సముద్రంలో మొరాయించిన కోరంగి టూరిజం బోటు – పర్యాటకుల్లో భయాందోళన
Posted 2026-02-19 14:33:13
0
340
తాళ్లరేవు మండలం చొల్లంగి నుంచి కోరంగి హోప్ ఐలాండ్‌కు 15 మంది పర్యాటకులతో బయలుదేరిన టూరిజం బోటు సముద్రంలో సాంకేతిక లోపం కారణంగా మధ్యలోనే నిలిచిపోయిన ఘటన కలకలం రేపింది.
అचानक బోటు మొరాయించడంతో అందులో ఉన్న పర్యాటకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి ప్రత్యామ్నాయ బోటును ఘటనాస్థలానికి పంపించారు.
అధికారుల సమన్వయంతో రక్షణ చర్యలు వేగంగా కొనసాగించడంతో ఎటువంటి ప్రమాదం జరగకుండా పర్యాటకులను సురక్షితంగా తీరానికి తరలించారు. ఈ ఘటనతో కొంతసేపు సముద్రయాన సేవలు నిలిచిపోయాయి.
పర్యాటకులు మాట్లాడుతూ, టూరిజం బోట్ల ఫిట్నెస్‌ను నిరంతరం తనిఖీ చేయాలని, భద్రతా ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని సంబంధిత అధికారులు తెలిపారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరులో అంబటి రాంబాబు దిష్టిబొమ్మ దగ్ధం
అన్నమయ్య జిల్లా, పుంగునూరు పట్టణంలో ఆదివారం తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాజీ మంత్రి అంబటి రాంబాబు...
పుంగనూరు: దేవాదాయ శాఖలోకి మారెమ్మ ఆలయం కొత్తూరు మురళి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని ప్రైవేటు బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీవిరుపాక్షి మారెమ్మ ఆలయం...
104 వైద్య బృందం ఆగస్తిగానిపల్లిలో వైద్య పరీక్షలు, మాత్రల పంపిణీ
చౌడేపల్లి మండలం కాటిపేరి పంచాయతీ, ఆగస్తిగానిపల్లిలో 104 ద్వార వైద్య పరీక్షలు, మరియు మాత్రలు...
చింతచెట్టు పైనుంచి పడి యువకుడికి తీవ్ర గాయాలు.
మదనపల్లి మండలంలో మంగళవారం, గంగన్నగారిపల్లికి చెందిన రవి (38) అనే యువకుడు నిమ్మనపల్లి రోడ్డులోని...
#రాజన్న సిరిసిల్ల జిల్లా నగునూరి శ్రీనివాస్ కి పురస్కారం
రాజన్న సిరిసిల్ల జిల్లా. వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రంలో నాదస్వరం విద్యన్ విధ్వంసుడు నగునూరి...