శ్రీరాంపూర్ : మంచిర్యాల జిల్లాలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పర్యటించారు. కాంగ్రెస్ సీనియర్ నేత మంతెన జగన్మోహన్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్న ఎంపీకి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
శ్రీరాంపూర్, సీసీసీ కార్నల్, మంచిర్యాల ఐబీ చౌరస్తా, రైల్వే స్టేషన్ వద్ద పలు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వంశీకృష్ణ మాట్లాడుతూ బీఆర్ఎస్...
2026-27 విద్య సంవత్సరానికి సంబంధించి స్కూల్ ఫెసిలిటీ అండ్ మెయింటనెన్స్ గ్రాంట్ కింద రూ.80,81,500 విడుదల అయినట్లు మంచిర్యాల అదనపు కలెక్టర్, డి ఈ వో చంద్రయ్య తెలిపారు. రెండు రోజుల్లో పాఠశాలల ఏ ఏ పీ సీ ఖాతాల్లో జమ కానునట్లు పేర్కొన్నారు. ఈ నిధులతో ప్రభుత్వ, స్థానిక సంస్థలు, ఆదర్శ పాఠశాలల్లో తరగతి గదులు, పాఠశాల ఆవరణ, పరిశుభ్రత నిర్వాహన ఉద్యోగికి గౌరవ వేతనం చెల్లించడం జరుగుతుందన్నారు.
• రైల్వే పోలీస్ ఫోర్స్‌లో డిప్యూటేషన్‌పై విధులు
• వైరల్ వీడియోపై దక్షిణ మధ్య రైల్వే విచారణ
• సర్వీస్ నుంచి తొలగించడంతో పాటు క్రిమినల్ కేసు
• సైబరాబాద్ సీపీకి డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు
అల్వాల్, సెప్టెంబర్ 19: హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ వద్ద మహిళపై దాడి చేసిన ఘటనలో తెలంగాణ పోలీస్ శాఖకు చెందిన...
• జేఏసీ చైర్మన్ సురేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు
• మూడో రోజు దీక్షలో 11 మంది ఉద్యమకారులు
• దీక్షా శిబిరానికి తరలివచ్చిన పలువురు నేతలు
అల్వాల్, సెప్టెంబర్ 19: తెలంగాణ ఉద్యమకారుల ఆల్వాల్ జేఏసీ చైర్మన్ సురేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ అమరవీరుల శిబిరంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి.
డిమాండ్ల...
*
కొందరు కావాలని "UPI పై ఛార్జీలు, GST" అంటూ తప్పుడు వార్తలు సృష్టించి ప్రజలను భయపెడుతున్నారు. ఇది పూర్తిగా అవాస్తవం.
*వాస్తlllవం ఏంటి?*
✅ మోడీ ప్రభుత్వం 2020 నుండే UPI పై MDR ను పూర్తిగా తీసేసింది. MDR లేనప్పుడు GST అనే ప్రశ్నే లేదు.
✅ ఏప్రిల్ 18, 2025 న కేంద్ర ఆర్థిక శాఖ అధికారికంగా ప్రకటించింది - "రూ.2000 పైన UPI కి GST అనేది పూర్తిగా అబద్ధం, ప్రాతిపదిక లేని...
మంచిర్యాలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అథ్లెటిక్స్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మారయ్య జెండా ఊపి పోటీలను ప్రారంభించారు .ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఎంపిక చేస్తామని, వారు హనుమకొండలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ లింగయ్య ,కోచ్ సంతోష్, P D, P E T లు పాల్గొన్నారు.
మంచిర్యాల: పట్టణ ప్రజలు, ప్రయాణికుల సౌకర్యార్థం మంచిర్యాల బస్టాండ్‌ను సుమారు రూ.20 కోట్లతో ఆధునీకరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తెలిపారు.
ఆర్టీసీ ఈడీ రాజశేఖర్, మున్సిపల్ కమిషనర్ అన్వేష్‌తో కలిసి బస్టాండ్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే, ప్రయాణికులకు అవసరమైన మౌలిక వసతులు, తాగునీరు, మరుగుదొడ్లు, వెయిటింగ్ హాల్ తదితర సౌకర్యాలపై అధికారులతో...