నిరంతరాయమైన విద్యుత్ ను అందిచడమై లక్ష్యం విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే MMకొండయ్య.

0
222
చీరాల: విద్యుత్ రంగానికి కూటమి సర్కార్ పెద్ద పీట.
నూతనంగా నిర్మించనున్న విద్యుత్ సబ్‌స్టేషన్‌ తో చీరాల పట్టణంతో పాటుగా పరిసర ప్రాంతాలలోని ప్రజలకు నిరంతరాయమైన,నాణ్యమైన విద్యుత్ ను అందించేందుకు గాను ఎంతగానోదోహదపడుతుందని చీరాల ఎమ్మెల్యే MMకొండయ్య అన్నారు.బుధవారం చీరాల మున్సిపల్ పరిదిలోని జయంతిపేటలో 4.5 కోట్లతో నూతనంగా నిర్మించనున్న 33/11 KV సబ్‌స్టేషన్‌ నిర్మాణ పనులకు బుధవారం చీరాల ఎమ్మెల్యే MMకొండయ్య భూమి పూజ చేశారు.ఈసందర్భంగా అయన మాట్లాడుతూ ఈ సబ్‌స్టేషన్ నిర్మాణంతో చీరాల పట్టణంలోని స్థానికంగా ఉన్న జయంతిపేటను మొదలుకొని,హరిప్రసాద్ నగర్ ,విఠల్ నగర్,గాంధీ నగర్ ,జై ప్రకాష్ నగర్,దండుబాట, వైకుంఠపురం,స్వర్ణ గేటు తదితర ప్రాంతాల పరిధిలోని విద్యుత్ వినియేగదారులకు విద్యుత్ కోతలు , లో ఓల్టేజ్ సమస్యకు శాశ్వితంగా పరిష్కారం లభించినట్లేనన్నారు.ఇప్పటి వరకు ఈప్రాంత ప్రజలు ఓవర్ లోడ్ కారణంగా విద్యుత్ కోతలతో ఇబ్బందిపడిన క్రమంలో,,విద్యుత్ సబ్‌స్టేషన్‌కు అందుబాటులోకి వేస్తె ఓవర్ లోడ్ సమస్యకు సైతం చెక్ పడినట్లేనన్నారు.ప్రజలకు నాణ్యమైన విద్యుత్ ను అందించే క్రమంలో కూటమి ప్రభుత్వం ఇటీవల బడ్జెట్ లో సైతం పెద్ద ఎత్తున విద్యుత్ రంగానికి కేటాయిపులు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.ఇక ఇదే క్రమంలో సోలార్ వినియోగం పైన ప్రజలు దృష్టి సారించాలని ఎమ్మెల్యే కొండయ్య సూచించారు. 2 kW నుంచి 3 kW సామర్థ్యం గల సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటే కేంద్ర ప్రభుత్వం రూ. 60,000 నుంచి రూ. 78,000 వరకు సబ్సిడీ ఇస్తుందన్నారు.సోలార్ ప్యానెల్స్ ద్వారా మన అవసరాలకన్నా ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి అయితే,ఆ విద్యుత్ ను ప్రభుత్వానికి అమ్ముకోవచ్చన్నారు.కార్యక్రమంలో జిల్లా విద్యుత్ శాఖ సూపర్నెంట్ ఇంజనీర్ ఆంజనేయులు, చీరాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జాన్ తామస్,చీరాల డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హరిప్రసాద్ చీరాల మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
 
#Narendra
Search
Categories
Read More
SURAKSHA
Justice in Action: The Inspiring Journey of IPS Nilambari Vijay Jagdale
Breaking Barriers: How IGP Nilambari Jagdale Redefined Police Leadership "A uniform is not...
By Kalaga Sailaja 2026-07-22 11:08:40 0 235
Andhra Pradesh
ఘోర రోడ్డు ప్రమాదం ఒకరు మృతి
భద్రాచలం నుడి ఛత్తీస్గఢ్ వెళ్ళే జాతీయ రహదారి NH30 పై శనివారం రాత్రి 1గంట సమయంలో ఘోర రోడ్డు...
By Shyamala Yadagiri 2026-03-29 04:47:17 0 431
Andhra Pradesh
అలాంటప్పుడు ఆ అమ్మాయిని ఎందుకు ప్రేమించావ్‌రా.. పెళ్లి చేసుకున్న 3 నెలలకే..
విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలోని ఎరుకొండలో విషాద ఘటన చోటుచేసుకుంది. అదే గ్రామానికి చెందిన...
By SivaNagendra Annapareddy 2025-12-25 16:11:12 2 2K
Fashion & Beauty
"Agentic AI" Transforms the Retail Experience
Online shopping is shifting from passive scrolling to highly personalized curation with the rise...
By Dunna Jessicaruth 2026-05-19 07:36:39 0 107
Telangana
బండి భగీరధ్ కేసులో సిట్ వేయడమంటేనే కేసును నీరుగార్చడమే! ...మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
రేవంత్ రెడ్డి గారు.. గతంలో మీరు వేసిన 10 సిట్ రిపోర్టులు ఏమయ్యాయో ముందు చెప్పండి. క్లియర్ కట్...
By Ponnala Srinivasrao 2026-05-12 01:14:07 0 131
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com