Pawan Kalyan: తిరుమలలో అపచారాలకు నాటి పాలక మండలే కారణం: పవన్ కల్యాణ్.

0
152

 

 

Pawan Kalyan: తిరుమలలో అపచారాలకు నాటి పాలక మండలే కారణం: పవన్ కల్యాణ్

13-02-2026 Fri 14:40 | Andhra

Pawan Kalyan Says Previous Boards Responsible for Tirumala Lapses

రూ.10 కోట్లతో నిర్మించిన శ్రీకాళహస్తి గిరిప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన పవన్ కళ్యాణ్

పాలకమండళ్లు బాధ్యతగా ఉంటే ఆలయాల్లో అపచారాలు జరగవని వ్యాఖ్య

గత ప్రభుత్వ హయాంలో తిరుమలలో అనేక తప్పులు జరిగాయని విమర్శ

ఆలయాల అభివృద్ధి, ధర్మ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడి

రూ.40 కోట్లతో 22 ప్రధాన ఆలయాలకు రహదారుల నిర్మాణం చేపడుతున్నట్లు ప్రకటన

 

పాలక మండళ్లు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే దేవాలయాల్లో ఎలాంటి అపచారాలు, తప్పులు జరగవని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమల వంటి పుణ్యక్షేత్రంలోనే ఎన్నో అపచారాలు జరిగాయని, నాటి పాలక మండలి సరిగ్గా పనిచేసి ఉంటే ఆ పరిస్థితి వచ్చేది కాదని ఆయన విమర్శించారు. రాజకీయాలకు అతీతంగా ఆలయాలను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని సూచించారు.

 

శుక్రవారం సచివాలయం నుంచి శ్రీకాళహస్తి గిరిప్రదక్షిణ మార్గాన్ని పవన్ కల్యాణ్ వర్చువల్‌గా ప్రారంభించారు. సుమారు రూ.10 కోట్ల వ్యయంతో ఈ రహదారిని నిర్మించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, దేవాదాయ శాఖ కార్యదర్శి డాక్టర్ హరి జవహర్ లాల్ పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. "మన ఆలయాలు నాగరికతకు, సంస్కృతికి, వారసత్వానికి చిహ్నాలు. వాటి పరిరక్షణ మనందరి బాధ్యత. గత ప్రభుత్వం ఆలయాల పరిరక్షణను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నేతృత్వంలో ఆలయాల అభివృద్ధికి, ధర్మ పరిరక్షణకు పెద్దపీట వేస్తున్నాం," అని అన్నారు. అరుణాచలంలో మాదిరిగా శ్రీకాళహస్తిలోనూ గిరిప్రదక్షిణ చేయాలన్న కోరిక తనకు ఉందని, త్వరలోనే క్షేత్రాన్ని సందర్శించి స్వామి, అమ్మవార్లను దర్శించుకుంటానని తెలిపారు.

 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్గనిర్దేశకత్వంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలోని ఆలయాలను అభివృద్ధి చేస్తున్నట్లు పవన్ కల్యాణ్ వివరించారు. దేవాదాయ శాఖ సహకారంతో రూ.40 కోట్లకు పైగా నిధులతో 22 ప్రధాన దేవాలయాలకు రహదారి వసతి కల్పిస్తున్నామని తెలిపారు. కోటప్పకొండ, వాడపల్లి సహా అనేక క్షేత్రాల్లో రోడ్ల నిర్మాణం చేపట్టామని పేర్కొన్నారు. శివరాత్రి బ్రహ్మోత్సవాల అనంతరం గిరిప్రదక్షిణ మార్గంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపడతామని చెప్పారు. అరుణాచలం తరహాలో ప్రతి పౌర్ణమికీ శ్రీకాళహస్తిలో కైలాసగిరి ప్రదక్షిణ నిర్వహించాలని నూతన పాలక మండలికి ఆయన సూచించారు.

 

ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి నుంచి తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆలయ ఛైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్, ఆలయ ఈవో బాపిరెడ్డి, ఇతర అధికారులు వర్చువల్‌గా పాల్గొన్నారు.

Search
Categories
Read More
Uncategorized
Algae-Based Gastronomy Goes Mainstream
Foodies are shifting their focus this spring toward a surprising sustainable superfood: culinary...
By Dunna Jessicaruth 2026-05-19 06:40:43 0 74
Andhra Pradesh
మార్కాపురం పట్టణంలోని ఎన్ఎస్ నగర్ ఆర్టిసి బస్టాండ్ సమీప ప్రాంతాల్లో స్వచ్ఛ ఆంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమం
మార్కాపురం పట్టణంలోని ఎన్ఎస్ నగర్,ఆర్టీసీ బస్టాండ్ సమీప ప్రాంతాల్లో స్వచ్ఛ ఆంధ్ర- స్వర్ణాంధ్ర...
By Chennaiah Kati 2026-06-20 14:33:25 0 81
Prop News
PROPIINN : Your Trusted Path Through Real Estate
PROPIINNYour Dream Our Vision Times New Roman Your Real Estate Companion with a Mission. In...
By Bharat Aawaz 2025-06-26 05:53:13 0 2K
Telangana
పెద్దపల్లి : తాటి చెట్టు పై నుంచి పడి గీత కార్మికుడు మృతి...!
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కేంద్రానికి చెందిన గీత కార్మికులు బిక్షపతి కుమిరే గ్రామంలో...
By Sunka Santhosh 2026-06-18 19:18:19 0 133
Andhra Pradesh
అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ఓఆర్ ఐదు జిల్లాలు 23 మండలాలు 121 గ్రామాల గుండా వెళ్లానున్నది.
అమరావతి ఔటర్ రింగ్ రోడ్ (ORR) ఐదు జిల్లాల్లోని 23 మండలాలు, 121 గ్రామాల గుండా వెళ్లనుంది. జిల్లాల...
By KOTESWARARAO KVSR 2025-12-23 03:14:54 0 317
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com