పౌర సరఫరాల శాఖామంత్రి నాదెండ్ల మనోహర్

0
259

మీడియా పాయింట్...

 పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ..

 

ఆంధ్రప్రదేశ్ లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.3,32,205 కోట్లతో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మూడోసారి ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ గాడి తప్పిన వ్యవస్థను ఆర్థిక సంక్షోభం నుంచి పురోగతి వైపు, విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపించే విధంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

 

మూలధన వ్యయం విషయంలో గత సంవత్సరం రూ.39,498 కోట్ల నుండి 16 శాతం పెంచి రూ.53,917 కోట్లకు చేర్చడం ప్రభుత్వం అభివృద్ధి పట్ల చూపుతున్న నిబద్ధతకు నిదర్శనమని నాదెండ్ల మనోహర్ తెలిపారు.అదేవిధంగా పన్నుల ద్వారా రెవెన్యూ వసూళ్ళు గత సంవత్సరం రూ.98,025 కోట్ల నుండి రూ.1,25,846 కోట్లకు పెరగడం రాష్ట్ర ఆర్థిక పునరుద్ధరణలో జరుగుతున్న నిరంతర కృషికి రుజువని ఆయన అన్నారు.

 

సంక్షేమ రంగంలో సూపర్ సిక్స్ పథకాలకు ఎటువంటి రాజీ లేకుండా నిధులు కేటాయించడం, ముఖ్యంగా దీపం పథకం, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, తల్లికి వందనం, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు వంటి కార్యక్రమాలను నిరంతరాయంగా అమలు చేస్తున్న తీరు అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.

 

 ఖరీఫ్ సీజన్‌లో రూ.10,950 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేసి 24 గంటల్లోనే 93 శాతం మంది రైతులకు నేరుగా చెల్లింపులు జరపడం భారత దేశంలో ఆంధ్రప్రదేశ్‌ను ఆదర్శవంతంగా నిలిపిందని ఆయన వివరించారు.

 

అమరావతి రాజధాని నిర్మాణానికి రూ.57,000 కోట్లతో 98 ప్రాజెక్టులు వేగంగా సాగుతున్నాయని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో 60 శాతం పురోగతి సాధించి గోదావరి పుష్కరాల నాటికి జాతికి అంకితం చేయనున్నారని నాదెండ్ల మనోహర్ తెలిపారు.

 

 నీతి ఆయోగ్ సహకారంతో మూడు ఎకనామిక్ గ్రోత్ కారిడార్లు ఏర్పాటు చేయడం, రాయలసీమలో దేశంలోనే తొలిసారి హార్టికల్చర్ హబ్ స్థాపించడం రాష్ట్ర సమగ్రాభివృద్ధికి మిలుపైన అడుగులని ఆయన అన్నారు.

 

స్వర్ణాంధ్ర 2047 విజన్ సాకారానికి దోహదపడే ప్రత్యేకమైన సావరిన్ వెల్త్ ఫండ్‌ని రూ.100 కోట్లతో ప్రారంభించడం భారతదేశంలో ఇదే తొలిసారని, ఇది పారిశ్రామికవేత్తలు మరియు పెట్టుబడిదారులకు విశ్వాసం కల్పించే చారిత్రాత్మక నిర్ణయమని ఆయన ప్రశంసించారు. డేటా లేక్ ఏర్పాటు ద్వారా 36 శాఖల నుండి 900 సేవలను మీసేవ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందించడం స్పీడ్ ఆఫ్ గవర్నెన్స్ నినాదాన్ని ఆచరణలో చూపిస్తోందని అన్నారు.

 

వ్యవసాయ రంగానికి రూ.53,752 కోట్లు కేటాయించి ఉద్యానవనాలు, ఆక్వాకల్చర్, ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ రంగాలలో కొత్త ఆలోచనలతో మార్పు తీసుకొస్తున్న వ్యవసాయ మంత్రి అచ్చెన్న నాయుడు గారిని, పంచాయతీరాజ్ శాఖకు రూ.22,942 కోట్లు సాధించి గ్రామసభలు మరియు ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తున్న ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, పెట్టుబడుల ఆకర్షణలో అద్భుతాలు సృష్టిస్తున్న మంత్రి నారా లోకేష్ గారిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అనుభవం మరియు దూరదృష్టి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహకారం, భారతీయ జనతా పార్టీ అండదండలు మరియు కేంద్ర ప్రభుత్వ మద్దతుతో కూటమి ప్రభుత్వం గత ఐదేళ్ళలో విధ్వంసమైన రాష్ట్రాన్ని 19 నెలల్లోనే పురోగతి పథంలో పెట్టగలిగిందని నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. ఈ సమగ్ర మరియు పురోగమన బడ్జెట్‌ను ప్రవేశపెట్టినందుకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారికి జనసేన పార్టీ తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు.

 

--

Search
Categories
Read More
Andhra Pradesh
మైనర్ బాలిక కిడ్నాప్: జనసేన నేత సాయినాథ్ స్పందన.
అన్నమయ్య జిల్లా, మదనపల్లె సమీపంలోని తంబళ్లపల్లి మొలకలచెరువులో జరిగిన మైనర్ బాలిక కిడ్నాప్ ఘటనపై...
By Pagadala Venkateswar 2026-02-23 06:48:54 0 167
Assam
Assam Accelerates Industrial Growth and Investment
Assam continues to strengthen its industrial sector by attracting investments across...
By Fathima Safa 2026-07-03 14:39:04 0 235
Telangana
ఉమ్మడి జిల్లా కలెక్టర్ల సమావేశం లో పాల్గొన్న మంచిర్యాల ఎంమ్మెల్యే
ఖానాపూర్ నియోజకవర్గంలోని ఉట్నూర్ ITDA సమావేశ మందిరంలో ఉమ్మడి జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో ఏర్పాటు...
By Avunoori Mahesh 2026-07-20 14:54:16 0 251
Andhra Pradesh
పశు ఆరోగ్యం పై పాడి రైతులందరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ బి వేణుగోపాల్ తెలిపారు.
  బాపట్ల: మండలంలోని ఈతేరు గ్రామంలో శుక్రవారం ఉచిత పశు ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ...
By Gadiyapudi Narendra 2026-01-23 16:24:13 0 427
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com