అక్రమాలకు పాల్పడుతూ అధిక ఫీజులు వసూలు చేస్తున్న మోహన్ బాబు యూనివర్సిటీస్

0
205

*ప్రచురణార్థం*

 

భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ.

 

 

- *ఎస్ఎఫ్ఐ నాయకులు కిడ్నాప్ చేయించిన మంచు మోహన్ బాబు విష్ణువులను అరెస్టు చేసి క్రిమినల్ కేసులు పెట్టాలి.* 

- *విద్యార్థి సంఘ నాయకులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి*

 

- *అక్రమాలకు పాల్పడుతూ అధిక ఫీజులు వసూలు చేస్తున్న మోహన్ బాబు యూనివర్సిటీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి.*

 

విద్యార్థి యువజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అక్బర్, వినోద్ లను కిడ్నాప్ చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని, తిరుపతి మోహన్ బాబు యూనివర్సిటీ పై కఠిన చర్యలు తీసుకోవాలని విజయవాడ బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ నుంచి ఎస్ ఆర్ ఆర్ కళాశాల వరకు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. 

 

ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్ మాట్లాడుతూ తిరుపతిలో సినీ నటులు మోహన్ బాబు నిర్వహిస్తున్న మోహన్ బాబు యూనివర్సిటీలో అక్రమాలను అరికట్టాలని , ఫీజుల దోపిడీ ఆపాలని చెప్పి గత కొంతకాలంగా విద్యార్థి సంఘాల నాయకత్వంలో అనేక ఆందోళనలు జరుగుతున్నమని. ఇప్పటికే ఉన్నత విద్యాశాఖ 25 కోట్ల రూపాయల పెనాల్టీని విధించింది అయినా ఏ మాత్రం వెనక్కి తక్కుండా మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థులను వేధిస్తున్నారనీ అన్నారు. దీనిని నిరసిస్తూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు తిరుపతి కలెక్టరేట్ వద్ద శాంతియుత ఆందోళనకు పిలుపునిస్తే ఈ ఆందోళనలో పాల్గొనడానికి వెళ్తున్న ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అక్బర్ జిల్లా ఉపాధ్యక్షులు వినోద్ లను బౌన్సర్లు మోహన్ బాబు గారి ప్రైవేట్ గుండాలు వచ్చి మార్గమధ్యంలో అడ్డగించి దుర్మార్గంగా కిడ్నాప్ చేశారని, రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీల ఆగడాలకు అంత్య లేకుండా పోతుంది దీన్ని అదుపు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. బహిరంగంగా పట్టపగలు విద్యార్థి సంఘాల నాయకులను నిర్బంధించడం కిడ్నాప్ చేయడం అంటే ఇంతకంటే సిగ్గుచేటు విషయం ఇంకొకటి లేదని అన్నారు. మోహన్ బాబు యూనివర్సిటీలో అరాచకాలను అరికట్టాలని విద్యార్థులను ఫీజుల పేరుతో వేధించగానే ఆపాలని విద్యార్థి నాయకులు పోరాడుతుంటే ఈ సమస్యను పరిష్కరించకుండా ఈ విధంగా విద్యార్థు నాయకులు పైన గూండాగిరి చేయడాన్ని ఖండించారు. 

ఏఐఎస్ఏఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బాలరాజు మాట్లాడుతూ ఇప్పటికే విద్యాశాఖ రాష్ట్ర హైకోర్టు మొట్టికాయలు వేసిన మోహన్ బాబు యూనివర్సిటీ తీరు మారలేదని అన్నారు. మోహన్ బాబు తన ప్రైవేట్ సైన్యంతో విద్యార్థి సంఘాల నాయకులను నిర్బంధించాలని చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చొరవ తీసుకొని అన్నారు.

ఎన్.ఎస్.యు.ఐ రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రీనివాస్, పి.డి.ఎస్.యు రాష్ట్ర అధ్యక్షుడు కిరణ్ మాట్లాడుతూ అక్రమాలకు పాల్పడుతున్న యూనివర్సిటీ పైన చర్యలు తీసుకోవాలని ఇటువంటి క్రిమినల్ చర్యలకు పాల్పడిన మోహన్ బాబు యూనివర్సిటీని బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్ చేశారు. కిడ్నాప్ చేసిన వారందరిపై క్రిమినల్ కేసులు పెట్టాలి కిడ్నాప్ చేయించిన మంచి మోహన్ బాబు మంచు విష్ణువులను వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపాలి భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని దానిని తెలిపారు. 

 

ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు కృష్ణ, ఎస్ఎఫ్ఐ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు కుమార్ స్వామి, జిల్లా కార్యదర్శి వెంకటేశ్వరావు. ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి సాయికుమార్, ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు షణ్ముఖ,బాల వంశీ, జీవన్, వంశీ, ప్రతాప్, యశ్వంత్ విద్యార్థులు పాల్గొంటున్నారు 

Search
Categories
Read More
Telangana
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
By Pindikura Mahesh 2026-06-23 17:33:59 0 94
Telangana
వరి ధాన్య గోడన్స్ కోసం లక్సట్టిపేట శివారులో స్థలం పరిశీలించిన : మంచిర్యాల ఎంమ్మెల్యే
మంచిర్యాల నియోజకవర్గంలో రైతులు పండించే ధాన్యం కోసం లక్షెట్టిపేట్ మున్సిపాలిటీ శివారులో గోడంస్ ల...
By Avunoori Mahesh 2026-06-22 11:52:12 0 276
SURAKSHA
COVID Services: Delivering humanitarian aid during challenging times.
During the pandemic, our COVID-19 relief initiatives focused on delivering vital humanitarian aid...
By Kalaga Sailaja 2026-06-26 12:27:17 0 136
Andhra Pradesh
మాధురి స్కూల్ నందు ఎంతో ఘనంగా నిర్వహించిన నేషనల్ సైన్స్ డే వేడుకలు..
కాకినాడ జిల్లా శంఖవరం మండలం లోని కత్తిపూడి గ్రామంలోని మాధురి విద్యాలయంలో నేషనల్ సైన్స్ డే వేడుకలు...
By BABJI DADALA 2026-02-28 16:02:36 0 534
Andhra Pradesh
ఇంటిని కబ్జా చేశారని ఆవేదన.
తన ఇంట్లోకి చొరబడి, తనను బయటకు గెంటేసి ఇంటిని కబ్జా చేశాడని రిటైర్డ్ ఆర్టీసీ డ్రైవర్ కృష్ణమూర్తి...
By Pagadala Venkateswar 2026-03-17 03:17:18 0 197
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com