Chandrababu Naidu: లోకేశ్ పని లోకేశ్ చేస్తున్నాడు... నా పని నేను చేస్తున్నా: సీఎం చంద్రబాబు.

0
199

పార్టీ ఎమ్మెల్యేలు, నాయకుల పనితీరును సమగ్రంగా విశ్లేషిస్తున్నామన్న సీఎం చంద్రబాబు

 

లోపాలను సరిదిద్దుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరికలు

ఎమ్మెల్యేల పనితీరుపై మరింత కఠినంగా పర్యవేక్షణ కొనసాగుతుందని వెల్లడి

లోకేశ్ పని లోకేశ్ చేస్తున్నాడు.. నా పని నేను చేస్తున్నానంటూ టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో నిన్న నిర్వహించిన పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. 

 

పార్టీ ఎమ్మెల్యేలు, నాయకుల పనితీరును సమగ్రంగా విశ్లేషిస్తున్నామని, వారి పనిపై సర్వేలు నిర్వహించి వ్యక్తిగత నివేదికలను సీల్డ్ కవర్లలో అందజేస్తున్నామని వెల్లడించారు. ఈ నివేదికలు వారికి అద్దం పట్టినట్టుగా ఉంటాయని, లోపాలను సరిదిద్దుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. 

 

తొమ్మిది ముఖ్య అంశాలపై అంచనా వేసి నివేదికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. 1995 -96 మాదిరిగానే నిక్కచ్చిగా వ్యవహరిస్తానని పేర్కొన్న చంద్రబాబు .. సీల్డ్ కవర్లలో ఇచ్చే నివేదికల ద్వారా ఎమ్మెల్యేల బలాలు, బలహీనతలను స్పష్టంగా తెలియజేస్తున్నామని, మార్పు రాకపోతే నష్టం వాళ్లకేనని హెచ్చరించారు. ఇకపై ఎమ్మెల్యేల పనితీరుపై మరింత కఠినంగా పర్యవేక్షణ కొనసాగుతుందని పేర్కొన్నారు.

 

ఇదే సందర్భంగా లోకేశ్ తన బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తున్నారని కితాబు ఇచ్చారు. ముఖ్యంగా మంగళగిరి చేనేత చీరలకు అంతర్జాతీయ స్థాయిలో బ్రాండింగ్ కల్పించే ప్రయత్నాలను అభినందిస్తూ, ఇవి చేనేత రంగానికి మేలు చేస్తాయని పేర్కొన్నారు.

Search
Categories
Read More
Arunachal Pradesh
Arunachal Pradesh Expands Healthcare Access Across State
Arunachal Pradesh is strengthening its healthcare system with expanded services aimed at...
By Fathima Safa 2026-06-30 13:30:47 0 280
Mizoram
Mizoram Partners with Israel for Water Sustainability
The Mizoram government is taking proactive steps to transform the state's water security by...
By Lokeshwari Panthadi 2026-07-02 06:41:59 0 172
Andhra Pradesh
నిమ్మలపల్లి లో పాము కాటుకు మహిళ మృతి.
బుధవారం నిమ్మనపల్లె మండలంలోని తవళం గ్రామం ఎగువపల్లిలో అలివేలమ్మ(45) అనే మహిళ విషసర్పం కాటుకు గురై...
By Pagadala Venkateswar 2026-04-23 03:34:13 0 135
Andhra Pradesh
చిత్తూరు: 20 రోజులుగా తాగునీటి కష్టాలు, అధికారుల స్పందన శూన్యం
చిత్తూరు జిల్లా, పుంగనూరులో గత 20 రోజులుగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, అధికారులు స్పందించడం...
By Kothuru Murali 2026-06-26 16:26:07 0 136
Telangana
పోడు రైతుల సమస్యలపై జిల్లా ఇంచార్జ్ మంత్రి గారికి వినతిపత్రం అందించిన మాజీ డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ రావు గారు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు
🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్  ఆసిఫాబాద్: ఆసిఫాబాద్...
By Chunarkar Jagadeesh 2026-06-28 06:37:48 0 202
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com