APPSC గ్రూప్–1 మరియు గ్రూప్–2 పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన పోలీస్ శాఖ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారు

0
239

APPSC గ్రూప్–1 మరియు గ్రూప్–2 పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన పోలీస్ శాఖ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారు

ప్రకాశం జిల్లా పోలీస్ శాఖలో ఎఆర్ హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న హుస్సేన్ గారి కుమార్తె రిజ్వానా APPSC గ్రూప్–1 ఫలితాలలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP)గా ఎంపిక కావడం గర్వకారణమని జిల్లా ఎస్పీ గారు తెలిపారు. అదేవిధంగా APPSC గ్రూప్–2 ఫలితాలలో స్పెషల్ పార్టీ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు కానిస్టేబుళ్లు కె.అశోక్ రెడ్డి డిప్యూటీ తహసీల్దార్‌గా, కె.వెంకటేశ్వర్లు మరియు కె. సూర్య తేజలు ఎక్సైజ్ సబ్–ఇన్‌స్పెక్టర్లుగా ఎంపిక కావడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ప్రకాశం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో జిల్లా ఎస్పీ గారు వారికి పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపి బహుమతి లు అందజేశారు

ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ, ఇదే పట్టుదల, క్రమశిక్షణ, కఠోర కృషితో భవిష్యత్తులో మరింత ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. దృఢ సంకల్పం, సరైన ప్రణాళిక, సమయ పాలనతో పాటు నిరంతర అధ్యయనం ద్వారా జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చన్నారు. APPSC గ్రూప్–1 మరియు గ్రూప్–2 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడంలో ముఖ్యపాత్ర పోషించిన తల్లిదండ్రులను జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు. పోలీస్ శాఖలో పనిచేస్తున్న సిబ్బంది తమ పిల్లలకు క్రమశిక్షణ, నైతిక విలువలు, సరైన మార్గదర్శనం అందిస్తూ చదువులో ప్రోత్సహించాలని సూచించారు. అలా చేస్తే వారు ఉన్నత స్థాయికి చేరుకోవడమే కాకుండా సమాజానికి ఆదర్శంగా నిలుస్తారని తెలిపారు.

ఈ కార్యక్రమం లోఎస్బీ సీఐ శ్రీనివాసరావు, ఆర్ఐ లు రమణారెడ్డి, సీతారామరెడ్డి మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Chandrababu Naidu: తిరుమలలో అత్యాధునిక ఫుడ్ ల్యాబ్ ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.
తిరుమల శ్రీవారి భక్తులకు అందించే ప్రసాదాలు, అన్నప్రసాదాల నాణ్యతను మరింత పెంచే దిశగా కీలక అడుగు...
By Pagadala Venkateswar 2026-03-21 11:30:13 0 226
Telangana
ప్రభుత్వా పణితీరుతో రియల్ ఎస్టేట్ డమాల్ బిల్డర్ బెజార్
హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని విధానాలు తెస్తున్నా ప్రజలు...
By Ponnala Srinivasrao 2026-02-28 13:15:09 0 477
SURAKSHA
Prashant Kumar, IPS: Champion of Uttar Pradesh Security
A distinguished 1990-batch IPS officer of the Uttar Pradesh Cadre, Shri Prashant Kumar serves as...
By Lokeshwari Panthadi 2026-07-17 13:41:19 0 209
Andhra Pradesh
నందవరం మండలం అలహరివి గ్రామంలో జండా ఆవిష్కరణ
రాష్ట్ర పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “మన ఊరు – మన జెండా” కార్యక్రమంలో...
By Boya Dasthagiri 2026-09-19 01:05:05 0 68
Andhra Pradesh
మదనపల్లె: ₹92 లక్షల సైబర్ కేసును ఛేదించిన పోలీసులు.
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ తెలిపిన వివరాల ప్రకారం, గత ఏడాది ఓ న్యాయవాదిని మోసం చేసి రూ.92 లక్షలు...
By Pagadala Venkateswar 2026-04-07 03:58:25 0 177
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com