Chandrababu Naidu: శివరాత్రి నేపథ్యంలో... ఏపీలోని శైవక్షేత్రాలపై సీఎం చంద్రబాబు సమీక్ష.

0
188

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్న సీఎం చంద్రబాబు

దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, హోం మంత్రి అనిత ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఏర్పాట్లను పర్యవేక్షించాలని సూచన

దీక్షలు, మాలధారణలతో ఎంతో కష్టపడి ఆలయానికి వచ్చే భక్తులను ఎవ్వరూ అగౌరవంగా చూడకూడదని స్పష్టీకరణ

 

శివరాత్రి సందర్భంగా ఏపీలోని శ్రీశైలం సహా వివిధ శివాలయాల్లో భక్తుల రద్దీ, వసతుల ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానంలో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, తీసుకుంటున్న చర్యలపై మంత్రులు, ప్రధాన కార్యదర్శి, డీజీపీతో పాటు ఇతర ఉన్నతాధికారులతో నిన్న సీఎం ఢిల్లీ నుంచే సమీక్ష చేశారు. జిల్లా యంత్రాంగం చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు. 

 

శివరాత్రి సమీపిస్తున్న నేపథ్యంలో శ్రీశైలంలో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్న సీఎం.. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, హోం మంత్రి అనిత ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఏర్పాట్లను పర్యవేక్షించాలని సూచించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి త్వరితగతిన దర్శనం పూర్తయ్యేలా, అవసరమైన వసతి సదుపాయాలు అందేలా కార్యాచరణ అమలు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. 

 

దీక్షలు, మాలధారణలతో ఎంతో కష్టపడి ఆలయానికి వచ్చే భక్తులను ఎవ్వరూ అగౌరవంగా చూడకూడదని స్పష్టం చేశారు. పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని తెలిపారు. శివరాత్రి వంటి పర్వదినాల్లో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసేలా ఇప్పటి నుంచే పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌కు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు.

 

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు టిడిపి కార్యకర్తలకు 10 లక్షలు ప్రమాద బీమా పంపిణీ చేసిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
రామాపురం మండలం లో ఇటీవల ప్రమాదంలో మృతి చెందిన టిడిపి కార్యకర్తలకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్...
By Benguluri Madhubabu 2026-03-14 10:47:41 0 343
Telangana
Yello అలర్ట్ వాతావరణ కేంద్రం ఇచ్చింది...
YELLOW ALERT: రెండు రోజులు వర్షాలు... భారత్ అవాజ్ న్యూస్: మే 10 రోజున... TG: రాష్ట్రంలో ఎండలు,...
By Gujile Ramu 2026-05-10 09:19:05 0 161
SURAKSHA
Architect of Progress: The Legacy of Shri Anil Mukim
Visionary Governance, Administrative Acumen, and Decades of Unwavering Service to Gujarat and...
By Kalaga Sailaja 2026-07-28 12:57:45 0 233
Andhra Pradesh
దొంగ అనే నింద తట్టుకోలేక మహిళ సూసైడ్
దొంగ అనే నింద తట్టుకోలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్నారు. SI మధుసూదన్ వివరాలు.. సంతకవిటి (M)...
By Boiena Rajesh 2026-06-17 06:36:49 0 188
Andhra Pradesh
సింగిరిగుంటలో వైభవంగా శ్రీ విజయ వినాయకస్వామి కళ్యాణోత్సవం
చిత్తూరు జిల్లా పుంగనూరు సమీపంలోని చౌడేపల్లి మండలం సింగిరిగుంటలో వెలసిన శ్రీ విజయ వినాయకస్వామి...
By Kothuru Murali 2026-05-09 15:02:41 0 161
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com