మదనపల్లి మండలం మిట్టపల్లిలో బుధవారం గుర్తు తెలియని వ్యక్తులు పెట్టిన మంటలకు రైతు పూల వెంకటప్ప సాగు చేసిన రెండున్నర ఎకరాల టమోటా పంట పూర్తిగా బూడిదయ్యింది. కాయలు కోతకు వచ్చే దశలో ఉన్న ఈ పంట సుమారు రూ. 3 లక్షల విలువైనది. పొలం సమీపంలోని గడ్డికి నిప్పు పెట్టడంతో మంటలు వ్యాపించి టమోటా చెట్లు, డ్రిప్పు పైపులు, కట్టెలు కాలిపోయాయి. అప్పులు చేసి పండించిన పంట నాశనం కావడంతో బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తూ,...
మదనపల్లి మండలం సిటిఎం ఆంజనేయుని గుడి సమీపంలో కోడి పందాలు ఆడుతున్న ఐదుగురిని తాలూకా పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. సీఐ కళావెంకటరమణ ఆదేశాలతో ఎస్సై రామకృష్ణారెడ్డి సిబ్బందితో కలిసి మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పందెం రాయుళ్ల నుంచి రెండు కోళ్లు, 5 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జూద క్రీడలపై కఠిన...
ఈరోజు రాయచోటి పట్టణం మాసాపేట రెడ్డి వారి పల్లెలో చిన్నారులు వేద సహస్ర సుకృతిలకు కేశఖండన కార్యక్రమంలో పాల్గొని వేద ఆశీస్సులు అందించిన రాజంపేట తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడుసుగవాసి ప్రసాద్ బాబు గారు ఈ కార్యక్రమంలో మాసాపేట తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు
మదనపల్లి పట్టణంలోని బాలాజీనగర్ మద్యం షాపు వద్ద బుధవారం రాత్రి యువకుల మధ్య జరిగిన ఘర్షణ హత్యాయత్నానికి దారితీసింది. చంద్రకాలనీకి చెందిన ప్రదీప్ (32) మరియు అతని స్నేహితులు మద్యం సేవిస్తుండగా, అంగళ్లుకు చెందిన బ్రహ్మతేజ సోదరులతో గొడవ పడ్డారు. షాపు బయటకు వచ్చిన తర్వాత, అంగళ్లు యువకులు ప్రదీప్, బాలుపై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రదీప్‌ను మెరుగైన చికిత్స కోసం తిరుపతిలోని స్విమ్స్...
ములకలచెరువుకు చెందిన అబ్దుల్ సమద్ తన భార్య హీనాకు ప్రసవ నొప్పులు రావడంతో మదనపల్లెలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ హీనా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. శిశువుకు మూర్ఛ రావడంతో వైద్యుల సూచన మేరకు మరో చిన్నపిల్లల ఆసుపత్రికి తరలించారు. దురదృష్టవశాత్తు చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. ఈ ఘటనతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
మదనపల్లె పట్టణంలోని నీరుగట్టువారిపల్లెలో గురువారం తెల్లవారుజామున పోలీసులు భారీ కార్డెన్ సెర్చ్‌ను నిర్వహించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు, అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి నేతృత్వంలో 150 మంది సిబ్బంది, డాగ్ స్క్వాడ్, ఎస్టీఎఫ్ బృందాలు కాట్లాటపల్లి రోడ్డు, రామిరెడ్డి లేఅవుట్లలో తనిఖీలు చేపట్టాయి. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 20 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి సేవించే పలువురు...
ఆస్తి పన్ను చెల్లింపుల కోసం ఏపీలో సరికొత్త విధానం
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటికీ ప్రత్యేక క్యూఆర్ కోడ్ ఏర్పాటు
పన్ను చెల్లింపులతో పాటు సమస్యలపై ఫిర్యాదులకూ అవకాశం
స్థానిక వ్యాపారాలు, సేవల వివరాలు కూడా ఫోన్లోనే లభ్యం
కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా రాష్ట్రంలో అమలుకు సన్నాహాలు
ఏపీలో పౌర సేవలను మరింత సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్తి పన్ను...
మూడో విడత సభ్యత్వ నమోదుకు జనసేన శ్రీకారం
ఏపీ, టీజీ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్టలలో సభ్యత్వ నమోదు కార్యక్రమం
ఉద్యమి, సాధక్, ప్రదాత పేర్లతో మూడు వర్గాలుగా సభ్యత్వాలు
రాజకీయాల్లో సరికొత్త మార్పు కోసం జనసేనాని పవన్ కల్యాణ్ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. సంస్థాగతంగా పార్టీని పటిష్ఠం చేయడమే లక్ష్యంగా, 'మెంబర్షిప్ టు లీడర్షిప్' అనే శక్తిమంతమైన నినాదంతో మూడో విడత క్రియాశీలక...
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై చర్చ సందర్భంగా సభలో గందరగోళం
చర్చ అనంతరం మరో ప్రశ్నపై మాట్లాడేందుకు సిద్ధమైన సోము వీర్రాజు
వీర్రాజుపై దాడికి యత్నించిన వైసీపీ సభ్యులు
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఈరోజు రణరంగాన్ని తలపించింది. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య చెలరేగిన వివాదం చివరకు తోపులాట వరకు వెళ్లడంతో సభలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. మంత్రి నిమ్మల...
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై శాసనమండలిలో తీవ్ర వాగ్వాదం
వైసీపీ హయాంలోనే పనులు ఆగిపోయాయని మంత్రులు నిమ్మల, పయ్యావుల వెల్లడి
సీమకు ఐదేళ్లలో జగన్ చేసిందేమీ లేదని, ఆయనో రాయలసీమ ద్రోహి అని విమర్శ
తమ ప్రభుత్వ హయాంలో సీమ ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయించామన్న మంత్రులు
ఎన్జీటీ ఆదేశాలను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని తీవ్ర ఆరోపణలు
శాసనమండలిలో రాయలసీమ ఎత్తిపోతల పథకం (రాయలసీమ లిఫ్ట్) అంశంపై...