Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • అనంతపురం గంగమ్మ జాతరలో బండలాగుడు పోటీలను ప్రారంభించిన మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి
    ఈరోజు గంగమ్మ జాతరలో బండలాగుడు పోటీలను ప్రారంభించిన మంత్రి సోదరుడు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు రాయలసీమ నలుమూలల నుంచి వచ్చిన ఎడ్లు పోటీలో పాల్గొన్నాయి మండిపల్లి నాగిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ నుంచి మొదటి బహుమతిగా లక్ష రూపాయలు రెండవ బహుమతిగా 80000 బహుమానంఇవ్వడం  జరిగింది జరిగింది 
    419 Views
  • పుంగునూరు నియోజకవర్గం:కల్లూరు లో గుర్తుతెలియని వ్యక్తి మృతి
    పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, కల్లూరులో బుధవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. సుమారు 15 ఏళ్లుగా ఇక్కడ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఈ వ్యక్తి, విజయవాడ పరిసర ప్రాంతాలకు చెందినవాడని స్థానికులు తెలిపారు. కల్లూరు పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, పూర్తి వివరాల కోసం దర్యాప్తు చేపట్టారు. మృతుని గుర్తింపునకు సంబంధించిన సమాచారం పోలీసుల విచారణలో వెల్లడికానుంది# కొత్తూరు మురళి.
    326 Views
  • మదనపల్లె: రిషిక ప్రియా ఘటనలో తల్లిదండ్రుల కృతజ్ఞతలు.
    మదనపల్లె జిల్లా కేంద్రంలో రిషిక ప్రియా ఘటనలో తమకు అండగా నిలిచిన కూటమి ప్రభుత్వానికి తల్లిదండ్రులు స్వర్ణలత, గోపినాథ్ గురువారం కృతజ్ఞతలు తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో ధైర్యం ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోం మంత్రి అనిత, మంత్రి లోకేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ నాయకులు, మదనపల్లె ప్రజలు, అంతిమ సంస్కారాలకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు....
    279 Views
  • పుంగునూరు నియోజకవర్గం రొంపిచర్ల: హైవేపై రోడ్డు ప్రమాదం
    అనంతపురం-చెన్నై హైవేపై చిన్నగొట్టిగల్లు సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్లో ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ను తప్పించబోయి కారు డివైడర్ను ఢీకొట్టింది. అన్నమయ్య జిల్లా, లక్కిరెడ్డిపల్లికు చెందిన కే. సుబ్బారెడ్డి తిరుపతికి వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సుబ్బారెడ్డి, శ్రీనివాసులు గాయపడ్డారు. గాయపడ్డ వారిని 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు# కొత్తూరు మురళి .
    321 Views
  • చిన్నారి కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి.
    మదనపల్లిలో ఏడేళ్ల చిన్నారిపై జరిగిన అమానుష ఘటనపై ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గురువారం కొండామరిపల్లి గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన, బాధితురాలి కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ కుటుంబానికి అండగా నిలబడ్డ వారిపై కేసులు నమోదు చేయడం బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు.
    303 Views
  • ఇంద్రనగర్ లేబర్ అడ్డా - శివాజీ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా చత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలు .|
    మేడ్చల్   మల్కాజిగిరి జిల్లా   వెంకటాపురం డివిజన్ ఇంద్రనగర్ లేబర్ అడ్డా వద్ద శివాజీ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాల్లో మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్  రెడ్డి  ముఖ్య అతిథిగా పాల్గొని మహారాజ్ చిత్రపటనికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.   ఈ...
    355 Views
  • హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ మొదటి వార్షికోత్సవ వేడుకలు.|
    మేడ్చల్   మల్కాజిగిరి జిల్లా :  ప్రముఖ హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ 'జావేద్ హబీబ్' (Javed Habib) మొదటి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలకు మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమెతో పాటు ప్రేమ్, శోభన్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాంతి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. జావేద్ హబీబ్ బృందానికి తన హృదయపూర్వక...
    328 Views
  • గంజాయి మత్తుతోనే అఘాయిత్యాలు: మాజీ ఎమ్మెల్యే.
    ఆంధ్ర రాష్ట్రంలో గంజాయి, కల్తీ మద్యం విచ్చలవిడిగా లభ్యమవుతుండటమే మదనపల్లెలో ఏడేళ్ల చిన్నారి ఋషిక ప్రియపై అత్యాచారం, హత్య వంటి అఘాయిత్యాలకు కారణమని మదనపల్లె మాజీ ఎమ్మెల్యే దేశ తిప్పారెడ్డి ఆరోపించారు. గురువారం పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిలతో కలిసి బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో గంజాయి, కల్తీ మద్యం విక్రయాలను వెంటనే...
    307 Views
  • పుంగనూరు నియోజకవర్ర్గం : గుర్తుతెలియని వ్యక్తి మృతి పై అప్డేట్
    చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం కల్లూరులో బుధవారం గుర్తు తెలియని వ్యక్తి చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతుడు అనకాపల్లి సమీపంలోని లక్ష్మీదేవిపేటకు చెందిన అడారి రాము(46)గా గుర్తించామని ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం ఇచ్చారు.
    334 Views