Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • ప్రజలందరికీ విజయదశమి పండుగ శుభాకాంక్షలు!

    అమ్మవారి దీవెనలతో ప్రతి ఇంటా ఆనందాలు వెల్లివిరియాలని, ప్రతి ఒక్కరి జీవితంలో విజయం, శాంతి, సౌభాగ్యాలు నిండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
    నాగొల్ల లక్ష్మీనారాయణ
    19వ డివిజన్ కార్పొరేటర్
    బీజేపీ జిల్లా జనరల్ సెక్రటరీ
    129 Views
  • ప్రజల సమస్యలే ఎన్నికల అజెండా: ఇప్పిలి శంకర్
    పలాస-కాశీబుగ్గ:పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ 26వ వార్డులో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థి ఇప్పిలి శంకర్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వార్డులోని ప్రతి గడపను సందర్శిస్తూ ప్రజలను ఆప్యాయంగా కలుసుకుని వారి సమస్యలను తెలుసుకుంటూ మద్దతు కోరుతున్నారు....
    205 Views
  • రోజా, పెద్దిరెడ్డికి ఎదురుదెబ్బ..!
    రాజకీయంగా చక్రం తిప్పిన మాజీ మంత్రులు పెద్దిరెడ్డి, రోజాకు ఎదురుదెబ్బ తగిలింది. పుంగనూరులో వైసీపీ నుంచి ఛైర్పర్సన్ పదవికి నామినేషన్ వేయకపోవడంతో TDP అభ్యర్థి నయీమా తాజ్ ఏకగ్రీవమయ్యారు. నగరిలో వైసీపీ అభ్యర్థులు రమేశ్ రెడ్డి, బాలకృష్ణ నామినేషన్లు తిరస్కరణకు గురికావడంతో TDP నుంచి శ్రీనివాసులు ఏకగ్రీవమయ్యారు. కీలకమైన మున్సిపాలిటీల్లో పదవులు టీడీపీ ఖాతాలోకి వెళ్లడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
    174 Views
  • అల్పపీడనం.. ఉత్తర కోస్తాకు తుఫాన్ ముప్పు
    AP: ఈ నెల 24న అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. 26వ తేదీ తర్వాత వాయుగుండంగా మారొచ్చని, 29 లేదా 30న ఉత్తర కోస్తాలో తీవ్ర తుఫాన్గా తీరం దాటనుందని హెచ్చరించారు. ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. మరోవైపు నేడు అల్లూరి, ప.గో, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని SDMA తెలిపింది.
    183 Views
  • నాగోల్‌లో వాటర్ పైప్‌లైన్ దెబ్బతినడంతో కలకలం
    నాగోల్ ప్రాంతంలో నీటి పైప్‌లైన్ దెబ్బతిన్న ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పైప్‌లైన్‌కు నష్టం జరగడంతో నీటి సరఫరాకు అంతరాయం కలిగే అవకాశం ఉండటంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పైప్‌లైన్ దెబ్బతినడానికి గల కారణాలు, ఘటన జరిగిన ఖచ్చితమైన ప్రదేశం, మరమ్మతుల పురోగతి వంటి వివరాలు అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి దెబ్బతిన్న...
    132 Views
  • ఫేక్ ఐడీలు, అమ్మాయిల ఫొటోలతో 82 మందిని ట్రాప్ చేశాడు
    అమ్మాయిల పేరుతో ఫేక్ సోషల్ మీడియా అకౌంట్లు సృష్టించి అమాయకులను మోసం చేస్తున్న ఓ కేటుగాడిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నిందితుడు ఏకంగా 27 ఇన్స్టా, ఫేస్బుక్ అకౌంట్స్ క్రియేట్ చేసి సుమారు 82 మంది అబ్బాయిలను టార్గెట్ చేశాడు. వారి ప్రైవేట్ ఫొటోలు, వీడియోలను పంపించేలా చాట్ చేసి, వాటిని భద్రపరిచాడు. తర్వాత అమ్మాయి సోదరుడినంటూ బెదిరించి దాదాపు రూ.25 లక్షలకు పైగా వసూలు చేశాడు.
    182 Views
  • తెలంగాణ ప్రజలకు ఆ దుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని, ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలను వెలిగించాలని కోరుకుంటూ..

    రాష్ట్ర ప్రజలందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు 🙏🏻
    111 Views
  • ఆదిపరాశక్తి ఆశీస్సులు అందరిపై ఉండాలి... ఈ విజయదశమి మీ జీవితంలో విజయాలు తీసుకురావాలి.. చేపట్టే ప్రతి పని విజయవంతమవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటూ.....అందరికీదసరా శుభాకాంక్షలు 💐
    119 Views
  • 🌼 తెలంగాణ రాష్ట్ర, జిల్లా ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు! 🌼

    చెడుపై మంచి, అధర్మంపై ధర్మం విజయం సాధించిన స్ఫూర్తితో మీ జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అభివృద్ధి, విజయాలు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
    116 Views