మంత్రి నారా లోకేష్ ఆత్మీయ విందు

0
246

*ప్ర‌చురణార్థం* *14-02-2026*

 

మంత్రి నారా లోకేష్ ఆత్మీయ విందుకు ఎంపీ కేశినేని శివనాథ్ కుటుంబ స‌మేతంగా హాజరు

మంత్రి నివాసంలో సకుటుంబ సమేతంగా ప్ర‌జా ప్ర‌తినిధుల‌ ఆత్మీయ కలయిక

 

విజ‌య‌వాడ : గుంటూరు, విజయవాడ పార్లమెంటు పరిధిలోని ప్రజాప్రతినిధులతో ఐటీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ నిర్వహించిన ఆత్మీయ విందు సమావేశానికి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), స‌తీమ‌ణి కేశినేని జాన‌కి ల‌క్ష్మీ, కుమారుడు కేశినేని వెంక‌ట్ తో కలిసి హాజరయ్యారు. 

 

శనివారం మధ్యాహ్నం ఉండవల్లిలోని మంత్రి నారా లోకేష్ నివాసంలో నిర్వహించిన ఆత్మీయ విందు స‌మావేశం లో ఎంపీ కేశినేని శివనాథ్ కుటుంబసభ్యులతో పాల్గొని, మంత్రి లోకేష్‌తో పాటు ఇతర ప్రజాప్రతినిధులతో స్నేహపూర్వకంగా ముచ్చటించారు. మంత్రి నారా లోకేష్ ఎంపీ కేశినేని శివ‌నాథ్ స‌తీమ‌ణి జాన‌కి ల‌క్ష్మీ కి మంగ‌ళ‌గిరి చేనేత చీర బ‌హుక‌రించారు. అలాగే యువ‌నాయ‌కుడు కేశినేని వెంక‌ట్ తో ప్ర‌త్యేకంగా మాట్లాడి భవిష్య‌త్ ప్ర‌ణాళిక‌లు అడిగి తెలుసుకుని త‌న స‌హ‌కారం ఎప్పుడు వుంటుంద‌ని తెలిపారు.

 

రాజకీయాలకు అతీతంగా కుటుంబ సభ్యుల బాగోగులు, పిల్లల విద్య, క్రీడలపై చర్చలు సాగిన ఈ కార్యక్రమంలో, అందరూ ఒకేచోట భోజనం చేస్తూ ఆహ్లాదకరమైన వాతావరణంలో గడప‌టం, . త‌న‌ కుటుంబ సభ్యులతో కలిసి ఈ ఆత్మీయ విందులో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రజాప్రతినిధుల మధ్య స్నేహబంధాలను మరింత బలోపేతం చేస్తాయని తెలిపారు. మంత్రి లోకేష్ ప్ర‌జాప్ర‌తినిధుల కుటుంబాల‌తో ఆత్మీయ విందు స‌మావేశ కార్య‌క్ర‌మం చేప‌ట్టి ఏపీ రాజ‌కీయాల్లో నూత‌న ఒర‌వ‌డికి శ్రీకారం చుట్టార‌ని కొనియాడుతూ...మంత్రి నారా లోకేష్ లో ఒక రాజ‌నీతిజ్ఞుడు క‌నిపిస్తున్నాడ‌ని ప్ర‌శంసించారు.

Search
Categories
Read More
Telangana
సెప్టెంబర్‌లో "బతుకమ్మ" OTT సినిమా
రచయిత మరియు దర్శకుడు గా "బతుకమ్మ "టైటిల్ తో సినిమా త్వరలో చేయబోతున్నట్టు శ్రీను రావు పొన్నాల...
By Ponnala Srinivasrao 2026-04-05 03:11:51 0 310
Andhra Pradesh
టీటీడీలో కొలువులు... ఇంజనీరింగ్ పోస్టుల పరీక్షల షెడ్యూల్ విడుదల.
టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో ఉద్యోగాల భర్తీకి ప్రకటన మే 10, 11 తేదీలలో ఆన్‌లైన్ పద్ధతిలో...
By Pagadala Venkateswar 2026-04-25 05:02:15 0 126
Andhra Pradesh
వడ్డమానూరులో రైతులు ప్రజలు కోరినట్టు గ్రామసభ నిర్వహించాలి
*వడ్డమాను లోరైతులు, ప్రజలు కోరుతున్న విధంగా గ్రామసభ నిర్వహించాలి*   *వడ్డమాను రైతులు,...
By Rajini Kumari 2026-02-06 09:37:03 0 205
Andhra Pradesh
రామసముద్రం: బండరాయిని ఢీకొన్న బైక్ వ్యక్తికి గాయాలు.
రామసముద్రం - పుంగనూరు రహదారిలోని గాంధీనగర్ సమీపంలో సోమవారం సాయంత్రం ఒక బైక్ అదుపుతప్పి రహదారి...
By Pagadala Venkateswar 2026-02-17 05:23:47 0 201
Telangana
హైడ్రా కమిషనర్ మూడు గంటల్లోనే మాట మార్చారు: దాసోజు శ్రవణ్
రాఘవ కన్ స్ట్రక్షన్ క్రషర్లు కూల్చివేసినట్లు హైడ్రా ప్రకటించిందన్న బీఆర్ఎస్ నేత ‎తర్వాత మూడు...
By Ponnala Srinivasrao 2026-05-06 03:47:52 0 198
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com