విశాఖపట్నం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఈ నెల 19న ఆంధ్ర విశ్వవిద్యాలయం (AU) ఇంజినీరింగ్ గ్రౌండ్స్‌లో జరగనున్న గౌరవ ముఖ్యమంత్రి పర్యటన, SASA మరియు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమ ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహణలో ప్రభుత్వ విప్ *గణబాబు* పాల్గొన్నారు.
ఈ సమావేశానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా వీరాంజనేయ స్వామి, ఎంపీ శ్రీ భరత్ వర్చువల్ విధానంలో...
Madanapalle: కమ్మపల్లికి చెందిన తమ భూమిని సొంత అన్న ఆర్. తులసి నాయుడు తప్పుడు రికార్డులు సృష్టించి ఆక్రమించుకున్నారని ఆర్. దేవేంద్ర కుమార్, ఆర్. చంద్రశేఖర్, లేట్ రుసేంద్రనాయుడు కుమారుడు శశికుమార్ ఆరోపించారు. తమను ఇబ్బందులకు గురిచేస్తూ, భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, తమకు ప్రాణహాని ఉందని వారు మదనపల్లె ప్రెస్ క్లబ్లో విలేకరుల ముందు ఆవేదన వ్యక్తం చేశారు. వారు తెలిపిన వివరాల మేరకు...
అన్నమయ్య జిల్లా: పెద్దతిప్పసముద్రం మండలం టి సదుం క్రాస్ లో తంబల్లపల్లి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ జి శంకర్ హంద్రీనీవా జలాలు నియోజకవర్గంలోకి ప్రవేశించిన నేపద్యంలో జలహారతి కార్యక్రమం నిర్వహించారు. తంబళ్లపల్లె నియోజకవర్గ ప్రజల సాగు, తాగునీటి అవసరాల కోసం నీటి ప్రాధాన్యతను చాటిచెప్పేoదుకు జలహారతి కార్యక్రమం చేపట్టడం జరిగిందని శంకర్ తెలిపారు.
Madanapalle: బెంగళూరు రోడ్డు నక్కలదిన్నె పప్పిరెడ్డిపల్లెలో ఎన్పీఎస్ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మదనపల్లె ఏఎంసీ చైర్మన్, జనసేన పార్టీ ఉమ్మడి అన్నమయ్య, చిత్తూరు జిల్లాల ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం పాల్గొని వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో,...
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు రెండు రోజుల పర్యటన నిమిత్తం నేడు తిరుమలకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రతి ఏటా జరుగుతున్న సంప్రదాయాన్ని అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. దీంతో పాటు తిరుమలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు.
సీఎం పర్యటన వివరాల ప్రకారం.. ...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, టీడీపీ నేత ఆళ్ల నాని (కాళీ కృష్ణ శ్రీనివాస్) అకాల మరణం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేవలం 56 సంవత్సరాల వయసులోనే గుండెపోటుతో ఆళ్ల నాని దూరమవడం తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఈ మేరకు చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా తన సంతాప సందేశాన్ని...
● 2019లో మూసివేసిన రౌడీషీట్ పునరుద్ధరణ
● జూబ్లీహిల్స్, మేడిపల్లి పరిధుల్లో బెదిరింపుల ఆరోపణలు
● ఇటీవల నమోదైన కేసుల నేపథ్యంలో అంబర్‌పేట పోలీసుల చర్య.
అల్వాల్, సెప్టెంబర్ 15: హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అంబర్‌పేట పోలీస్‌స్టేషన్ పోలీసులు అంబర్‌పేట శంకర్‌పై మళ్లీ రౌడీషీట్ ఓపెన్ చేశారు.
గతంలో శంకర్‌పై కొనసాగిన రౌడీషీట్‌ను 2019లో...
భూపాలపల్లి జిల్లా: శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, గృహ నిర్మాణ శాఖ, ఎంపీడీఓలు, మున్సిపల్ అధికారులతో కలిసి ఇళ్ల నిర్మాణాలపై సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమం కావడంతో, గ్రౌండింగ్ నుండి నిర్మాణం పూర్తయ్యే దశలన్నింటినీ పర్యవేక్షించాలని, నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సత్యనారాయణ రావు సూచించారు. రెండు పడక గదుల...
భూపాలపల్లి జిల్లా: శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, గృహ నిర్మాణ శాఖ, ఎంపీడీఓలు, మున్సిపల్ అధికారులతో కలిసి ఇళ్ల నిర్మాణాలపై సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమం కావడంతో, గ్రౌండింగ్ నుండి నిర్మాణం పూర్తయ్యే దశలన్నింటినీ పర్యవేక్షించాలని, నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సత్యనారాయణ రావు సూచించారు. రెండు పడక గదుల...
కొండపురం (నెల్లూరు జిల్లా):
మండల పరిధిలోని గొట్టిగుండ్ల గ్రామంలో 2024 జులై 31 నాటికి తాగునీటి ప్రాజెక్టు/ట్యాంకు పనులు పూర్తయినా, నేటికీ అది ప్రజలకు ఉపయోగపడటం లేదని స్థానిక గ్రామస్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.