'నరేంద్ర విజయం' పుస్తకావిష్కరణ.|

0
463

"11 ఏళ్ల మోదీ పాలనపై సంకలన గ్రంథం విడుదల"

హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ గత 11 ఏళ్ల పాలనలో అమలు చేసిన ప్రజాహిత కార్యక్రమాలు, అభివృద్ధి, సంక్షేమ విధానాలపై రూపొందించిన 'నరేంద్ర విజయం' పుస్తకాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మంగళవారం ఆవిష్కరించారు.

ఈ పుస్తకాన్ని బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యురాలు గీతా మూర్తి సంకలనం చేయగా, దేశంలోని వివిధ రంగాలకు చెందిన దాదాపు 25 మంది ప్రముఖుల వ్యాసాలను ఇందులో పొందుపరిచారు.

ఈ సందర్భంగా నితిన్ నబీన్ మాట్లాడుతూ, ఇలాంటి పుస్తకాల ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ అమలు చేసిన ప్రజాహిత కార్యక్రమాలు, దేశాభివృద్ధికి తీసుకున్న కీలక నిర్ణయాలు ప్రజలకు మరింత విస్తృతంగా చేరుతాయని అన్నారు. ఈ గ్రంథం రూపకల్పనలో గీతా మూర్తి చేసిన కృషిని ఆయన అభినందించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు, కేంద్ర మంత్రులు జి.కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

#Sidhumaroju

Search
Categories
Read More
Telangana
రామనగర్‌లో పర్యటించిన శాంతి శ్రీనివాస్ రెడ్డి.. సమస్యలపై ఆరా.,|
● మురుగునీటి కాలువల సమస్యకు పరిష్కారం చూపాలని సూచన ● దెబ్బతిన్న విద్యుత్ స్తంభం స్థానంలో కొత్తది...
By Sidhu Maroju 2026-08-12 11:01:22 0 136
Telangana
మొహరం పండుగ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే
మొహరం పండుగ ఏర్పాట్లపై డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం ఆరవ అంతస్తు సమావేశ హాల్లో రవాణా...
By Sidhu Maroju 2025-06-10 15:30:37 0 1K
Telangana
తెలంగాణలో చికెన్ షాపుల బంద్ : ఏప్రిల్ 1 నుండి నిరవధిక సమ్మెకు పిలుపు.|
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని చికెన్ వ్యాపారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు.  పౌల్ట్రీ...
By Sidhu Maroju 2026-03-25 08:27:21 0 191
Andhra Pradesh
నృసింహుని ప్రసాదల పంపిణీ శ్రీకారం
*నృసింహుని బ్రహ్మోత్సవాల ప్రసాదాల పంపిణీకి శ్రీకారం...*   ***************************...
By Rajini Kumari 2026-02-22 09:39:53 0 175
Telangana
సురక్షిత ప్రయాణమే లక్ష్యం : మల్కాజిగిరి పోలీసుల వినూత్న హెల్మెట్ బ్యాంక్ .|
హైదరాబాద్ :  ద్విచక్రవాహనదారుల ప్రాణాలను రక్షించాలనే లక్ష్యంతో మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్...
By Sidhu Maroju 2026-02-24 11:07:04 0 226
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com