Bharat Aawaz

చొల్లంగి వద్ద గుర్తుతెలియని మృతదేహం లభ్యం

Ratna Sekhar
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
2 min read
0
Comments
205
Views

పోలీసుల దర్యాప్తు ప్రారంభం

తాళ్లరేవు, తాళ్లరేవు మండలం చొల్లంగి రోడ్డుపక్కన బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమవడంతో స్థానికంగా కలకలం రేగింది. రాత్రి సమయంలో అక్కడి ప్రజలు గమనించి పోలీసులకు సమాచారం అందించగా, వెంటనే వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం, మృతుడు సుమారు 40–45 ఏళ్ల వయస్సు గల వ్యక్తిగా గుర్తించారు. మృతదేహంపై ‘రవికుమార్’, ‘బుజ్జి అమ్మ’ అనే పేర్లతో పచ్చబొట్లు ఉన్నట్లు తెలిపారు. అలాగే ఎరుపు రంగు కాశీతాడు ధరించి ఉన్నట్లు గుర్తించారు.

మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదని, అనుమానాస్పద మృతి కోణంలో విచారణ కొనసాగిస్తున్నామని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

మృతుడి వివరాలు తెలిసిన వారు సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై కోరంగి ఎస్‌ఐ సత్యనారాయణ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.