నిరంతరాయమైన విద్యుత్ ను అందిచడమై లక్ష్యం విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే MMకొండయ్య.
Posted 2026-02-18 15:57:06
0
223
చీరాల: విద్యుత్ రంగానికి కూటమి సర్కార్ పెద్ద పీట.
నూతనంగా నిర్మించనున్న విద్యుత్ సబ్‌స్టేషన్ తో చీరాల పట్టణంతో పాటుగా పరిసర ప్రాంతాలలోని ప్రజలకు నిరంతరాయమైన,నాణ్యమైన విద్యుత్ ను అందించేందుకు గాను ఎంతగానోదోహదపడుతుందని చీరాల ఎమ్మెల్యే MMకొండయ్య అన్నారు.బుధవారం చీరాల మున్సిపల్ పరిదిలోని జయంతిపేటలో 4.5 కోట్లతో నూతనంగా నిర్మించనున్న 33/11 KV సబ్‌స్టేషన్ నిర్మాణ పనులకు బుధవారం చీరాల ఎమ్మెల్యే MMకొండయ్య భూమి పూజ చేశారు.ఈసందర్భంగా అయన మాట్లాడుతూ ఈ సబ్‌స్టేషన్ నిర్మాణంతో చీరాల పట్టణంలోని స్థానికంగా ఉన్న జయంతిపేటను మొదలుకొని,హరిప్రసాద్ నగర్ ,విఠల్ నగర్,గాంధీ నగర్ ,జై ప్రకాష్ నగర్,దండుబాట, వైకుంఠపురం,స్వర్ణ గేటు తదితర ప్రాంతాల పరిధిలోని విద్యుత్ వినియేగదారులకు విద్యుత్ కోతలు , లో ఓల్టేజ్ సమస్యకు శాశ్వితంగా పరిష్కారం లభించినట్లేనన్నారు.ఇప్పటి వరకు ఈప్రాంత ప్రజలు ఓవర్ లోడ్ కారణంగా విద్యుత్ కోతలతో ఇబ్బందిపడిన క్రమంలో,,విద్యుత్ సబ్‌స్టేషన్‌కు అందుబాటులోకి వేస్తె ఓవర్ లోడ్ సమస్యకు సైతం చెక్ పడినట్లేనన్నారు.ప్రజలకు నాణ్యమైన విద్యుత్ ను అందించే క్రమంలో కూటమి ప్రభుత్వం ఇటీవల బడ్జెట్ లో సైతం పెద్ద ఎత్తున విద్యుత్ రంగానికి కేటాయిపులు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.ఇక ఇదే క్రమంలో సోలార్ వినియోగం పైన ప్రజలు దృష్టి సారించాలని ఎమ్మెల్యే కొండయ్య సూచించారు. 2 kW నుంచి 3 kW సామర్థ్యం గల సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటే కేంద్ర ప్రభుత్వం రూ. 60,000 నుంచి రూ. 78,000 వరకు సబ్సిడీ ఇస్తుందన్నారు.సోలార్ ప్యానెల్స్ ద్వారా మన అవసరాలకన్నా ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి అయితే,ఆ విద్యుత్ ను ప్రభుత్వానికి అమ్ముకోవచ్చన్నారు.కార్యక్రమంలో జిల్లా విద్యుత్ శాఖ సూపర్నెంట్ ఇంజనీర్ ఆంజనేయులు, చీరాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జాన్ తామస్,చీరాల డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హరిప్రసాద్ చీరాల మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
#Narendra
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఇండ్ల రిజిస్ట్రేషన్ లలో గ్రామ సెక్రెటరీ చేతివాటం.... 🔥🔥🔥
నిజామాబాదు డిస్టిక్. మొగుపాల్ మండలం. కులస్ఫూర్ గ్రామ పంచాయతిలో ఇంటి రిజిస్ట్రేషన్ లలో అవకాతవకలు....
అమరజీవి పొట్టి శ్రీరాములు కి ఘన నివాళులర్పించిన మాజీ మంత్రి వెల్లంపల్లి ఎమ్మెల్సీ రుహుళ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి
విజయవాడ
15-12-2025
ప్రచురణార్ధం
అమరజీవి పొట్టిశ్రీరాములుకి ఘన నివాళులర్పించిన...
ప్రమాదం అంచున ప్రయాణం
మనూర్ మండలం
మనూర్ నుంచి మైకిడ్ వెళ్లే దారికి కొద్దీ దూరంలో రహదారి ప్రమాదకరంగా మారింది.
ఒక...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అటువంటి ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం.....
భారత్ అవాజ్ న్యూస్:- వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామపంచాయతీ పరిధిలో లోనే...
Punjab’s Olympic Aspirations: New High-Performance Center
The "Sher-e-Punjab" High-Performance Sports Centre was inaugurated in Mohali this morning. This...