తిరునాళ్ళలో తప్పిపోయిన ముగ్గురు చిన్నారులను క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించిన జిల్లా పోలీస్ అధికారులు.
Posted 2026-02-17 16:05:42
0
242
బాపట్ల జిల్లా: బాపట్ల ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ అధికారులు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. చీరాల డీఎస్పీ ఎమ్.డి.మోయిన్ ఆధ్వర్యంలో చిన్నగంజాం పోలీస్ స్టేషన్ పరిధిలో శివరాత్రి సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా స్థానిక పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారు. తిరునాళ్లకు విచ్చేసిన భక్తులలో వేరువేరు ఘటనలలో తప్పిపోయిన చిన్నపిల్లలను చీరాల డిఎస్పీ గారు క్షేమంగా వారి తల్లిదండ్రులకు అప్పగించారు. శివరాత్రి నాడు భట్టిప్రోలు మండలం సూర్యపల్లి గ్రామంలోని శ్రీ కేదారేశ్వర వాయులింగ దేవస్థానం వద్ద భట్టిప్రోలు ఎస్ఐ శివయ్య గారు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన భద్రత ఏర్పాట్లు చేశారు. తిరునాళ్లకు విచ్చేసిన భక్తులలో ముగ్గురు చిన్నపిల్లలు వేరువేరుగా సంఘటనలలో తప్పుపోయినారు. సమాచారం తెలుసుకున్న భట్టిప్రోలు ఎస్ఐ వేగంగా స్పందించి కొన్ని నిమిషాల వ్యవధిలోనే వారిని గుర్తించి.. క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు.
#Narendra
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
బీజేపీ సింగరేణి భరోసా కార్యక్రమన్ని అడ్డుకున్న పోలీసులు
మంచిర్యాల జిల్లా : సింగరేణి లో జరుగుతున్న అవకతవకల పై సింగరేణి భరోసా కార్యక్రమంలో భాగంగా...
RSF Index Warns of Overt Political Bias in Indian Media
The 2026 Reporters Without Borders (RSF) index has issued a stark warning regarding the state...
పోలవరం జిల్లాలో: చేపల వేటకు వెళ్లి నలుగురు ప్రమాద వశత్తు గోదావరిలో గల్లంతు!
పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగూడెం సమీపం లోని గోదావరి నదిలో శనివారం జరిగిన విషాద ఘటనలో ఐదుగురు...
Guardians of Peace: The Inspiring Journey of Shri Akshay Sachdeva, IPS
From Engineering Excellence to the Helm of Law and Order: How a Gold Medalist Structural Expert...
"మీ బండి కూడా ఉందా..? 446 వాహనాల జాబితా విడుదల చేసిన పోలీసులు”|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో...