Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తా.. పలాసను ప్రగతి పథంలో నిలుపుతా!
    ​• పలాస జడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా బొమ్మిడి దుర్యోధనరావు (బీడీ రావు) ​• పార్టీ అధిష్టానానికి, నియోజకవర్గ నేతలకు ప్రత్యేక కృతజ్ఞతలు ​• 'కత్తి కంటే కలం గొప్పది' అనే సిద్ధాంతంతోనే నా ప్రయాణం: బీడీ రావు ​పలాస: పలాస మండల సమగ్ర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా జిల్లా పరిషత్‌లో ప్రజా గొంతుకనై నినదిస్తానని పలాస మండల వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ...
    121 Views
  • *నీరు, విద్యుత్ వినియోగాన్ని 20% తగ్గించాలి..*

    హైదరాబాద్ వాసులకు HMWSSB కీలక సూచనలు..

    రానున్న రోజుల్లో తీవ్ర నీటి సమస్య ఉంటుందని, నీరు మరియు విద్యుత్ వినియోగాన్ని 20% తగ్గించుకోవాలని ప్రజలకు సూచించిన వాటర్ బోర్డు ఎండీ అశోక్.

    అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సాయంత్రం 5 గంటల తర్వాత ఏసీలు ఆపేయాలని, ఏసీలు వాడినా 25 డిగ్రీల ఉష్ణోగ్రతలోనే ఉంచాలని ఆదేశాలు.

    ప్రభుత్వ ఉద్యోగులు ఇంటికి వెళ్లే ముందు కార్యాలయాల్లో లైట్లు, ఫ్యాన్లు, కంప్యూటర్లు అన్నీ ఆపేసి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసిన వాటర్ బోర్డు ఎండీ అశోక్...
    23 Views
  • *ఎల్నినో ప్రభావం కారణంగా అధిక ఉష్ణోగ్రత, ఉక్కపోతతో సతమతమవుతున్న సందర్భంలో వాతావరణ శాఖ చల్లని కబురందించింది...😍*

    ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కొద్దిరోజుల్లో తుపానుగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఈ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. *ఈ నెల 28 నాటికి వాయుగుండం తుపానుగా మారి ఆంధ్రప్రదేశ్‌ తీరానికి సమీపంలోకి చేరుకుంటుందని, ఈ ప్రభావంతో రాష్ట్రంలోని ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.* దీంతో ఈ *మూడు జిల్లాలకు ఎరుపు రంగు హెచ్చరికలు జారీ* చేసింది. *జయశంకర్‌ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి* ని తెలిపింది.

    *రాష్ట్రంలో మూడు రోజుల పాటు వానలు*
    ఈ..తుపాను ప్రభావంతో రాష్ట్రంలో ఈ నెల 27 నుంచి 29 వరకు చాలా జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. ఎల్‌నినోతో కొద్ది రోజులుగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు కాగా, ప్రస్తుతం వాతావరణంలో కొద్దికొద్దిగా మార్పు వస్తోంది. శుక్రవారం నుంచి కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతూ వస్తున్నాయి. పలు జిల్లాల్లో చలిగాలులు వీస్తున్నాయి. వేకువజామున మంచు దుప్పటి పరచుకుంటోంది.

    *దూసుకొస్తున్న 'అర్నబ్' తుపాన్*

    బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి అర్నబ్ తుపాన్ గా మారుతున్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. తుపానుగా మారిన తర్వాత 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శనివారం రాత్రికి వాయుగుండంగా బలపడింది. ఇది కాకినాడకు 910 కి.మీ., విశాఖకు 820 కిలోమీటర్లు, బాపట్లకు 1,100 కి.మీ., మచిలీపట్నానికి 1,020 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైంది. తర్వాత పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ ఆదివారానికి మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారనుంది. సోమవారం ఉదయానికి తూర్పు, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడనుంది. మంగళవారం ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా బలపడే అవకాశం కనిపిస్తోంది. తర్వాత పశ్చిమ, వాయవ్య దిశగా కదులుతూ అతి తీవ్ర తుపానుగా మారొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. బుధవారం ఉదయం ఆంధ్రప్రదేశ్‌ తీర సమీపానికి చేరుకొని బాపట్ల-విశాఖ మధ్య తీరం దాటే అవకాశం కనిపిస్తోంది. ఆ సమయంలో పెనుగాలులు వీచే అవకాశం ఉంది.
    24 Views
  • దరఖాస్తు చేసినప్పటి నుంచి పెన్షన్ ఇవ్వాల్సిందే: HCA.
    AP: అర్హత ఉన్నప్పటికీ పెన్షన్ మంజూరులో ఆలస్యమైతే ఆ కాలానికి బకాయిలు చెల్లించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. గుంటూరు జిల్లాకు చెందిన ఓ మహిళ 2024 మార్చిలో వితంతు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకుంది. అయితే పరిశీలనలో జాప్యం వల్ల 2026 FEB నుంచి అధికారులు ఆమెకు పెన్షన్ అందించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.. 2024 MAR - 2026 FEB 2 బకాయిలను 8 వారాల్లోగా చెల్లించాలని స్పష్టం చేసింది.
    36 Views
  • కౌంటింగ్, స్ట్రాంగ్ రూమ్ల వద్ద నిరంతర నిఘా ఏర్పాటు
    కౌంటింగ్, స్ట్రాంగ్ రూమ్ల వద్ద నిరంతర నిఘా ఏర్పాటు చేసినట్లు పార్వతీపురం ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. ఆదివారం స్ట్రాంగ్ రూం లెక్కింపు కేంద్రాలను ఆదివారం పరిశీలించారు. ఎన్నికల అనంతరం బాలెట్ బాక్స్ల భద్రత, ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. DSP తదితరులు ఉన్నారు....
    36 Views
  • పార్వతీపురం జిల్లాలో 1,181 మంది అభ్యర్థుల నామినేషన్లు
    పార్వతీపురం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి చెల్లుబాటైన నామినేషన్ల వివరాలను జిల్లా ఎన్నికల అధికారి ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు.   జిల్లావ్యాప్తంగా 15 మండలాల్లోని 226 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల పరిశీలన అనంతరం మొత్తం 1,181 మంది అభ్యర్థుల నామినేషన్లు దాఖలైనట్లు...
    39 Views
  • 24వ వార్డులో వైసీపీ అభ్యర్థుల ఇంటింటి ప్రచారం
    పార్వతీపురం మున్సిపాలిటీలోని 24వ వార్డులో వైసీపీ అభ్యర్థి జమ్ము దుర్గారాణి, ఛైర్పర్సన్ అభ్యర్థి సాయిశ్రీ మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులోని ప్రజలను కలిసి తమ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రచార కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. #RAJESH 
    43 Views
  • ఎంబిబిఎస్ సీటు సాధించిన చింతల మనుశ్రికి అభినందనలు
    భారత ఆవాజ్ న్యూస్ రాజాపేట వైద్య విద్యలో ప్రతిభ చాటి ఎంబిబిఎస్ సీటు సాధించిన రాజాపేట మండల కేంద్రానికి చెందిన చింతల మనుశ్రీని అంబేద్కర్ యువజన సంఘం వారు శాలువాతో సన్మానం చేసి అభినందించారు రాజాపేట కు చెందిన గ్రామీణ వైద్యులు చింతల రవీందర్ సుప్రియ గార్ల కుమార్తె అయినా మనుశ్రీ సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉచిత ఎంబిబిఎస్ సీటును కైవసం చేసుకుంది ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు మల్యాల...
    93 Views
  • ఎంబిబిఎస్ సీటు సాధించిన చింతల మనుశ్రికి అభినందనలు
    భారత ఆవాజ్ న్యూస్ రాజాపేట వైద్య విద్యలో ప్రతిభ చాటి ఎంబిబిఎస్ సీటు సాధించిన రాజాపేట మండల కేంద్రానికి చెందిన చింతల మనుశ్రీని అంబేద్కర్ యువజన సంఘం వారు శాలువాతో సన్మానం చేసి అభినందించారు రాజాపేట కు చెందిన గ్రామీణ వైద్యులు చింతల రవీందర్ సుప్రియ గార్ల కుమార్తె అయినా మనుశ్రీ సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉచిత ఎంబిబిఎస్ సీటును కైవసం చేసుకుంది ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు మల్యాల...
    18 Views