Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • నడవలేని,మంచాలకు పరిమితం అయ్య, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఎవ్వరు కూడా పి జి ఆర్ ఎస్ కు తీసుకురాకండి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్,ఐ. ఏ.ఎస్.,
    బాపట్ల: నడవలేని,మంచాలకు పరిమితం అయ్య, అనారోగ్యంతో బాధపడుతున్న  వారిని ఎవ్వరు కూడా పి జి ఆర్ ఎస్ కు తీసుకురావద్దని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.  ప్రభుత్వ ఆదేశాల మేరకు  ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించే పి జి ఆర్ ఎస్ కార్యక్రమంలో ప్రజలు సమస్యల   అర్జీల ను  ఉదయం  10 గంటల నుండి 1 గంట వరకు  జాయింట్ కలెక్టర్...
    323 Views
  • **సాయం చేయటం మానసిక సంతృప్తి*....
    ప్రెస్ నోట్ 👏✍️ *సాయం చేయటం మానసిక సంతృప్తి*.. గిద్దలూరు పురపాలక0లోని సంజీవని అనాధ వృద్ధాశ్రమానికి సోమవారం నాడు యువ ప్రగతి పథం స్వచ్ఛంద సంస్థ సభ్యుల సహకారంతో *25కేజీల రైస్ బ్యాగ్ మరియు ఇతర సరుకులు కందిపప్పు వంటనూనె చింతపండు ఉప్మా రవ్వ ఉల్లిగడ్డలు తదితర వస్తువులు వితరణ చేయడం జరిగినది*  ఈసందర్భంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు *యువప్రగతిపథం సంస్థ అధ్యక్షులు పగిడి వేణుగోపాల్ సార్ గారు మాట్లాడుతూ...
    572 Views
  • రాష్ట్ర పునర్నిర్మాణం,అభివృద్ది,సంక్షేమానికి ఊతమిచ్చేలా బడ్జెట్ కేటాయింపులు ; ఎమ్మెల్యే MM కొండయ్య .
    చీరాల: చీరాల నియెజకవర్గంలోని బీసీల తరపున ప్రభుత్వానికి,సీఎం చంద్రబాబుకు కృతఙ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే కొండయ్య. బీసీలకు అగ్రతాంబూలం,,బీసీ సంక్షేమానికి రూ.47,456 కోట్లు కేటాయింపు పట్ల హర్షం. రాష్ట్ర బడ్జెట్ పట్ల చీరాల ఎమ్మెల్యే MM కొండయ్య హర్షం వ్యక్తం చేశారు.రాష్ట్ర పునర్నిర్మాణం, అభివృద్ది,సంక్షేమానికి ఊతమిచ్చేలా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయన్నారు.స్థానిక బైపాస్ రోడ్డులోని తెదేపా పార్టీ...
    502 Views
  • రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలు
    మదనపల్లి: కురబలకోట మండలం చెన్నామరి మిట్ట వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భవన కార్మికులు గాయపడ్డారు. పెద్దతిప్పసముద్రం మండలానికి చెందిన కరీముల్లా (22), అక్బర్ (18), సౌకత్ (22) భవన నిర్మాణ పనుల కోసం మదనపల్లికి బైకుపై వెళ్తుండగా, ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురికీ తీవ్ర రక్తగాయాలు కావడంతో స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.
    320 Views
  • జనసేన నాయకుల ఆధ్వర్యంలో శ్రీ కృష్ణదేవరాయల జయంతి.
     మదనపల్లి: నిమ్మనపల్లి మండలం చల్లవారిపల్లిలో సోమవారం శ్రీ కృష్ణదేవరాయల జయంతి వేడుకలు జనసేన పార్టీ నాయకులు తోట కళ్యాణ్, అడపా సురేంద్రల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా యువతతో కలిసి కేక్ కట్ చేసి, గ్రామ ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు. శ్రీ కృష్ణదేవరాయల పరిపాలన ఆదర్శప్రాయమని, వారి స్ఫూర్తితో సమాజ సేవలో ముందుండాలని జనసేన నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువత, మహిళలు, కూటమి...
    318 Views
  • వైభవంగా శ్రీ గుంజేడు ముసలమ్మ జాతర పోస్టర్ ఆవిష్కరణ
    ​- పోస్టర్‌ను ఆవిష్కరించిన మంత్రి డాక్టర్ సీతక్క ​ మహబూబాబాద్/కొత్తగూడ, ఫిబ్రవరి 16(భారత్ అవాజ్)తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన కొత్తగూడ మండలం శ్రీ గుంజేడు ముసలమ్మ జాతర మహోత్సవాల పోస్టర్‌ను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ, ఆర్ అండ్ బి శాఖ మంత్రి డాక్టర్ సీతక్క ఘనంగా ఆవిష్కరించి ​జాతర ముఖ్య తేదీలను ప్రకటించారు.​వచ్చే మార్చి నెలలో మూడు రోజుల...
    717 Views
  • *దోర్నాల- శ్రీశైలం ఘాట్‌లో ఆర్టీసీ బస్సు బోల్తా...*
    *దోర్నాల- శ్రీశైలం ఘాట్‌లో ఆర్టీసీ బస్సు బోల్తా...* అదుపుతప్పి రహదారి సైడ్ గుంతలోకి దూసుకెళ్లిన శ్రీశైలం నుంచి కర్నూలు వైపు వెళ్తున్న RTC బస్సు. ప్రమాదం సమయంలో బస్సులో మొత్తం 47 మంది ప్రయాణికులు. అందరూ సురక్షితం. భారీగా నిలిచిపోయిన వాహనాలు. తమ సిబ్బందితో హుటాహుటిన అక్కడికి చేరుకొని ట్రాఫిక్ క్లియర్ చేసిన దోర్నాల SI వెంకట రమణయ్య...!!
    584 Views
  • అమరావతి సచివాలయం సమావేశ మందిరంలో సీఎం, మంత్రులు, సెక్రటరీలతో జరిగిన సమావేశంలో బిల్ గేట్స్ మాట్లాడారు. భారతదేశ డిజిటల్ విప్లవంలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తున్నారని గేట్స్ కితాబిచ్చారు. డిజిటల్ గవర్నెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్‌లో టెక్నాలజీ వాడకంలో చంద్రబాబు గారి కృషిని ప్రశంసించారు. మంత్రుల ప్రశ్నలకు బిల్ గేట్స్ సమాధానం ఇచ్చారు.
    #APWelcomesBillGates
    #BillGates
    #ChandrababuNaidu
    #AndhraPradesh
    1.6K Views
  • ఉండవల్లిలోని వ్యవసాయక్షేత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ సందర్శించారు. అక్కడ ప్రకృతి సాగు ఉత్పత్తులను పరిశీలించారు. రాష్ట్ర వ్యవసాయ రంగంలో అవలంభిస్తున్నఏఐ సహా ఇతర సాంకేతిక విధానాల గురించి అధికారులు ఈ సందర్భంగా వివరించారు. డ్రోన్ల సాయంతో పంటల్లో చీడపీడలు నివారిస్తున్న తీరును స్వయంగా పొలంలోకి వెళ్లి గేట్స్ తిలకించారు. అనంతరం అక్కడ రైతులతో బిల్ గేట్స్ ముఖాముఖి చర్చించారు. వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్న ముఖ్యమంత్రికి, బిల్ గేట్స్‌కు మహిళా రైతులు స్వాగతం పలికారు. వారు వండి తీసుకుచ్చిన స్థానిక వంటలను బిల్ గేట్స్ రుచి చూశారు.
    #APWelcomesBillGates
    #BillGates
    #ChandrababuNaidu
    #AndhraPradesh
    1.3K Views
  • నా బిడ్డను చంపేశారనే అనుమానం – ఎస్పీకి బాధితురాలి ఫిర్యాదు.
    మదనపల్లి జిల్లాలో పూలదివాకర్ (31) అనే యువకుడు అదృశ్యంపై అతని తల్లి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో ఎస్పీకి ఫిర్యాదు చేశారు. జనవరి 1న ఇంటికి వచ్చి, స్నేహితులతో బయటకు వెళ్లి తిరిగి రాని దివాకర్ పై ఇద్దరు వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు
    307 Views