Kollu Ravindra: బూతులు తిట్టి తన్నులు తిన్నవారిని జగన్ పరామర్శిస్తున్నారు: కొల్లు రవీంద్ర.

0
196

ఆటవిక రాజ్యం ఎలా ఉంటుందో జగన్ చూపించారన్న కొల్లు రవీంద్ర

జగన్ కు జంగిల్ రాజ్ అవార్డు ఇవ్వొచ్చని వ్యాఖ్య

జగన్ వల్లే ఆ పార్టీ 11కి పడిపోయిందని ఎద్దేవా

వైసీపీ అధినేత జగన్ పై ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర మరోసారి విమర్శలు గుప్పించారు. ఆటవిక రాజ్యం అంటే ఎలా ఉంటుందో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ చూపించారని ఆయన అన్నారు. జగన్ కు జంగిల్ రాజ్ అవార్డు ఇవ్వొచ్చని వ్యంగ్యంగా అన్నారు. వైసీపీ ఆటవిక రాజ్యంలో హింసాత్మక ఘటనలను జగన్ ప్రోత్సహించారని విమర్శించారు. దేవాలయాల మీద, పార్టీ కార్యాలయాల మీద దాడులు చేయించారని దుయ్యబట్టారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

 

బూతులు తిట్టి తన్నులు తిన్నవారిని పరామర్శించేందుకు జగన్ వెళుతున్నారని... పరామర్శలకు వెళుతూ విద్వేషాల వెనుక తానే ఉన్నానని జగన్ చాటుకుంటున్నారని కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు. తెనాలిలో బ్లేడ్ బ్యాచ్ ను పరామర్శించి... ఇలాంటి వారిని తాను ప్రోత్సహిస్తాననే విధంగా సందేశం ఇచ్చారని విమర్శించారు. జగన్ చేతల వల్లే ఆ పార్టీ 151 నుంచి 11కి పడిపోయిందని అన్నారు. ఇప్పటికైనా జగన్ బుద్ధి తెచ్చుకోవాలని... లేకపోతే అథఃపాతాళానికి పడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు.

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్: పంచాయతీరాజ్ దినోత్సవం
స్థానిక స్వపరిపాలన అమలులోకి వచ్చిన జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా పంచాయతీ రాజ్ శాఖ...
By Sadaq Sadaq 2026-04-24 12:09:06 0 182
SURAKSHA
Telangana Retired Police: Serving People Without Uniform
Retirement తర్వాత Telangana Police officers uniform లేకుండా ప్రజలకు సేవ చేస్తున్నారు. Slum areas...
By Kalaga Sailaja 2026-07-03 11:57:30 0 89
Telangana
అయ్యప్పల పాదయాత్ర- ప్రారంభించిన ఎమ్మెల్యే తలసాని
సికింద్రాబాద్ : అయ్యప్ప స్వామి మాలధారణ ఎన్నో జన్మల పుణ్యఫలం అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే...
By Sidhu Maroju 2025-10-17 11:05:03 0 313
Andhra Pradesh
లాల్ పురంలో అలరించిన మహిళల కోలాటం.
గుంటూరు రూరల్ మండలం లాల్పురం ఈరన్నపాలెం శ్రీ రమణ అభయాంజనేయ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదిన...
By John Baji 2025-12-31 01:22:48 0 205
Telangana
మూసీ ప్రక్షాళనలో కీలక అడుగు: 10 వేల ఇళ్లు, 3,200 ఎకరాల సేకరణకు గెజిట్ విడుదల!
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 'మూసీ రివర్‌ఫ్రంట్...
By Sidhu Maroju 2026-03-13 10:49:34 0 214
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com