Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • మదనపల్లెలో మహాశివరాత్రి సందర్భంగా ఘనంగా అన్నదానం.
    అన్నమయ్య జిల్లా మదనపల్లె చౌడేశ్వరి సర్కిల్ సమీపంలోని నీరుగట్టువారిపల్లిలో ఉన్న శ్రీ నీలకంటేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దండు రామాంజులు సిల్క్ సారీస్, మాజీ కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 4 వేల నుంచి 5 వేల మంది భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, ముష్టూరు రామ్మోహన్, కదిరి...
    547 Views
  • పుంగనూరు:పుంగనూరు పట్టణం లో శ్రీశాంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి
    పుంగనూరులో ఆదివారం, శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతిని జిల్లా అధ్యక్షులు బాలాజీ నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా, మండలంలోని సుగాలి మిట్ట నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ జరిగింది. కర్ణాటక, తమిళనాడుతో పాటు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో బంజారా సోదరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించారు, ఇవి పట్టణ ప్రజలను...
    298 Views
  • పుంగనూరు: పుంగనూరు నియోజకవర్గం:లో పర్యటించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి
    మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం పుంగనూరు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లోని శివాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిచ్చిలివారి పల్లి, దేవళంపేట, ఎర్రాతివారి పల్లి, దుర్గంకొండ, నెక్కుంది గ్రామాల్లోని ఆలయాల్లో ఆయన పాల్గొన్నారు. అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, మహా మంగళ హారతి అనంతరం తీర్థ ప్రసాదాలను అందించారు# కొత్తూరు మురళి.
    334 Views
  • పుంగనూరు నియోజకవర్గ:సదుం మండలంలో పర్యటించిన ఎన్సీడీసీ జాయింట్ డైరెక్టర్
    పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో ఎన్సీడీసీ జాయింట్ డైరెక్టర్ ప్రవీణ్ ఆదివారం పర్యటించారు. బర్డ్ ఫ్లూ సోకిన కంభంవారి పల్లి, పుట్టావారి పల్లి, అమ్మగారి పల్లి ప్రాంతాలలో పశుసంవర్ధక శాఖ జేడి గుణశేఖర్ తో కలిసి ఆయన పర్యటించి, కోళ్ల ఉత్పత్తులను బాగా వేడిచేసి తినాలని ప్రజలకు సూచించారు. అస్వస్థతకు గురైన వారి వివరాలు సేకరించాలని వైద్య సిబ్బందికి ఆదేశించారు# కొత్తూరు మురళి .
    317 Views
  • పుంగనూరు: మామిడి తోటలో అగ్నిప్రమాదం.
    సోమవారం, రామసముద్రం మండలం, మినికి గ్రామంలో మామిడి తోటలో అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక గ్రామానికి చెందిన ఎం.ఎస్. సలీం, ఎం. నజీర్ భాషలకు చెందిన మామిడి తోట మరియు దాని కంచ అగ్నికి గురయ్యాయి. పుంగనూరు అగ్నిమాపక కేంద్రం సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. గుర్తుతెలియని వ్యక్తులు ఆర్పకుండా పడేసిన నిప్పుపుల్లల వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక అధికారి సుబ్బరాజు...
    318 Views
  • .బోయకొండ గంగమ్మను దర్శించుకున్న పెద్దిరెడ్డి
    సోమవారం, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లె మండలం, దిగువపల్లిలోని శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు ఆయనకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం సన్మానించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ఎమ్మెల్యే తెలిపారు# కొత్తూరు మురళి.
    307 Views