వామిని యోగనరసింహస్వామిగా అలంకరించి, సింహ వాహనంపై పట్టణ వీధులలో ఊరేగించారు. స్వామివారి పల్లకి ముందు జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ ఉత్సవాలలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
    277 Views
  • పుంగనూరు నియోజకవర్గం:రొంపిచర్ల లో సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ
    పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల లో గురువారం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి చల్లా బాబు, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.12 లక్షల 70 వేల విలువైన చెక్కులను పలువురు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తుందని తెలిపారు. లబ్ధిదారులు సీఎం చంద్రబాబు, చల్లా బాబుకు ధన్యవాదాలు తెలిపారు# కొత్తూరు మురళి.
    288 Views
  • పుంగనూరు:పుంగనూరులో చలో విజయవాడ పోస్టర్లు ఆవిష్కరణ
    పుంగనూరులోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ భవనంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో గురువారం చలో విజయవాడ కరపత్రాలను ఆవిష్కరించారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమ సంఘం ఎల్లప్పుడూ ముందుంటుందని ముఖ్య నాయకులు డాక్టర్ తల్లా శ్రీనివాస్, ఖలీఫ్ భాష తెలిపారు. జర్నలిస్టుల ప్రధాన సమస్యల పరిష్కారం కోసం మార్చి 4న చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు...
    256 Views
  • హైదరాబాద్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో గ్రూప్–I, గ్రూప్–II అధికారుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు.

    *YouTube*
    https://www.youtube.com/live/kWdnw5SZxP8?si=6Ekw0OHSh5gwdv4C

    *X*
    https://x.com/i/status/2026999762688655475

    *Facebook*
    https://www.facebook.com/share/v/1JyEEryC2U/
    - YouTube
    Enjoy the videos and music that you love, upload original content and share it all with friends, family and the world on YouTube.
    96 Views
  • చీపురుపల్లి నుంచి ప్రధానితో సీఎం వీసీ
    ఈనెల 28న చీపురుపల్లి నుంచి సీఎం చంద్రబాబు ప్రధానమంత్రి మోదీ ప్రారంభించనున్న 14-15 ఏళ్ల బాలికల ఉచిత హెచ్పీవీ వ్యాక్సిన్ కార్యక్రమంలో వర్చువల్గా పాల్గొననున్నారు. CHC వద్ద ప్రత్యేక వేదిక, సాంకేతిక& వైద్య ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ రాం సుందర్ రెడ్డి బుధవారం ఆదేశించారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. #BOIENA RAJESH 
    338 Views
  • నీట్ పరీక్షకు జిల్లాలో ఆరు కేంద్రాలు
    మే 3న నిర్వహించే నీట్ పరీక్షకు జిల్లాలో 6 కేంద్రాలను గుర్తించినట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు.గురువారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ వీసీలో పాల్గొన్నారు. కేంద్రీయ విద్యాలయం, ప్రభుత్వ పాలిటెక్నిక్, అయ్యప్పనగర్లో గల ఏ.పీ.మోడల్ స్కూల్, JNTU బ్లాక్ 1, 2, ప్రభుత్వ బాలికల హైస్కూల్లలో నిర్వహిస్తామన్నారు. కేంద్రాల్లో 1800 మంది పరీక్ష రాసే సామర్థ్యం ఉందన్నారు. #BOIENA RAJESH ...
    338 Views