Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • అక్షరాంధ్ర పరీక్షలకు శతశాతం హాజరు కావాలి: కలెక్టర్
    ఈనెల 28న జరిగే అక్షరాంధ్ర ప్రీ-ఫైనల్ పరీక్షకు, మార్చి 15న నిర్వహించే ఫైనల్ పరీక్షకు నమోదు చేసుకున్న వారంతా తప్పనిసరిగా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని విజయనగరం కలెక్టర్ రాం సుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అధికారులతో బుధవారం టెలీ కాన్ఫిరెన్స్ నిర్వహించారు. పరీక్షా కేంద్రాల గుర్తింపు, ఇన్విజిలేటర్ల నియామకం, మూల్యాంకన ఏర్పాట్లు పక్కాగా చేయాలని సూచించారు. #BOIENA RAJESH
    408 Views
  • తమ ప్రాంతం చిరకాల వాంఛ అయిన మార్కాపురం జిల్లా ఇచ్చి, వెలిగొండ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేస్తున్న చంద్రబాబు గారికి అరుదైన కానుక ఇచ్చిన చెల్లమ్మ..
    #VeligondaProject
    #MarkapuramDistrict.
    812 Views
  • తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు
    45 మంది ఐఏఎస్ అధికారులకు స్థానచలనం
    హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం పరిపాలనలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. మొత్తం 45 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పలు కీలక శాఖల్లో కొత్త నియామకాలు చేపట్టింది.
    పంచాయతీరాజ్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా సంజయ్ కుమార్ నియమితులయ్యారు. Southern Power Distribution Company of Telangana Limited (SPDCL) సీఎండీగా జితేశ్ వి. పాటిల్ బాధ్యతలు స్వీకరించనున్నారు. కొత్త డిస్కం సీఎండీగా ముషారఫ్ ఫారూకీ నియమితులయ్యారు.
    ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఈ. శ్రీధర్, ఐటీ & సీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎన్. శ్రీధర్ నియమితులయ్యారు. ఫైనాన్స్ శాఖ సెక్రటరీగా గౌరవ్ ఉప్పల్ బాధ్యతలు చేపట్టనున్నారు.
    డిజాస్టర్ మేనేజ్‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఎం. దాన కిషోర్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా రాహుల్ బొజ్జా నియమితులయ్యారు.
    జిల్లా స్థాయిలో కూడా పలువురు కలెక్టర్లను బదిలీ చేశారు. మహబూబ్‌నగర్ కలెక్టర్‌గా బి. విజయేంద్ర, కరీంనగర్ కలెక్టర్‌గా చిత్రా మిశ్రా, హన్మకొండ కలెక్టర్‌గా చాహత్ బాజ్‌పాయ్, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌గా అంకిత్ నియమితులయ్యారు. యాదాద్రి కలెక్టర్‌గా అనురాగ్ జయంతి, జనగాం కలెక్టర్‌గా సందీప్ కుమార్ ఝా బాధ్యతలు స్వీకరించనున్నారు.
    ఫైనాన్స్ శాఖ స్పెషల్ సెక్రటరీగా సిక్తా పట్నాయక్, ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్‌గా బి.ఎం. సంతోష్, లేబర్ స్పెషల్ కమిషనర్‌గా పమేలా సత్పతి, కోఆపరేటివ్ కమిషనర్‌గా పి.ఎస్. రాహుల్ రాజ్ నియమితులయ్యారు.
    జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌గా రిజ్వాన్ బాషా షేక్, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్‌గా స్నేహ శబర్ష్, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌గా గరిమా అగర్వాల్, వికారాబాద్ జిల్లా కలెక్టర్‌గా దీపక్ తివారీ నియమితులయ్యారు. మెదక్ జిల్లా కలెక్టర్‌గా ప్రతిమా సింగ్, మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్‌గా ఫైజాన్ అహ్మద్ బాధ్యతలు చేపట్టనున్నారు.
    పరిపాలన సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు, అభివృద్ధి కార్యక్రమాలకు వేగం తీసుకురావాలనే లక్ష్యంతో ఈ బదిలీలు చేపట్టినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
    454 Views
  • భారత్-జింబాబ్వే మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందా
    టీ20 ప్రపంచ కప్(T20 World Cup 2026) సూపర్-8లో భాగంగా ఇవాళ(గురువారం) రెండు కీలక మ్యాచ్‌లు జరగనున్నాయి. అందులో భారత్, జింబాబ్వే మ్యాచ్ ఒకటి. చెన్నైలోని చెపాక్ వేదికగా ఇవాళ రాత్రి 7:00 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. సెమీస్ అవకాశాలను మెరుగుపర్చేందు ఈ మ్యాచ్ టీమిండియా చాలా కీలకం. ఈ నేపథ్యంలో మ్యాచ్ జరిగే చెన్నైలో వాతావరణం ఎలా ఉంది, వర్షం ముప్పు ఏమైనా ఉందా?.చెన్నై వాతావరణ కేంద్రం అంచనాలను...
    379 Views
  • సీతారామాలయానికి భూమి పూజ చేసిన మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు
    ఈరోజు ఉదయం రాయచోటి మండలంలోని గుండ్ల చెరువు గ్రామ కస్పానందు 31 లక్షల వ్యయంతో సీతారామాలయం గుడి నిర్మాణానికి భూమి పూజ వేడుకల్లో పాల్గొన్న రవాణా శాఖ మంత్రి సోదరుడు లక్ష్మి ప్రసాద్ రెడ్డి గారు మరియు గుండ్ల చెరువు గ్రామ ప్రజలు ఘనంగా స్వాగతం పలుకుతూ శాలువా గజమాలతో సత్కరించారు  లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూకూటమి ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నామని  అని...
    336 Views
  • వి జి ఆర్ లాడ్జ్ ప్రారంభించిన మిన్నం రెడ్డి మౌర్య రెడ్డి
    ఈరోజు రాయచోటి పట్టణంలోని సుండుపల్లి బైపాస్ రోడ్డు నందు వల్లూరు వాసుదేవ రెడ్డి నూతనంగా నిర్మించిన విజిఆర్ లాడ్జ్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొని యజమానికి శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారి మేనల్లుడు టిడిపి యువ నాయకుడు మినిమం రెడ్డి మౌర్యా రెడ్డి గారు ఈ కార్యక్రమంలో రాయచూరు రూరల్ టిడిపి అధ్యక్షుడు గండికోట సుధాకర్ లక్కిరెడ్డిపల్లి మండల అధ్యక్షుడు మదన్మోహన్...
    361 Views