పుంగనూరు మండలం మసేమ్మ కురప్పల్లికి చెందిన రౌడీ షీటర్ డిజే. భాస్కర్ కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో దారుణ హత్యకు గురయ్యాడు. మంగళవారం స్థానికులు ఈ ఘటనను గుర్తించారు. మృతుడిపై ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో పలు కేసులు నమోదైనట్లు సమాచారం. నంగిలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణ లో వెల్లడి కానున్నాయి # కొత్తూరు మురళి.
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలోని శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో మంగళవారం మధ్యాహ్నం ఆలయ ఉప కమిషనర్ ఏకాంబరం క్యూఆర్ కోడ్ స్కానర్లను ప్రారంభించారు. గో సంరక్షణ, అన్నదాన కార్యక్రమాలకు సంబంధించిన ఈ స్కానర్లను భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, సిబ్బంది, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
మంగళవారం, చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం కల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి వెనుక భాగంలో గుర్తుతెలియని వ్యక్తి మృతిచెంది ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. ఈ సమాచారం పోలీసులకు తెలియజేయగా, వారు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతుడి వివరాలు తెలిసినవారు కల్లూరు ఎస్సైకి సమాచారం అందించాలని కోరారు# కొత్తూరు మురళి.
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో హంద్రీనీవా రివర్ ద్వారా కృష్ణ జలాలు పుంగమ్మ చెరువుకు చేరాయి. దీనితో మంగళవారం కోనేటిపాలెం వద్ద ఉన్న మరవను ఊరి ఆచారాల ప్రకారం ఘనంగా విడుదల చేశారు. చెంగారెడ్డి వీధి నుంచి నగరి వీధుల గుండా అమ్మవారికి పూజాది ద్రవ్యాలతో పెద్ద చెంగారెడ్డి రంగారెడ్డి వంశస్థులు ఊరేగింపు నిర్వహించారు. జమీందారుల కాలం నుంచి కొనసాగుతున్న సంప్రదాయం మేరకు పుణ్యమ్మకు విశేష పూజలు చేసి మరవను...
పుంగనూరు పట్టణంలోని పుంగమ్మ చెరువుకు హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలను విడుదల చేయడంతో చెరువు పూర్తిస్థాయిలో నిండింది. మంగళవారం జలాలకు పూజలు నిర్వహించి, 50 రాళ్ల మొరవ వద్ద నీటిని వదిలిపెట్టారు. మొరవ ప్రారంభం కావడంతో ప్రజలు ఆసక్తిగా తరలివచ్చి, కృష్ణమ్మ జలాలతో సెల్ఫీలు తీసుకుని సంబరాలు చేసుకున్నారు. చెరువు నీటితో నిండుగా ఉండటంతో రైతులు ఆనందంలో మునిగిపోయారు# కొత్తూరు మురళి.
Pawan Kalyan: వైసీపీ పట్ల అప్రమత్తంగా ఉండండి: మూడు పార్టీలకు పవన్ కల్యాణ్ సూచన
11-02-2026 Andhra
Pawan Kalyan Warns TDP Janasena BJP to Be Vigilant Against YSR Congress
చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశం
వైసీపీ కుట్రల పట్ల టీడీపీ, జనసేన, బీజేపీ అప్రమత్తంగా ఉండాలని పవన్ సూచన
హిందూమతాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని వైసీపీ చూస్తోందని ఆరోపణ
వైసీపీపై...
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు
పోలీసుల కస్టడీ పిటిషన్ను కొట్టివేసిన గుంటూరు కోర్టు
సీఐ విధులకు ఆటంకం కలిగించారనే కేసులో ఊరట
రేపు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం
మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టులో ఊరట లభించింది. సీఐ విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలతో నమోదైన కేసులో ఆయనకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. అదే సమయంలో, ఆయన్ను...
ఈరోజు మంగళగిరిలో జరిగిన ఒక కార్యక్రమంలో సృజనాత్మక మరియు సాంస్కృతిక చైర్పర్సన్ పొడవటి తేజస్విని గారిని కలిసిన గాలివీడు మండలం ఐ టి డి పి అధ్యక్షుడు లక్కిం శ్రీహరి గారు గాలివీడు మండలంలో పల్లి విషయాలపై చర్చించడం జరిగింది . దీనికి స్పానుకూలంగా స్పందించిన సాంస్కృతిక చైర్పర్సన్ కు ధన్యవాదాలు తెలుపడం జరిగింది
అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం నీరుగుట్టువారిపల్లిలో జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం చైర్మెన్, ఏపీ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మెన్, మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాస్ రావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జనసేన పార్టీ బీసీ నాయకులు బండి మనోహర్, జనసేన పార్టీ రాష్ట్ర చేనేత...