Actor pratyusha case supreme Court judgememt

0
219

నటి ప్రత్యూష మృతి కేసులో తుది తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు

 

టాలీవుడ్ సినీ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పును వెలువరించింది. రెండు దశాబ్దాలకు పైగా నడుస్తున్న ఈ కేసులో జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం కీలక తీర్పును వెలువరించింది. సిద్ధార్థరెడ్డి పిటిషన్‌ను కొట్టివేస్తూ, నాలుగు వారాల్లో లొంగిపోవాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.సినీ నటి ప్రత్యూష 2002 ఫిబ్రవరి 23న మృతి చెందారు. ఈ కేసులో నిందితుడు సిద్ధార్థరెడ్డికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పును సిద్ధార్థరెడ్డి హైకోర్టులో సవాల్ చేయడంతో జైలు శిక్షను రెండేళ్లకు కుదించింది. హైకోర్టు తీర్పును ప్రత్యూష తల్లి సరోజిని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. మరోవైపు, శిక్షను రద్దు చేయాలని సిద్ధార్థరెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.ఈ కేసులో సుప్రీంకోర్టు ఇరువైపుల వాదనలు విన్నది. గత ఏడాది నవంబర్‌లో విచారణ పూర్తి చేసిన సుప్రీంకోర్టు, తీర్పును రిజర్వ్ చేసింది. ఈ కేసుకు సంబంధించి 24 ఏళ్ల తర్వాత ఈరోజు తీర్పును వెలువరిస్తూ, సిద్ధార్థరెడ్డిని లొంగిపోవాలని ఆదేశించింది. 2002లో తాను, ప్రత్యూష పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించామని, తాను ఆసుపత్రిలో చికిత్స పొందడంతో ప్రాణాలతో బయటపడ్డానని సిద్ధార్థరెడ్డి చెబుతున్నారు. తన కూతురు ఆత్మహత్యకు సిద్ధార్థరెడ్డి కారణమని సరోజిని ఆరోపించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లెలో రోడ్డు ప్రమాదం – ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు.
ఆటో రిపేర్ కోసం మదనపల్లెకు వచ్చిన ఆటో డ్రైవర్ వెంకటరమణ (60) శుక్రవారం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా...
By Pagadala Venkateswar 2026-04-03 12:52:33 0 191
Ladakh
Ladakh Boosts Employment and Entrepreneurship Growth
Description:Ladakh is advancing employment and entrepreneurship through initiatives that support...
By Fathima Safa 2026-07-01 10:16:02 0 131
Andhra Pradesh
కడిమెట్ల గ్రామంలో తాగునీటి కొరత
కడిమెట్ల గ్రామంలో ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి తాగునీటి సమస్యలలు    మా కాలనీలో ఉన్నటువంటి...
By Boya Dasthagiri 2026-03-23 12:57:25 0 309
Telangana
ఉపాధి కూలీలకు వసతులు కల్పించాలి....
ఉపాధి కూలీలకు వసతులు కల్పించాలి డీఆర్‌డీఓ నాగ పద్మజ... లక్ష్మీపురంలో ఊర చెరువు పూడికతీత...
By Gujile Ramu 2026-04-29 15:13:16 0 413
Uttar Pradesh
UP Goes Hybrid: New 2-Day Work-from-Home Policy Unveiled
In a landmark move to foster energy conservation and modern work culture, CM Yogi Adityanath has...
By Dunna Jessicaruth 2026-05-14 08:49:41 0 141
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com