Jagan Mohan Reddy: జగన్ గుంటూరు పర్యటన... పలువురు నేతలపై కేసులు నమోదు.

0
218

గుంటూరులో అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించిన జగన్

జగన్ పర్యటన సందర్భంగా ర్యాలీలు నిర్వహించిన పలువురు వైసీపీ నేతలు

ట్రాఫిక్ కు అంతరాయం కలిగించారంటూ కేసులు నమోదు

అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించేందుకు వైసీపీ అధినేత చేపట్టిన గుంటూరు పర్యటన సందర్భంగా వైసీపీ నేతలు హల్ చల్ చేశారు. పోలీసు యాక్ట్ 30ను పట్టించుకోకుండా అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహించారు. ఈ క్రమంలో పలువురు వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు.  

 

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... నల్లపాడులో పోతిన మహేశ్, బలసాని కిరణ్ కుమార్ పై కేసు నమోదయింది. మంగళగిరిలో నూనె ఉమామహేశ్వర్ రెడ్డి, తాడేపల్లిలో దొంతిరెడ్డి వేమారెడ్డిపై, నగరంపాలెం ప్రాంతంలో పానుగంటి చైతన్య, నూరి ఫాతిమా, గుంటూరు పట్టాభిపురంలో అంబటి మురళిపై కేసులు నమోదయ్యాయి. 

 

ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ... వైసీపీ నేతలు చేపట్టిన ర్యాలీల కారణంగా గుంటూరులోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడిందని తెలిపారు. పోలీసు నిబంధనలను ఉల్లంఘించడం, అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహించడం చట్ట విరుద్ధమని చెప్పారు. ఈ క్రమంలో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

Search
Categories
Read More
Telangana
పేద కుటుంబానికి అండగా మంచిర్యాల ఎంమ్మెల్యే : కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్ గ్రామానికి చెందిన కొలకని నాగ జ్యోతి గారికి ఆరోగ్య ఖర్చుల...
By Avunoori Mahesh 2026-04-07 15:54:30 0 398
SADHANA
మన భారత విద్యా వ్యవస్థ – ప్రపంచంలో మనం ఎందుకు వెనుకబడుతున్నాం?
"విద్య అంటే కుండ నింపడం కాదు, నిప్పును రాజేయడం." – విలియం బట్లర్ యీట్స్ విద్య ఒక దేశ...
By Bharat Aawaz 2025-07-25 07:41:33 0 1K
Telangana
'నరేంద్ర విజయం' పుస్తకావిష్కరణ.|
"11 ఏళ్ల మోదీ పాలనపై సంకలన గ్రంథం విడుదల" హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ గత 11 ఏళ్ల పాలనలో...
By Sidhu Maroju 2026-06-30 12:32:55 0 455
Andhra Pradesh
75 ఏళ్ల నిరీక్షణకు తెర.. శ్రీకాకుళం నుంచి తిరుపతికి రెగ్యులర్ రైలు, ఏప్రిల్ 13న ప్రారంభం,
జిల్లా ప్రజల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. జిల్లా చరిత్రలోనే 75 ఏళ్ల తర్వాత తొలిసారిగా శ్రీకాకుళం...
By Manda Ramkumar 2026-04-11 02:03:15 0 443
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com