Bharat Aawaz

రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు: వైసీపీ మహిళా నేత నాగమణి ఆరోపణ

Ratna Sekhar
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
2 min read
0
Comments
817
Views

కాకినాడ రూరల్:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని వైసీపీ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు నాగమణి విమర్శించారు. కాకినాడ రూరల్‌లోని వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.

మదనపల్లె ఘటనపై ప్రభుత్వం తగిన విధంగా స్పందించలేదని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలో బాలికలు, వృద్ధ మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల రక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

మహిళల అదృశ్యాల అంశంపై గతంలో తీవ్రంగా స్పందించిన నాయకులు ప్రస్తుతం మౌనం వహిస్తున్నారని ఆమె ప్రశ్నించారు. ప్రజలకు భద్రత కల్పించాల్సిన ప్రభుత్వ యంత్రాంగం ఈ విషయంలో విఫలమైందని ఆరోపించారు.

రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.