Chandrababu Naidu: చంద్రబాబుతో బిల్ గేట్స్ భేటీ.. సచివాలయంలో కీలక సమావేశం.

0
221

అమరావతిలో రాష్ట్ర సచివాలయానికి చేరుకున్న బిల్ గేట్స్ 

గేట్స్ బృందంతో సమావేశమైన సీఎం చంద్రబాబు, మంత్రులు

ఆర్టీజీఎస్‌ను సందర్శించనున్న బిల్ గేట్స్

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ బిల్ గేట్స్ భేటీ అయ్యారు. ఈరోజు ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న బిల్ గేట్స్..అక్కడి నుంచి నేరుగా అమరావతిలోని రాష్ట్ర సచివాలయానికి చేరుకున్నారు. సచివాలయం వద్ద సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ సహా పలువురు మంత్రులు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత వీరితో బిల్ గేట్స్ బృందం సమావేశమైంది. 

 

ఈ సందర్భంగా బిల్ గేట్స్ సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ (ఆర్టీజీఎస్) ను సందర్శించనున్నారు. ఆర్టీజీఎస్ విధానాలు, అమలు తీరుతో పాటు సాధిస్తున్న ఫలితాలను గేట్స్‌కు సీఎం చంద్రబాబు వివరించనున్నారు. అలాగే గేట్స్ ఫౌండేషన్ సహకారంతో రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయం రంగాల్లో అమలు చేస్తున్న పలు ప్రాజెక్టులను మరింత విస్తరించే అంశంపై కీలక చర్చలు జరగనున్నాయి. ముఖ్యంగా గేట్స్ ఫౌండేషన్ సహకారంతో కొనసాగుతున్న సంజీవని ప్రాజెక్టు గురించి సీఎం బిల్ గేట్స్‌కు ప్రత్యేకంగా వివరించనున్నట్లు సమాచారం.

 

Search
Categories
Read More
Andhra Pradesh
నరసింహారెడ్డి పోరాటం యువతకు స్ఫూర్తి: డీఆర్వో.
బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసిన తొలి వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం...
By Pagadala Venkateswar 2026-02-22 10:58:17 0 171
BMA
Coastal & Mining Scams: Eco-Reporters Facing Mafias
Investigative journalists covering illegal sand mining, deforestation, and coastal land grabs...
By JoinBMA 2026-08-21 04:47:52 0 192
Goa
Goa’s Path to ST Political Reservation: Active Talks for 2027
As Goa edges closer to the 2027 assembly elections, the long-standing demand for political...
By Lokeshwari Panthadi 2026-06-30 04:33:53 0 124
Andhra Pradesh
బహుద కాలువలోకి కారు దూసుకెళ్లి ఆరుగురికి గాయాలు.
అన్నమయ్య జిల్లాలో కారు అదుపుతప్పి బహుద కాలువలోకి దూసుకెళ్లడంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు...
By Pagadala Venkateswar 2026-06-19 04:40:39 0 105
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com