₹5000 కోట్లతో మూసీ నది ఒడ్డున భారీ గాంధీ విగ్రహం పెట్టనున్న రేవంత్ ప్రభుత్వం .|

0
254

 

 

హైదరాబాద్ :  ప్రజల నుండి , ప్రజా సంఘాల నుండి, పర్యావరణవేత్తల నుండి, రాజకీయ పార్టీల నుండి తీవ్ర వ్యతిరేకత వస్తున్నా మూసీ సుందరీకరణ ప్రాజెక్టు విషయంలో ముందుకే పోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు.

 

అందుకే ఇంకా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు కాకున్నా, ఏషియన్ డెవలప్మెంట్ ప్రాజెక్టు రుణం మంజూరు చేయకున్నా హడావిడిగా మూసీ నది ఒడ్డున రూ. 5000 కోట్లు వెచ్చించి దేశంలోనే ఎత్తైన గాంధీ విగ్రహాన్ని నిర్మించే పనికి ఫిబ్రవరి నెలలోనే శంకుస్థాపన చేయనున్న కాంగ్రెస్ సర్కారు.

 

దీని కోసం ఈసి, మూసీ నదుల సంగమం వద్ద ఉన్న పది ఎకరాల భూసేకరణకు మొన్ననే తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. 

 

ఈ ప్రాజెక్టు కోసం 3,279 ఎకరాలు, 10,017 ఇండ్లు, షాపులు సేకరించనున్నారు

 

అయితే నోటిఫికేషన్ ఇచ్చిన భూమిలో మధు పార్క్ రిడ్జ్ అపార్టుమెంట్ కాంప్లెక్స్ లో నివసించే సుమారు 500 కుటుంబాలు ఈ నిర్ణయంతో రోడ్డున పడే ప్రమాదం ఏర్పడింది.

 

 ఒక విగ్రహం కోసం 5000 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేయడమే తప్పు. దాని కొరకు తమ రెక్కల కష్టంతో అపార్ట్మెంట్ కొనుక్కున్న 500 కుటుంబాలను రోడ్డున పడేయడం దుర్మార్గమైన చర్య... అని ప్రజలు మండిపడుతున్నారు.

 

రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేయడానికి, అభివృద్ధి పనులకు డబ్బులు లేవంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,  కృత్రిమ బీచ్, మిస్ వరల్డ్ అందాల పోటీలు, గ్లోబల్ సమ్మిట్ వంటి వాటికి వందల వేల కోట్ల వృధా ఖర్చు. అని ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది.

 

రైతుబంధు కోసం డబ్బు లేదంటున్న ఈ  ముఖ్యమంత్రికి ఒక విగ్రహం కోసం రూ 5000 కోట్లు ఖర్చు అవసరమా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 

#sidhumaroju

Alwal 

Search
Categories
Read More
Telangana
మహిళలు, విద్యార్థుల్లో సైబర్ భద్రతపై చైతన్యం...సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
    మహిళలు, విద్యార్థుల్లో సైబర్ భద్రతపై చైతన్యం...సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి...
By Pinnehasan Odela 2026-03-09 13:09:17 0 242
Andhra Pradesh
లక్కిరెడ్డిపల్లి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు యనమల మదన్మోహన్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ
మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మరియు డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి...
By Benguluri Madhubabu 2026-06-20 10:53:46 0 180
Andhra Pradesh
నేడు ఏపీ కేబినెట్ భేటీ .. ఈ కీలక అంశాలపై చర్చ.
అమరావతిలో రూ.1,208 కోట్ల ట్విన్ టవర్ల ప్రాజెక్టుకు ఆమోదం తెలిపే అవకాశం సచివాలయం, అసెంబ్లీ భవనాల...
By Pagadala Venkateswar 2026-04-30 04:30:32 0 130
Andhra Pradesh
పంట నష్టం వివాదం – దంపతులపై కర్రలతో దాడి.
గురువారం, రామసముద్రం మండలంలోని నారిగానిపల్లి పంచాయతీ దిగువలంబంవారిపల్లెలో పంట నష్టం వివాదం తీవ్ర...
By Pagadala Venkateswar 2026-04-02 10:21:27 0 206
Andhra Pradesh
ఫ్రీగా పైరసీ సినిమాలు చూస్తున్నారా?.. ఆ యాప్ వాడితే ఇక అంతే సంగతులు.. క్షణాల్లో మీ ఇంటికి..
మీరు స్మార్ట్‌ ఫోన్‌లో పైరసీ సినిమాలు చూస్తున్నారా?, అయితే జాగ్రత్త మీరు త్వరలోనే పెను...
By SivaNagendra Annapareddy 2025-12-23 06:54:09 0 292
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com