S.F.S స్కూల్ రోడ్డు సమస్యపై 24 గంటల్లోనే పరిష్కారం తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

0
392
పర్చూరు: పర్చూరు మండలం నాగులపాలెం గ్రామంలో S.F.S స్కూల్ మెయిన్ రోడ్డును కొత్తగా నిర్మించిన హైవే కారణంగా వినియోగించకపోవడంతో, ఆ ప్రాంతం పూర్తిగా చెత్తకుప్పగా మారింది. రోడ్డు మీదే మల–మూత్ర విసర్జనలు జరుగుతుండటంతో ఆ ప్రాంతం దుర్గంధంతో డంపింగ్ యార్డ్‌ను తలపించే పరిస్థితి ఏర్పడింది.ఈ రహదారిని ప్రతిరోజూ S.F.S స్కూల్‌కు వెళ్లే చిన్నారులు నడక మార్గంగా వినియోగించాల్సి రావడంతో, చెత్త మురికి, దుర్వాసన కారణంగా పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యపై సంబంధిత అధికారులకు పలుమార్లు విన్నవించినప్పటికీ ఎటువంటి ఫలితం లేకపోవడంతో, చివరకు ఈ అంశాన్ని సోషల్ మీడియా ద్వారా గౌరవనీయులైన ఎమ్మెల్యే శ్రీ ఏలూరి సాంబశివరావు గారి దృష్టికి తీసుకువచ్చారు.సమస్య తీవ్రతను గమనించిన వెంటనే ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గారు తక్షణమే స్పందించి, అధికారులను ఆదేశించి యుద్ధ ప్రాతిపదికన శుభ్రత పనులు చేపట్టించారు. చెత్త తొలగింపు, పరిసరాల శుభ్రత, పిల్లలకు ఆటంకం కలగకుండా రోడ్డు సర్దుబాటు వంటి చర్యలు తీసుకుని 24 గంటల్లోనే సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించారు.
ప్రజల సమస్యలపై ఆలస్యం చేయకుండా వెంటనే స్పందిస్తూ, ముఖ్యంగా చిన్నారుల భద్రత, ఆరోగ్యాన్ని ప్రథమ ప్రాధాన్యంగా తీసుకునే ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గారి నాయకత్వానికి ఇది మరో నిదర్శనం.
ఈ సమస్యను సత్వరమే పరిష్కరించినందుకు పిల్లల తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యం మరియు గ్రామ ప్రజలు ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
 
#Narendra
Search
Categories
Read More
Andhra Pradesh
బాల కార్మిక వ్యవస్థ – బాల్య వివాహాల నిర్మూలనే లక్ష్యం
గుంటూరు, జనవరి 22: బాల కార్మిక వ్యవస్థ నివారణలో భాగంగా పాన్ ఇండియా ప్రచార కార్యక్రమాన్ని జనవరి 26...
By John Baji 2026-01-22 10:55:35 0 276
Telangana
ఘనంగా ప్రజా పాలన దినోత్సవం
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా:  అల్వాల్ సర్కిల్‌ వెంకటాపురం‌లో ప్రజా పాలన దినోత్సవంలో...
By Sidhu Maroju 2025-09-17 09:58:40 0 322
SURAKSHA
Monita Borgohain IAS: Leading Assam with Vision
A Distinguished Administrator Driving Good Governance, Administrative Reforms, and Public Service...
By Lokeshwari Panthadi 2026-08-03 09:08:30 0 238
Telangana
తెలంగాణ పులిబిడ్డ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నా అభిమాన నాయకుడు బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి పేదల పెన్నిధి శ్రీ ఎనుమల రేవంత్ అన్న గారికి 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు.
తెలంగాణ పులిబిడ్డ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నా అభిమాన నాయకుడు బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి పేదల...
By Vanmoj Suryamohan 2025-12-31 21:05:43 0 479
Telangana
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
By Pindikura Mahesh 2026-06-23 17:33:44 0 83
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com