ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి మంత్రి తో చంద్రబాబు నాయుడు భేటీ

0
207

*ఢిల్లీ:*

 

*ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ*

 

• ఆంధ్రప్రదేశ్‌‌లోని వివిధ సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు, ఆర్థిక సాయంపై విజ్ఞప్తి

• రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల భవిష్యత్, తాగునీటి భద్రతకు ఇవి ఎంతో ముఖ్యమని వివరించిన సీఎం

• వివిధ ప్రాజెక్టులకు కేంద్ర సాయంపై పెండింగ్‌లో ఉన్న అంశాలతో పాటు, అంతర్రాష్ట్ర నీటి వివాదాల పరిష్కారంపైనా సవివరంగా చర్చించిన ముఖ్యమంత్రి

 

*భేటీలో ముఖ్యమంత్రి ప్రస్తావించిన అంశాలు :*

 

• పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి స్టాప్ వర్క్ ఆర్డర్ శాశ్వతంగా ఎత్తివేసేలా నిర్ణయం తీసుకోవాలి

• ఈ ఆర్డర్‌ కారణంగా ప్రాజెక్టు అమలులో అవరోధాలు ఏర్పడుతున్నాయి

• పోలవరం కుడి, ఎడమ ప్రధాన కాలువల సామర్థ్యం పెంపు కారణంగా పెరిగిన వ్యయాన్ని రీయింబర్స్‌మెంట్ చేయాలి

• పోలవరం ప్రాజెక్టు ఫేజ్–IIకి ఆర్థిక సహాయం అందించాలి... ఫేజ్–IIలో భూసేకరణ, పునరావాసం, రక్షణ కట్టలు వంటి పనులు చేపట్టాల్సి ఉంది

• వీటికి అదనంగా సుమారు రూ.32,000 కోట్ల నిధులు అవసరం 

• గోదావరి వరద జలాలను వర్షాభావ ప్రాంతాలకు తరలించే లక్ష్యంతో పోలవరం–నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుకు ప్రతిపాదనలు... తాగునీరు, సాగునీరు, పరిశ్రమల అవసరాలు తీర్చే కీలక ప్రాజెక్టు

• జాతీయ నదుల అనుసంధాన విధానంలో భాగంగా ఈ ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేసి, సాంకేతిక–ఆర్థిక సాయం ఇవ్వాలని విజ్ఞప్తి 

• ఆంధ్రప్రదేశ్-ఒడిశా మధ్య వంశధార నీటి వివాదాన్ని పరిష్కరించాలి 

• వంశధార నీటి వివాద ట్రిబ్యునల్ (వీడబ్ల్యుడీటీ) తుది నివేదిక గెజెట్‌లో ప్రచురించాలి

• ట్రిబ్యునల్ నివేదికను వెంటనే గెజెట్‌లో ప్రచురించి, వంశధారపై నిర్మించ తలపెట్టిన నేరడి బ్యారేజ్ నిర్మాణానికి మార్గం సుగమం చేయాలి

• గోదావరి జలాల పంపకంపై ఏపీ-తెలంగాణ మధ్య వివాదం కొనసాగుతోంది

• నదీ జలాల పంపకం కోసం గోదావరి నీటి వివాదాల ట్రిబ్యునల్‌ను తక్షణమే ఏర్పాటు చేయాలి

• ఎగువ కృష్ణాపై ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపునకు కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన చర్యలపై అభ్యంతరం

• ఆల్మట్టి డ్యామ్ ఎత్తును పెంచడం వల్ల ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే దిగువ ప్రవాహ జలాలపై తీవ్ర ప్రభావం ఉంటుంది.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరులో కరపత్రాలు విడుదల చేసిన ఏఐఎస్ఎఫ్
అన్నమయ్య జిల్లా, పుంగునూరు పట్టణంలో బసరాజ పాఠశాల వద్ద ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి విద్య,...
By Kothuru Murali 2026-05-24 17:27:53 0 118
Andhra Pradesh
గుంటూరు పశ్చిమ నియోజకవర్గములో ఉన్న పాఠశాలల సమస్యల పరిష్కారానికి ముందడుగు – ఎమ్మెల్యే గళ్ళా మాధవి.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి తన కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని ఎయిడెడ్,...
By John Baji 2026-01-21 11:15:32 0 264
Andhra Pradesh
అద్భుతంగా ఉంది.. ఏసీఏ స్టేడియంపై రామ్ చరణ్ ప్రశంసల వర్షం.
స్టేడియం అంతర్జాతీయ ప్రమాణాలతో ఉందని చరణ్ ప్రశంస ఆంధ్ర ప్రీమియర్ లీగ్ కీలక మ్యాచ్ సందర్భంగా ఈ...
By Pagadala Venkateswar 2026-06-25 06:20:30 0 99
Andhra Pradesh
అన్నా క్యాంటీన్ మనందరిది… పరిశుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత
అన్నా క్యాంటీన్ మనందరిది… పరిశుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత! దర్శి పట్టణం, కురిచేడు...
By Chennaiah Kati 2026-07-14 15:06:31 0 106
Andhra Pradesh
అక్రమ మద్యం, గంజాయిపై ఉక్కుపాదం: మంత్రి కొల్లు రవీంద్ర.
మదనపల్లె కలెక్టరేట్‌లో గురువారం జరిగిన సమీక్షలో రాష్ట్ర గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు...
By Pagadala Venkateswar 2026-06-12 04:24:44 0 113
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com