మైనంపల్లి కృషితో అభివృద్ధికి మహర్ధశ :₹4.5 కోట్లతో హై టెన్షన్ రోడ్డుపనులకు శ్రీకారం |

0
283

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మచ్చ బొల్లారం డివిజన్ 133 పరిధిలోని హై టెన్షన్ రోడ్డు ప్రాంత ప్రజల దశాబ్దాల కల నెరవేరింది. సుమారు 4.5 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సిసి రోడ్డు అభివృద్ధి పనులను నేడు ఘనంగా ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మైనంపల్లి హనుమంతరావు ప్రత్యేక కృషి, పట్టుదలతో.. జిహెచ్ఎంసి (GHMC) నుండి ఈ నిధులు మంజూరయ్యాయి 

 

విబిఆర్ ఫంక్షన్ హాల్ నుండి, ఎస్. ఎన్. రెడ్డి కాలనీ వరకు అత్యంత దారుణంగా దెబ్బతిన్న ఈ రోడ్డు మార్గం.. అల్వాల్ హిల్స్, సిటిజెన్ కాలనీ, మంజీర కాలనీ, హెచ్ఎంటి కాలనీ, విబిఆర్ కాలనీ, ప్రెసిడెన్సీ కాలనీ, పంచశీల ఎంక్లేవ్, ఇస్.ఎన్ రెడ్డి కాలనీ, మంగాపురం కాలనీ సహా.. పదుల సంఖ్యలో ఉన్న కాలనీలకు ప్రధాన అనుసంధాన రహదారి. నిత్యం వేలాది మంది ప్రయాణికులు, ఈ రోడ్డు ద్వారా జాతీయ రహదారికి చేరుకుంటారు. గత కొంతకాలంగా ఈ రహదారి అధ్వానంగా తయారై ప్రమాదాలకు నిలయంగా మారడంతో, స్థానిక కార్పొరేటర్, కాంగ్రెస్ బృందం ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.  

 

ఈ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్, మరియు ప్రముఖ నేతలు చంద్రశేఖర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, నర్సింగ్ రావు, అలాగే సీనియర్ నాయకులు అశోక్ రెడ్డి, శ్రీశైలం యాదవ్, లడ్డు రెడ్డి, సహదేవ్, సుభాష్ గౌడ్, విష్ణు, తదితరులు పాల్గొని పనుల నాణ్యత విషయంలో రాజీ పడకూడదని సూచించారు.

 

ఈ పనులు పూర్తయితే ట్రాఫిక్ కష్టాలు తీరడమే కాకుండా, జాతీయ రహదారికి వెళ్లే ప్రయాణికులకు రక్షణ లభిస్తుందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తూ.. నిధుల మంజూరుకు కృషిచేసిన మైనంపల్లి టీమ్ కు కృతజ్ఞతలు తెలిపారు.

 

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Telangana
శామీర్‌పేట ప్రెస్ మీట్‌లో ఈటల రాజేందర్ ఘాటు వ్యాఖ్యలు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ శామీర్‌పేటలో నిర్వహించిన...
By Sidhu Maroju 2026-04-05 08:26:18 0 281
Andhra Pradesh
మదనపల్లి: కరెంట్ షాక్‌తో బాలుడికి తీవ్ర గాయాలు.
మదనపల్లెలోని అమ్మచెరువుమిట్టలో మంగళవారం విష్ణు (7) అనే బాలుడు కరెంట్ షాక్‌కు గురై తీవ్రంగా...
By Pagadala Venkateswar 2026-06-04 05:36:02 0 90
Telangana
Hyderabad Startup Ecosystem Emerges as India Innovation Hub
Hyderabad has rapidly evolved into one of India’s leading startup ecosystems, driven by...
By Fathima Safa 2026-06-29 11:58:37 0 206
Andhra Pradesh
రాష్ట్ర కార్యాలయం చైర్మన్ గారికి వినతి పత్రం
రాష్ట్రంలోని మైనారిటీ వక్ఫ్ బోర్డు ఆస్తులను కూటమి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ...
By Rajini Kumari 2026-02-05 09:24:49 0 192
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com