సీపీఎస్ ఉద్యోగులకు ఓపీఎస్ అమలు చేయాలి: TSCPSEU

0
1K

 

​కొత్తగూడ, భారత్ అవాజ్, ఫిబ్రవరి 4: తెలంగాణ రాష్ట్రంలోని సీపీఎస్ ఉద్యోగులకు రావాల్సిన డీఏ వాయిదాల బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని తెలంగాణ స్టేట్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ యూనియన్ (TSCPSEU) రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ రవిచంద్ర డిమాండ్ చేశారు. సోమవారం కొత్తగూడ మండలంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగిన సంఘ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సిపిఎస్ ఉద్యోగులకు రావాల్సిన డీఏలను వాయిదాల రూపంలో చెల్లించడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సకాలంలో డీఏలను చెల్లించకుండా వాయిదాల సంఖ్యను పెంచుకుంటూ పోవడం వల్ల ప్రస్తుతం అవి 60కి చేరాయని తెలిపారు. ఈ వాయిదాల ద్వారా రావలసిన మొత్తం సుమారు రూ. 1200 కోట్లకు చేరడం వల్ల ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు.

​ప్రభుత్వం ప్రతి నెల విడుదల చేస్తున్న రూ. 700 కోట్ల నిధులలో భాగంగా ఈ నెల తప్పనిసరిగా సీపీఎస్ బకాయిల కోసం కేటాయించాలని కోరారు. అలాగే గత ఎన్నికల హామీ మేరకు ప్రభుత్వం వెంటనే స్పందించి తెలంగాణలో పాత పెన్షన్ విధానాన్ని (OPS) అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

​ఈ కార్యక్రమంలో TSCPSEU మండల అధ్యక్షుడు వాసం ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి సువర్ణపాక కృష్ణ, మండల బాధ్యులు జాడి ప్రభాకర్, సుభాష్, మహిళా కార్యదర్శి రాజేంద్ర, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సీపీఎస్ సంఘ బాధ్యులు, మరియు పలువురు సీపీఎస్ ఉద్యోగులు పాల్గొన్నారు.

Like
1
Search
Categories
Read More
Telangana
బిఆర్ఎస్ నాయకుడు ఒంటెద్దు నరసింహారెడ్డి పై కేసు నమోదు చేయాలి
 నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బిఆర్ఎస్ నాయకుడు...
By Nookapangu Manikanta 2026-04-29 10:54:55 0 206
Kerala
Kerala Advances Sports Development and Training Systems
Kerala has made significant progress in sports development through upgraded training facilities,...
By Fathima Safa 2026-06-27 13:01:20 0 139
Andhra Pradesh
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాలు...
By Kothuru Murali 2026-01-06 09:11:49 0 314
Telangana
"చీరల సందడి మొదలు"|
"ఇంద్రానగర్‌లో ఇందిరమ్మ చీరల పంపిణీకి ఎమ్మెల్యే శ్రీకారం." మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :...
By Sidhu Maroju 2026-06-25 08:45:35 0 209
Gujarat
Gujarat Accelerates Employment and Economic Growth 2026
Gujarat continues to strengthen its position as one of India's leading economic hubs by promoting...
By Fathima Safa 2026-07-06 07:11:57 0 172
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com