Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • వాట్సాప్‌తో ప్రభుత్వ సేవలు మరింత సులభతరం : కుమార్ దీపక్ కలెక్టర్
    మంచిర్యాల, అక్టోబర్ 8: ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు మంచిర్యాల జిల్లా సమీకృత కలెక్టరేట్‌లో ప్రత్యేక వాట్సాప్ గ్రీవెన్స్‌ నంబర్లు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు.ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఇంటి నుంచే తమ ఫిర్యాదులు, వినతులను వాట్సాప్‌ ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చని పేర్కొన్నారు. ఫిర్యాదులో సమస్యకు సంబంధించిన పూర్తి వివరాలు,...
    123 Views
  • కష్టాలలో పారిశుద్ధ్య కార్మికులు ఖాదర్ చేయూత
    భారత్ ఆవాజ్ న్యూస్  :నల్లచెరువు మండలంలో కార్మికులకు గత తొమ్మిది నెలలుగా జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, తమ సమస్యను మాజీ జడ్పీటీసీ అబ్దుల్ ఖాదర్ దృష్టికి తీసుకెళ్లారు. జీతాలు అందిన వెంటనే డబ్బులు తిరిగి చెల్లిస్తామని కార్మికులు తెలపగా, వారి ఇబ్బందులను అర్థం చేసుకున్న అబ్దుల్ ఖాదర్ మానవతా దృక్పథంతో రూ.65 వేల ఆర్థిక సహాయం అందించారు.జీతాలు వచ్చిన అనంతరం ఆ మొత్తాన్ని తిరిగి...
    150 Views
  • తెనాలి పాత మున్సిపల్ భవనం కూల్చివేత
    తెనాలి నగర అభివృద్ధిలో భాగంగా పాత మున్సిపల్ భవనం కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. దశాబ్దాల పాటు ఎందరో అధికారులు, ఉద్యోగులు, ఈ ప్రాంగణం నుంచి ప్రజలకు సేవలు అందించారు.ఎన్నో కీలక నిర్ణయాలకు భవనం వేదికయింది.మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక వసతులతో తెనాలి కొత్త మున్సిపల్ భవనం కోసం పాత భవనానికి వీడ్కోలు పలుకుతున్నారు. భవనం కనుమరుగవుతున్న జ్ఞాపకాలు ప్రజల, అధికారుల, ఉద్యోగుల, గుండెల్లో పదిలంగా...
    168 Views
  • పేదల వైద్యానికి CMRF భరోసా
    భారత్ అవాజ్ న్యూస్ : కదిరి నియోజకవర్గం పేద కుటుంబాలకు అనారోగ్య చికిత్స ఖర్చులు ఆర్థిక భారంగా మారకుండా ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోందని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అన్నారు.కదిరి పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో 20 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.21,21,130 విలువైన CMRF చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
    175 Views
  • తెనాలిలో యు పి హెచ్ ఎస్ సి, సిసి రోడ్లు ప్రారంభం
    తెనాలి పట్టణం లోని 23వ వార్డులో నూతనంగా నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం యు పి హెచ్సి, c సి రోడ్డును గురువారం ప్రారంభించారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరై వీటిని అందుబాటులోకి తెచ్చారు. ప్రజలకు మెరుగైన వైద్యం, రవాణా వసతుల కల్పించుట యే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. ఈ సదుపాయాలతో తమ సమస్యలు తీరుతాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
    164 Views
  • జగన్‌ను కలిసిన మాజీ ఎమ్మెల్యే కడపల మోహన్‌రెడ్డి
    భారత్ ఆవాజ్ న్యూస్ : కదిరి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ కడపల మోహన్‌రెడ్డి గురువారం తాడేపల్లిలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలతో పాటు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఇరువురు చర్చించినట్లు సమాచారం.
    150 Views
  • రాజ్ ఘాట్ లో మహాత్మా గాంధీకి నివాళులు అర్పించి, నిరసనలో పాల్గొనేందుకు బయలుదేరిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ
    న్యూఢిల్లీ: ఓటు హక్కు పరిరక్షణ, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కోసం చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ బయలుదేరారు. ముందుగా రాజ్‌ఘాట్‌లో జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులు అర్పించి అనంతరం నిరసనలో పాల్గొంటామని తెలిపారు.ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు పునాది అని, ఓటు చోరీకి సంబంధించిన ఆరోపణలపై సమగ్ర, నిష్పక్షపాత విచారణ జరపాలని...
    115 Views
  • అంగన్వాడీలకు 13 రోజుల దసరా సెలవులు ఇవ్వాలని వినతి
    హైదరాబాద్: అంగన్వాడి కేంద్రాలకు దసరా పండుగ సందర్భంగా 13 రోజుల సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడి టీచర్స్, హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో ఐసీడీఎస్ రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ అకేశ్వర్‌కు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా సెలవుల విషయంపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, ప్రస్తుతం ప్రక్రియ కొనసాగుతోందని జాయింట్ డైరెక్టర్ తెలిపారు. సోమవారం వరకు సెలవులపై స్పష్టత వచ్చే అవకాశం...
    115 Views
  • కాన్షాశాంతి వనంలో యోగా శిక్షణ పొందిన రోలుగుంట ఉపాధ్యాయులు
     ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష, హార్ట్ ఫుల్ నెస్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని కాన్హా శాంతివనంలో నిర్వహించిన మూడు రోజుల కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆన్ యోగా కార్యక్రమానికి రోలుగుంట మండలం నుంచి యోగా ఉపాధ్యాయుడు ఎన్ గోవిందు, ఆంగ్ల ఉపాధ్యాయిని పివిఎం నాగజ్యోతి హాజరై శిక్షణ పొందారు.రాష్ట్రంలోని పీఎంశ్రీ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు విద్యార్థుల శారీరక...
    302 Views
  • కాన్షాశాంతి వనంలో యోగా శిక్షణ పొందిన రోలుగుంట ఉపాధ్యాయులు
     ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష, హార్ట్ ఫుల్ నెస్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని కాన్హా శాంతివనంలో నిర్వహించిన మూడు రోజుల కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆన్ యోగా కార్యక్రమానికి రోలుగుంట మండలం నుంచి యోగా ఉపాధ్యాయుడు ఎన్ గోవిందు, ఆంగ్ల ఉపాధ్యాయిని పివిఎం నాగజ్యోతి హాజరై శిక్షణ పొందారు.రాష్ట్రంలోని పీఎంశ్రీ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు విద్యార్థుల శారీరక...
    97 Views