ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పోలవరం జిల్లా, చింతూరు ఐ టి డి ఏ ఎదురుగా వైద్య ఆరోగ్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించడం జరిగింది, ఈ కార్యక్రమంలో చింతూరు డివిజన్ పరిధిలో ఉన్న 11 ప్రాథమిక ఆరోగ్య కేంద్రలలో ఉన్న సిబ్బంది అలాగే 2 కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లలో పని చేస్తున్న సిబ్బంది దాదాపుగా 100 మంది సభ్యులు...
చింతూరు ఏజెన్సీలోని ఆటోల ఫిట్నెస్ (బ్రేక్)పరీక్షలను చింతూరులోనే నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆటో యూనియన్ సభ్యులు కోరారు. నాలుగు మండలాల ఏజెన్సీ ప్రాంతానికి చింతూరు కేంద్రంగా ఉండగా, గత మూడు నెలలుగా స్కానర్ ద్వారా బ్రేక్ పరీక్షల కోసం రాజమండ్రి దగ్గర రాజనగరం వెళ్లాల్సి వస్తోందన్నారు. 100 వాహనాల్లో సుమారు 90 వాహనాలకు పరీక్షలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. దీనివలన...
చింతూరు డిఎస్పీగా కే ఉదయ పావని నియమితులయ్యారు. విజయవాడ సిఐడి డిఎస్పీగా పనిచేస్తున్న ఉదయపావని ని ప్రభుత్వం చింతూరు డిఎస్పీగా బదిలీ చేయడంతో ఆమె నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఉన్న డిఎస్పీ బొడ్డు హేమంత్ బదిలీ నిమిత్తం ఉదయపావనినీ ప్రభుత్వం చింతూరు డివిజన్ కు బదిలీ చేయడం జరిగింది.
కలిగిరి మండలం జిర్రావారిపాలెం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జిర్రా పెద్ద అంకిరెడ్డి అనారోగ్య సమస్యతో బాధపడుతున్న విషయం స్థానిక పార్టీ నాయకుల ద్వారా తెలుసుకున్న గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు మంగళవారం ఆయన స్వగృహానికి వెళ్లి పరామర్శించారు.
ఈ సందర్భంగా పెద్ద అంకిరెడ్డి గారి ఆరోగ్య పరిస్థితిని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు స్వయంగా అడిగి...
Madanapalle: మదనపల్లె ప్రజల చిరకాల ఆకాంక్షగా నిర్మాణం చేపట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజీని కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మదనపల్లె ఇంచార్జ్ ఎస్. నిస్సార్ అహ్మద్ విమర్శించారు. బుధవారం ఆయన ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు మెడికల్ కాలేజీని సందర్శించి నిర్మాణ పనులు, మౌలిక వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా నిస్సార్ అహ్మద్ మాట్లాడుతూ వైఎస్ జగన్ హయాంలో 95 ఎకరాల భూమి...
ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్లుగా ప్రభుత్వ పదవిలో కొనసాగడం అసాధారణ ప్రయాణమని ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజల విశ్వాసమే ఆయన నాయకత్వానికి ప్రధాన బలమని పేర్కొన్నారు. 2026 అక్టోబర్ 7తో మోదీ ప్రభుత్వ అధినేతగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘ది హిందూ’లో రాసిన వ్యాసంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.
మోదీ రాజకీయాలతో మాత్రమే ఇంతకాలం నాయకత్వాన్ని...
భరత్ఆజాజ్ న్యూస్ /వరంగల్ జిల్లా దు గ్గొండి మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా పర్లపల్లి ప్రతాప్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల జర్నలిస్టుల సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా రాజిరెడ్డి ఎంపికయ్యారు. మం డల గౌరవ అధ్యక్షుడిగా దోర్నాల రమేష్, గౌరవ సలహాదారులుగా సర్దార్, భాస్క ర్, నరేందర్, ప్రధా న కార్యదర్శి గా గట్టికోప్పుల విజేందర్, ఉపాధ్యక్షుడిగా రౌతు హరికృష్ణ, సహా య కార్యదర్శిగా గోనె రాజు, కోశాధికారిగా తోకల...
మానవత్వ పరిమళం వెల్లివిరిసిన ఒక అపురూప ఘటనకు ముఖ్యమంత్రి స్థాయి నుంచి ప్రశంసలు లభించాయి. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో అన్నదాన కేంద్రంలో పనిచేస్తున్న గాయత్రి అనే మహిళా ఉద్యోగినిపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసల వర్షం కురిపించారు. చేతులు లేని దివ్యాంగ భక్తుడికి ఆప్యాయంగా అన్నం తినిపించి ఆమె చూపిన సహృదయానికి 'శభాష్ గాయత్రీ' అంటూ అభినందించారు.