రాణి గారి తోట వాటర్ ట్యాంకులు త్వరలో ప్రజలకు అందజేయాలని విజ్ఞప్తి

0
237

*విజ‌య‌వాడ‌ నగరపాలక సంస్థ*

*17-02-2026*

 

 

 

*రాణి గారి తోట లోగల వాటర్ ట్యాంక్ నీరు ను ప్రజలకు త్వరలో అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోండి*

 

 

*విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు*

 

 

 

రాణి గారి తోట లోగల నిర్మిస్తున్న వాటర్ ట్యాంక్ ను త్వరగా పూర్తిచేసి, అందుబాటులో తీసుకొచ్చేటట్టు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా రాణి గారి తోట, కృష్ణలంక ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

 

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాణి గారి తోట లో నిర్మిస్తున్న 1000 కి.లీ . సామర్థ్యం గల రిజర్వాయర్ నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేసి, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ను ఏర్పాటు చేసి ప్రజలకు త్వరగా మంచినీటి సరఫరా ఆ ట్యాంకు ద్వారా అందుబాటులోకి రావాలని అధికారులను ఆదేశించారు. అమృత్ 2.0 పథకం కింద చేస్తున్న ఈ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సౌకర్యం కల్పించాలని అన్నారు. కృష్ణలంక నేషనల్ హైవే లో గ్రీన్ బెల్ట్ ను పెంచాలని ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణ అందించేటట్టు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

 

 తదుపరి రాణి గారి తోటలో గల అన్న క్యాంటీను క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్కడికి వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పారిశుధ్య నిర్వహణ, త్రాగునీటి, వాడుకనీటి సరఫరా లో ఎటువంటి అంతరాయం లేకుండా చూసుకోవాలని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని ఏవైనా మరమ్మతులు ఉన్నచో వెంటనే వాటిని పూర్తి చేయాలని ఆదేశించారు.

 

 

ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ కే షమ్మీ, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె.అర్జునరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జి.సామ్రాజ్యం, అసిస్టెంట్ సిటీ ప్లానర్ మోహన్ బాబు, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి లో కారు ఢీకొని ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలు.
ఆదివారం మదనపల్లెలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మాలెపాడు గ్రామం, ఆవులపల్లికి చెందిన వెంకటేశ్,...
By Pagadala Venkateswar 2026-04-13 05:43:50 0 183
Telangana
శ్రీ చైతన్య పాఠశాల సుచిత్ర బ్రాంచ్ స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాం - గ్రీన్ ఇండియా మిషన్.
  కొంపల్లి జోన్ ,సుచిత్ర బ్రాంచ్ లో  స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాంలో భాగంగా గ్రీన్ ఇండియా...
By Sidhu Maroju 2025-07-10 09:25:29 0 1K
Andhra Pradesh
Chandrababu Naidu: విపక్షం లేకున్నా ఐదు కోట్ల ప్రజల కోసమే చర్చలు: సీఎం చంద్రబాబు.
15 రోజుల పాటు అసెంబ్లీలో చర్చలు జరిపినట్టు చంద్రబాబు వెల్లడి గత పాలకుల విధ్వంసం నుంచి ఏపీ...
By Pagadala Venkateswar 2026-03-06 09:36:48 0 197
Andhra Pradesh
ఏపీలో మళ్లీ కరోనా కలకలం... నలుగురి మృతి.
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి మళ్లీ కలకలం రేపుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కొత్తగా...
By Pagadala Venkateswar 2026-07-17 05:41:40 0 90
Andhra Pradesh
నూతన సంవత్సరం సందర్భంగా మద్యం విక్రయ సమయాల పొడిగింపుకు అనుమతి
నూతన సంవత్సరం సందర్భంగా మద్యం విక్రయ సమయాల పొడిగింపుకు అనుమతి అమరావతి, డిసెంబర్ 31: నూతన...
By Gadiyapudi Narendra 2025-12-30 10:53:45 0 265
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com