Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • పుంగనూరు నియోజకవర్గం:కల్లూరులో కాంట్రాక్ట్ టీచర్ అసభ్య ప్రవర్తన!
    పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, కల్లూరు ప్రభుత్వ పాఠశాలలో కాంట్రాక్ట్ టీచర్ గా పనిచేస్తున్న వెంకటేశ్ పై ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనతో మనస్తాపానికి గురైన బాలిక ఆత్మహత్యకు ప్రయత్నించింది. ప్రస్తుతం ఆమె తిరుపతిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వెంకటేశ్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు#...
    281 Views
  • బంగారమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేయండి
    బొబ్బిలి మండలం కొత్తపెంటలో బంగారమ్మ తల్లి ఆలయం నూతనంగా నిర్మించేందుకు నిధులు మంజూరు చేయాలని దేవాదాయ ధర్మదాయ శాఖామంత్రి రాంనారాయణ రెడ్డికి ఎమ్మెల్యే బేబినాయన, సర్పంచ్ చోడవరపు సూర్యనారాయణ, పీఏసీఎస్ అధ్యక్షుడు బి.శ్రీరామమూర్తి వినతిపత్రం అందించారు. అమరావతిలో బుధవారం మంత్రిని కలిశారు. కొత్తపెంటలో బంగారమ్మ తల్లి ఆలయం నూతనంగా నిర్మిస్తామని, నిధులు మంజూరు చేయాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించినట్లు...
    428 Views
  • "ఆడపిల్లల జోలికొస్తే.. అదే చివరి రోజు"
    "ఆడపిల్లల జోలికొస్తే.. అదే చివరి రోజు" AP: మహిళలు, చిన్నారుల భద్రతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని హోంమంత్రి అనిత  ప్రకటించారు. ఎవరైనా ఆడపిల్లల జోలికొస్తే అదే వారికి చివరి రోజు అనే సందేశం ప్రజల్లోకి పంపామని గుర్తు చేశారు. గత రెండేళ్లుగా రాష్ట్రంలో నేరాలు పెరిగాయన్న వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఆరోపణలను.. శాసనమండలిలో మంత్రి అనిత తిప్పికొట్టారు.
    343 Views
  • సీఎం పర్యటనలో అలసత్వం వద్దు: హోంమంత్రి అనిత
    పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి CM చంద్రబాబు ఈనెల 28న రావివలస రానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు రేపటి సాయంత్రానికల్లా పూర్తి చేయాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. అమరావతి నుంచి VC ద్వారా కలెక్టర్ రాం సుందర్ రెడ్డి, తదితరులతో సమీక్షించారు. పారిశుధ్యం, భద్రత, సీసీ కెమెరాల ఏర్పాటు పక్కాగా చేయాలని, విధుల్లో అలసత్వం వహించవద్దని సూచించారు. #BOIENA RAJESH 
    433 Views
  • ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షకు 952 మంది గైర్హాజరు
    విజయనగరం జిల్లాలో బుధవారం జరిగిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షను 21,048 మంది విద్యార్థులు రాయాల్సి ఉండగా 20,096 మంది హాజరయ్యారని రీజనల్ ఇన్స్పెక్టర్ తవిటినాయుడు తెలిపారు. మొత్తం 952 మంది గైర్హాజరయ్యారన్నారు. జిల్లాలో 66 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. 100 మంది ఇన్విజిలేటర్లు, 3 సిట్టింగ్ స్క్వాడ్లు, 3 ఫ్లైయింగ్ స్క్వాడ్లను నియమించారు. జిల్లాలో ఎక్కడా మాల్ ప్రాక్టీస్ జరగలేదని ఆయన చెప్పారు....
    400 Views
  • పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారి సస్పెన్షన్.
    ఏసీబీ ఆకస్మిక తనిఖీల్లో అవకతవకలు వెలుగులోకి రావడంతో పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారి కే.అలివేణిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
    1.9K Views